వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రుతురాజ్ దశరత్ గైక్వాడ్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పూణే, మహారాష్ట్ర, భారతదేశం | 1997 జనవరి 31|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 88) | 2021 28 జులై - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2021 29 జులై - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2016 - ప్రస్తుతం | మహారాష్ట్ర క్రికెట్ టీమ్ | |||||||||||||||||||||||||||||||||||
2020 - ప్రస్తుతం | చెన్నై సూపర్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 25 అక్టోబర్ 2021 |
రుతురాజ్ దశరత్ గైక్వాడ్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మహారాష్ట్ర తరపున, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తాడు. రుతురాజ్ ఐపీఎల్-2021లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.[1]
రుతురాజ్ గైక్వాడ్ 1997 జనవరి 31న మహారాష్ట్ర రాష్ట్రం, పుణేలో జన్మించాడు. ఆయన ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు.[2]
రుతురాజ్ గైక్వాడ్ 2016 -17లో మహారాష్ట్ర తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రంజీ ట్రోఫీతో కెరీర్ ప్రారంభించాడు. ఆయన 2018లో ఇండియా-బి జట్టుకు, ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌కు ఎంపికయ్యాడు. రుతురాజ్ 2019లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.
రుతురాజ్ గైక్వాడ్ 2019 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తొలిసారి అతడిని ఎంపిక చేసింది. అయితే ఆ సీజన్‌లో డగౌట్‌కే పరిమితం అయ్యాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో కరోనా కారణంగా యూఏఈలో నిర్వహించిన టోర్నమెంట్ లో 6 మ్యాచూలు ఆడి 204 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి 635 పరుగులు చేసి 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా’ ఎంపికై ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.[3]
రుతురాజ్ గైక్వాడ్ 2021 జూన్లో శ్రీలంక టూర్ కు ఎంపికై రెండు ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడి 35 పరుగులు చేశాడు
రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర దేశవాలీ క్రికెటర్ ఉత్కర్ష పవార్‌ను 2023 జూన్ 03న మహారాష్ట్ర మహాబలేశ్వర్‌లో పెళ్లి చేసుకున్నాడు.[4][5]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)