రుద్రనేత్ర (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
నిర్మాణం | బిహెచ్. వరాహనరసింహ రాజు |
కథ | యండమూరి వీరేంద్రనాథ్ |
చిత్రానువాదం | కె.రాఘవేంద్రరావు |
తారాగణం | చిరంజీవి విజయశాంతి రాధ రావు గోపాలరావు కైకాల సత్యనారాయణ రంగనాథ్ రఘువరన్ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
ఛాయాగ్రహణం | కె.ఎస్.ప్రకాష్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | కళ్యాణి వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
రుద్రనేత్ర కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 1989 నాటి గూఢచారి చిత్రం .[1][2] యందమూరి వీరేంద్రనాథ్ కథ ఆధారంగా తీసిన ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి, రాధా, రావు గోపాలరావు నటించారు . ఈ చిత్రాన్ని సీక్రెట్ ఏజెంట్ రాజా అనే పేరుతో హిందీలోకి అనువదించారు. ఇళయరాజా స్వరపరిచిన పాటలు విజయవంతమయ్యాయి. ఈ చిత్రం కుట్ర సిద్ధాంతాలపై ఆధారపడింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.[3]
ఏజెంట్ నేత్ర ( చిరంజీవి ) స్త్రీలోలుడు. అతను సత్యనారాయణ ( రంగనాథ్ ) నడుపుతున్న డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేస్తూంటాడు. మాదకద్రవ్యాల వ్యాపారానికి నాయకత్వం వహించే ఒక పెద్దమనిషి యొక్క అండర్‌వరల్డ్ కార్యకలాపాలను తెలుసుకోవడానికి అతన్ని నియమించారు. అతను తన ఔషధాలను పరీక్షించచడానికి తన పెద్ద కుమార్తె రేఖను ఉపయోగిస్తాడు. నేత్ర ఒక పోరాట సన్నివేశం తరువాత ఒక రహస్య ప్రదేశానికి చేరుకుంటాడు. నేత్ర అగ్ని ప్రమాదంలో మరణించినట్లు కనబడుతుంది.
ఏజెంట్ విజయశాంతి నేత్రతో ప్రేమలో ఉంటుంది. అతడి మిషన్ను ఈమె కొనసాగిస్తుంది. ఆమె నేత్ర చనిపోయిన గ్రామానికి చేరుకుని, తన అతిథి గృహంలో సేవకురాలిగా నేత్ర డూపు (వాస్తవానికి నేత్రయే) యాదగిరిని కలుస్తుంది. అతను ఆమెను మునిగిపోకుండా కాపాడుతాడు. తాను ఎలా తప్పించుకున్నాడో చెబుతాడు.
విజయశాంతి బామ్మ తనకు తెలియకుండానే సోదరీమణులు హంసలేఖ, స్వర్ణ రేఖల ఫోటోలను తారుమారు చేస్తుంది. వాళ్ళ పనుల గురించి తెలుసుకోవడానికి రేఖను ట్రాప్ చేయమని విజయశాంతి నేత్రకు సూచిస్తుంది. కానీ ఫోటోల తారుమారు గురించి ఆమెకు తెలియదు. ఆమె అతనికి రాధ ఫోటో ఇస్తుంది. నేత్ర రాధను బంధిస్తాడు. ఆమె అతనితో ప్రేమలో పడుతుంది. నేత్ర విజయశాంతి మలేషియా వెళ్ళి అధోలోకపు మూలాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. రేఖ తన సొంత కుమార్తె కాదని, అతను ఆమెపై ప్రయోగాలు చేసి చంపాడని బిగ్‌బాస్ వెల్లడిస్తాడు. రాధ తన తండ్రి క్రూరత్వాన్ని తట్టుకోలేక అతన్ని కాల్చడానికి ప్రయత్నిస్తుంది. కాని అతను తప్పించుకుంటాడు. నేత్ర, విజయశాంతి విలన్లపై దాడి చేసి వారి స్థావరాన్ని నాశనం చేస్తారు. విజయశాంతి రాధ మంచి స్నేహితులు అవుతారు. ఈ ముగ్గురు కలవడంతో కథ ముగుస్తుంది