వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రుసితోంజీ షెరియార్ మోడీ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బొంబాయి | 1924 నవంబరు 11|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1996 మే 17 ముంబై | (వయసు 71)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం పేస్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 31) | 1946 జూన్ 22 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1952 నవంబరు 13 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 సెప్టెంబరు 3 |
రుసితోంజీ షెరియార్ మోడీ (1924 నవంబరు 11 - 1996 మే 17) భారత జాతీయ క్రికెట్ జట్టుకు 1946 నుండి 1952 వరకు ఆడిన భారతీయ క్రికెటరు.
మోదీ పార్సీ వర్గానికి చెందినవాడు.[1] అతని టెస్ట్ కెరీర్ 1946లో ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో ప్రారంభమైంది. ఇది సర్ అలెక్ బెడ్సర్ ఆడిన తొలి మ్యాచ్ కూడా. అందులో అతను పదకొండు వికెట్లు సాధించిన గుర్తింపు కూడా ఆ మ్యాచ్‌కి ఉంది. యాదృచ్ఛికంగా, ఈ టెస్టు భారత్ ఆటగాళ్ళు విజయ్ హజారే, వినూ మన్కడ్‌లకు కూడా తొలి మ్యాచే.
రుసీ మోడీ పరుగులు కూడగట్టేవాడు. ఈ వాస్తవం అతని టెస్ట్ సగటు 46, ఫస్ట్-క్లాస్ సగటు 53 లలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను కొంత మీడియం-పేస్ బౌలింగ్ కూడా చేశాడు. ఆడిన క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో అతను ఒక్కసారి ఐదు వికెట్ల పంట తీసాడు.
17 ఏళ్ల వయసులో బాంబే పెంటాంగ్యులర్ పోటీలో ఆడిన తొలిమ్యాచ్‌లోనే సెంచరీ చేసి మోదీ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు. 1943/44, 1944/45 మధ్య రంజీ ట్రోఫీలో, అతను బాంబే తరపున వరుస మ్యాచ్‌లలో ఐదు సెంచరీలు, మొత్తం ఏడు సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో 1943/44లో 168 v మహారాష్ట్ర, 128 v వెస్ట్రన్ ఇండియా, 1943/44లో 160 v సింధ్, 210 v వెస్ట్రన్ ఇండియా, 245* & 31 v బరోడా, 113 v నార్తర్న్ ఇండియా, 98 & 151 v హోల్కర్‌లు అన్నీ 1944/45లోనే చేసాడు. 1944/45లో కేవలం ఐదు రంజీ మ్యాచ్‌లలో అతని చేసిన మొత్తం స్కోరు 1008. ఇది నలభై ఏళ్ల పాటు నిలిచి ఉన్న రికార్డు. అతను అన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 1375 పరుగులు చేశాడు. అప్పటికి మోదీ వయసు 20 ఏళ్లు మాత్రమే.
రంజీలో రెండు డబుల్ సెంచరీలు కాకుండా, మోడీ 1944/45 సీజన్‌లో పార్సీల తరఫున 215 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతను ఆస్ట్రేలియన్ సర్వీసెస్ ఎలెవన్‌పై 203 పరుగులు చేశాడు. ఇది భారతదేశం ఆడిన ప్రాతినిధ్య మ్యాచ్‌లలో అది మొదటి డబుల్ సెంచరీ. మోదీ తన ఇన్నింగ్స్‌లన్నింటిలో ఇదే అత్యుత్తమమైనదిగా భావించాడు. మోడీ రంజీ ట్రోఫీలో బొంబాయికి ప్రాతినిధ్యం వహించాడు, అక్కడ అతను 81.69 సగటుతో 2196 పరుగులు చేసాడు.
