రీమా దేబ్‌నాథ్ | |
---|---|
జననం | 1979/1980 (age 44–45) |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సుబ్రతా దేబ్‌నాథ్
(m. 2007; div. 2009) |
రీమా దేబ్‌నాథ్ భారతీయ నటి. ఆమె బాడీగార్డ్ (2011) చిత్రంలో తన నటనకు ప్రసిద్ధి చెందింది, ఇందులో సవిత అనే సపోర్టింగ్ ఆర్టిస్ట్ పాత్రను పోషించింది.[1] రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన చిత్రం పీకేలోనూ ఆమె నటించింది.
ఆమె కోల్‌కతా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (CINTAA) ముంబై సభ్యురాలు.[2]
రీమా దేబ్‌నాథ్ త్రిపురలోని అగర్తలాలో జన్మించింది.[3] ఆమె తండ్రి, సురేంద్ర దేబ్‌నాథ్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్, కాగా తల్లి హిరన్ బాలా దేబ్‌నాథ్ గృహిణి.[3] రీమా దేబ్‌నాథ్ కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించింది. కోల్‌కతాలో మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. తరువాత, ఆమె కోల్‌కతా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (KFTI) లో చేరింది.[3] ఆ తరువాత, ఆమె ముంబైలోని నళిని కలామంచ్ అనే థియేటర్ నుంచి టీవీ సీరియల్‌లు, ప్రకటనలు, సినిమాలలో ఆఫర్‌లను పొందడం ప్రారంభించింది. ఆమె హిందీతో పాటు ప్రాంతీయ భాషా చిత్రాలలోనూ నటించింది.[3]
ఆమె ముంబైలోని సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (CINTAA) సభ్యురాలు. కలర్స్ టీవీలో ప్రసారమైన ధారావాహిక జై శ్రీ కృష్ణ, డిడి నేషనల్ చంద్రముఖిఫోర్ లతో సహా పలు టీవీ షోలకు ఆమె చేసింది. 9X కాలా సాయం, సోనీ సిఐడి, జీ ఆహత్, ఎన్డీటీవి ఇమాజిన్ జ్యోతి తదితర టెలివిజన్ దారావాహికలలోనూ ఆమె నటించింది[3]
2010లో జెన్ మొబైల్, 2008లో నోకియా రింగ్‌టోన్, టెలిషాపింగ్ (2008, 2009) వంటి అనేక ప్రకటనలలో ఆమె నటించింది. ఇక బెంగాలీ చిత్రం అలోయ్ ఫేరా (2005), సిందూర్ దాన్, దుల్హా అల్బేలా, భోజ్‌పురి చిత్రం దారార్ ఇన్ లలో కూడా ఆమె నటించింది. హిందీలో బాడీగుర్డ్, పీకె వంటి చిత్రాలలో ఆమె పాత్రలు పోషించింది.[3]
ఆమె 2007 జూలైలో సుబ్రతా దేబ్‌నాథ్‌ను వివాహం చేసుకుంది. రెండు సంవత్సరాల తర్వాత, ఆమె భర్త విడాకుల ప్రక్రియను ప్రారంభించాడు. అదే విచారణలో, రీమా మరణించినట్లు ముంబై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌సి చవాన్ ప్రకటించారు. మరుసటి రోజు, ఇది 'టైపోగ్రాఫికల్' లోపం అని న్యాయమూర్తి ప్రకటించి స్టెనోగ్రాఫర్ చేత ఆర్డర్‌ను మార్పించాడు.[3]