రూబెన్ డేవిడ్

రూబెన్ డేవిడ్ (1912 సెప్టెంబరు 19 - 1989 మార్చి 24) జంతు శాస్త్రవేత్త, భారతదేశంలోని గుజరాత్ అహ్మదాబాద్ కాంకరియా జంతు ప్రదర్శనశాల స్థాపకుడు.[1]

జీవిత చరిత్ర

[మార్చు]

అతను అహ్మదాబాద్లోని బెనె ఇజ్రాయెల్ యూదు కుటుంబంలో జన్మించాడు.[2] అతను జోసెఫ్ డేవిడ్ చిన్న కుమారుడు.[3] అతను స్వయంగా అభ్యసించిన పశువైద్యుడు. నగరంలో జంతుప్రదర్శనశాలను నిర్మించడానికి 1951లో అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అతనిని ఆహ్వానించింది.[2] అతను కాంకరియా జంతుప్రదర్శనశాలను (ఇప్పుడు కమలా నెహ్రూ జూలాజికల్ గార్డెన్), చాచా నెహ్రూ బల్వాటికా (చిల్డ్రన్స్ పార్క్), నేచురల్ హిస్టరీ మ్యూజియంను కూడా స్థాపించాడు, తరువాత దీనికి ఆయన పేరు పెట్టారు.[4][5][6][7] క్యాన్సర్ కారణంగా అతను మాట్లాడుటను కోల్పోయాడు. [6] అహ్మదాబాద్లోని సుందర్వన్, గాంధీనగర్ ఇంద్రోడా పార్కులకు సలహాదారుగా కూడా పనిచేశాడు.[4]

అతను గుజరాత్ ప్రభుత్వంలో రిటైర్డ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అయిన ఎం. ఎ. రషీద్తో కలిసి ది ఆసియాటిక్ లయన్ (1991) ను రచించాడు.[4]

అతనూ జూలాజికల్ సొసైటీ (FZS) లో ఫెలోగా ఉన్నాడు .[8] 1975లో భారత ప్రభుత్వం అతనిని పద్మశ్రీ తో సత్కరించింది.[4]

ఆస్ట్రేలియన్ మానవ శాస్త్రవేత్త కోలిన్ గ్రోవ్స్ 1981లో చరిత్రపూర్వ వార్థాగ్ను కనుగొని, మధ్య ఆసియా పందికి అతని పేరు మీద సుస్ స్క్రోఫా డేవిడి అని పేరు పెట్టారు.[5][8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రచయిత్రి ఎస్తేరు డేవిడ్ అతని కుమార్తె.[5]

మూలాలు

[మార్చు]
  1. "Reuben David (1912 -1989) - Esther David". Esther David (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-09-19.
  2. 2.0 2.1 "Animal instinct". intoday.in.
  3. Gujarat State Gazetteer (in ఇంగ్లీష్). Director, Government Print., Stationery and Publications, Gujarat State. 1989. p. 342.
  4. 4.0 4.1 4.2 4.3 "AMC to mark 100th birth anniversary of zoologist Reuben David today". Indian Express. Retrieved 2014-02-24.
  5. 5.0 5.1 5.2 John, Paul (2019-09-28). "Reuben David's legacy crumbling into oblivion". The Times of India.
  6. 6.0 6.1 "Ahmedabad zoo architect Reuben David remembered on 100th birth anniversary". The Indian Express. 2012-09-20.
  7. Thomas, Amelia (11 January 2008). The Zoo on the Road to Nablus. PublicAffairs. ISBN 9781586486587.
  8. 8.0 8.1 Groves, Colin P. (1981). Ancestors for the Pigs: Taxonomy and Phylogeny of the Genus Sus (in ఇంగ్లీష్). Department of Prehistory, Research School of Pacific Studies, Australian National University. p. 38. ISBN 978-0-909596-75-0.