1946 వేసవిలో, భారతదేశం ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు, మోడీ దేశీయ సర్క్యూట్‌లో కొంత అనుభవం సాఅధించి ఉన్నాడు. ఐదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టి, 1944-45 రంజీ ట్రోఫీ సీజన్‌లో అద్భుతమైన సగటు, 201 తో 1008 పరుగులు చేయడం వంటి కొన్ని అద్భుతమైన ప్రదర్శనల నేపథ్యంలో భారత జట్టులో ఎంపికయ్యాడు. 44 సంవత్సరాల తర్వాత WV రామన్ 1018 పరుగులు చేసి, దాన్ని దాటే వరకు, ఆ రికార్డు లానే ఉంది. బ్యాట్‌తో చేసిన విన్యాసాలు ఆకట్టుకునేలా చూడగలిగేలా చేసినందున, మోడీ అప్పటికే భారీ రన్-మేకర్‌గా ఖ్యాతిని పొందారు: 1943–44, 1944–45 సీజన్లలో బాంబే తరఫున వరుసగా ఏడు రంజీ మ్యాచ్‌లలో సెంచరీలు, 1944-45లో మూడు డబుల్ సెంచరీలు, ఆ తర్వాతి సంవత్సరం ఆస్ట్రేలియన్ సర్వీసెస్ జట్టుపై నాల్గవ శతకం చేసాడు.[2]
ఆ విధంగా, మోడీ జట్టులోకి ఎంపికవడం ఆశ్చర్యమేమీ లేదు. మ్యాచ్ ప్రారంభమైనప్పుడు, మోడీ ప్రవేశించినప్పుడు భారత్ 44–3 తో తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. అతను వెంటనే లెగ్ స్పిన్నర్ డౌగ్ రైట్‌పై మెరుపులు మెరిపించాడు, కానీ వాలీ హమ్మండ్ అతనిచ్చిన క్యాచ్‌ను వదిలేసాడు. ఆ తర్వాత, అతను 57 * స్కోరు చేసాడు. 'ఎ లాంగ్ ఇన్నింగ్స్' పుస్తకంలో విజయ్ హజారే, "క్యాచ్ వదిలేసాక, మోడీ నిర్లక్ష్యంగా భారతీయ డ్రెస్సింగ్ రూమ్‌కి థంబ్స్ అప్ ఇచ్చి, ఆట కొనసాగిస్తూ చక్కటి స్ట్రోక్‌లు ఆడాడు". [3]
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మోదీ 5 ఇన్నింగ్స్‌లలో 34.25 సగటుతో 137 పరుగులు సాధించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ సిరీస్‌లో విజయ్ మర్చంట్, జో హార్డ్‌స్టాఫ్ జూనియర్, డెనిస్ కాంప్టన్, సిరిల్ వాష్‌బ్రూక్ తర్వాత అత్యధిక పరుగులు చేసి ఐదవ స్థానంలో నిలిచారు. . [4] అయితే, ఆ పర్యటనలో అతను 37.37 సగటుతో 1196 పరుగులు చేసి మొత్తం మీద మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.
1948-49లో వెస్టిండీస్ భారత పర్యటనలో, మోడీ ఐదు టెస్టుల్లో ఒక వంద, ఐదు అర్ధ సెంచరీలతో 560 పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. బ్రాబోర్న్ స్టేడియంలో వెస్టిండీస్‌పై అతను సాధించిన 112 పరుగులు అతని ఏకైక టెస్ట్ సెంచరీ. ఇది అతని ఐదవ టెస్టులో, ఆ సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో వచ్చింది. మొత్తం సిరీస్‌లో మోడీ నిలకడగా ఆడాడు. మూడు మ్యాచ్‌లలో ఒక్కొక్కదానిలో 90 పైచిలుకు పరుగులు చేశాడు. బాంబేలో అతని 112 పరుగుల తరువాత అతను విజయ్ హజారేతో ముఖ్యమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. భారత్ 361 పరుగులను ఛేదించిన ఆఖరి టెస్టులో వాళ్ళు చేసిన 139, వాటిలో ముఖ్యమైనది. అతను మొత్తం సిరీస్‌లో హజారేతో కలిసి నాలుగు సెంచరీ భాగస్వామ్యాలను సాధించాడు.
ఆ తర్వాత అతని వృత్తిపరంగా తీరిక లేనందువల్ల అతని కెరీర్ ప్రభావితమైంది. 1957/58 వరకు బాంబే తరపున ఆడాడు. 1952/53లో మహారాష్ట్రతో జరిగిన ఒక మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఉన్నాడు. పది అనధికారిక టెస్టుల్లో అతను 35.31 సగటుతో 565 పరుగులు చేశాడు.
మోడీ టేబుల్ టెన్నిస్‌లో కూడా మంచి ప్రతిభ కనబరిచాడు. అంతర్ రాష్ట్ర మ్యాచ్‌లలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంటర్ కాలేజియేట్ టెన్నిస్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. 1964లో క్రికెట్ ఫర్‌ఎవర్‌తో ప్రారంభించి అనేక పుస్తకాలు రాశాడు.
అతను బొంబాయి గవర్నర్ రాజా మహారాజా సింగ్‌కు ADC గా పనిచేశాడు. తరువాత అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీలో ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ అయ్యాడు. బ్రాబోర్న్ స్టేడియంలో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా పెవిలియన్‌లో ఉండగా గుండెపోటుతో మరణించాడు.