రెబల్

రెబల్
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీను వైట్ల
నిర్మాణం జె.భగవాన్, జె.పుల్లారావ్
రచన డార్లింగ్ స్వామి
తారాగణం ప్రభాస్,
దీక్షాసేథ్,
తమన్నా
సంగీతం రాఘవ లారెన్స్
కూర్పు మార్తాండ్.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా
భాష తెలుగు

ప్రభాస్, దీక్షాసేథ్, తమన్నా ప్రధాన పాత్రధారులుగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మించిన చిత్రం ‘రెబల్’. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రంలో ప్రభాస్, తమన్నా, దీక్ష సేథ్ ముఖ్య పాత్రల్లో నటించారు.[1] దర్శకత్వం కాకుండా, రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి నృత్యాలు, చిత్రానువాదం, సంగీత దర్శకత్వం కూడా నిర్వహించాడు. ఈ చిత్రం 2012 సెప్టెంబరు 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీనిని హిందీలో ది రిటర్న్ ఆఫ్ రెబెల్ (2014) గా, తమిళంలో వీరబలి గా మలయాళంలో రెబెల్గా అనువదించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ చేతన్యా ఆదిబ్ హిందీలో ప్రభాస్ పాత్రకు స్వరాన్ని ఇచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.

రిషి ( ప్రభాస్ ) భూపతి ( కృష్ణరాజు ) కుమారుడు. సరదాగా జీవుతాన్ని గడుపుతూంటాడు. తన తండ్రి ఆదర్శాలచే ప్రభావితమయ్యాడు. అతనిలాగే పెరుగుతాడు. అయితే, భూపతి తన కొడుకు హింసను చేపట్టడం ఇష్టం లేదు. చదువుకోడానికి సంగీతం నేర్చుకోవటానికీ అతన్ని బెంగళూరుకు పంపుతాడు. అక్కడ, రిషి దీపాలి ( దీక్షా సేథ్ ) అనే అనాథ ప్రేమలో పడి, తన పాత సంగీత టీచరని చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకువస్తాడు.  

తమ గ్రామంలో జరిగిన పండుగ సందర్భంగా, భూపతినీ, అతని కుటుంబాన్నీ చంపడానికి సింహాద్రి ( ప్రదీప్ రావత్ ) 100 మంది దుండగులను పంపుతాడు. కాని రిషి మొత్తం 100 మందినీ తొలగిస్తాడు. భూపతి సోదరుడు జయరామ్ ( ముఖేష్ రిషి ), సింహాద్రితో చేతులు కలిపి భూపతిని, భూపతి భార్య లక్ష్మినీ ( రమాప్రభ ), దీపాలిలను చంపాలని ప్రయత్నిస్తారు. భూపతినీ అతని కుటుంబాన్నీ చంపడానికి జైరామ్‌కు స్థానిక గూండా సహాయం చేశాడని సింహాద్రి రిషికి చెబుతాడు.

రెండు సంవత్సరాల తరువాత, స్టీఫెన్ ( కెసి శంకర్ ) అనే గూండా హైదరాబాద్‌లో చాలా కాలం నుండి అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు రిషి తెలుసుకుంటాడు. భూపతి హత్య జరిగిన వెంటనే రాబర్ట్ ( ముఖేష్ రిషి ) స్టీఫెన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాడని రిషి తెలుసుకుంటాడు. స్టీఫెన్, రాబర్ట్ లు శక్తివంతమైన అండర్ వరల్డ్ డాన్స్ అయ్యారు. తన మామయ్యే ఈ కొత్త రాబర్ట్ అని రిషి అనుమానించాడు. అతను హైదరాబాద్ వెళ్లి స్టీఫెన్, రాబర్ట్ లకు బ్యాంకాక్లో నాను ( తేజ్ సప్రు ) అనే సహాయకుడున్నాడని తెలుసుకుంటాడు. నాను కుమార్తె నందిని ( తమన్నా ). ఆమె, రిషి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఆమె స్టీఫెన్, రాబర్ట్ ల ఫోటోలు చూడాలనుకున్నపుడు నాను తన ఫోన్‌ను నందినికి చూపిస్తాడు. వాటిని బట్టి, రిషి మామయ్యే రాబర్ట్ అని నిర్ధారణౌతుంది. భూపతిని చంపడానికి రాబర్ట్ స్థానిక గూండా సహాయం చేశాడని సింహాద్రి రిషికి చెప్పినందున, ఆ గూండా స్టీఫెన్ అయి ఉండాలి. తరువాత, రిషి విషాద గతం గురించి రాజు నందినితో చెబుతాడు. స్టీఫెన్, రాబర్ట్‌లను గుర్తించడంలో రిషికి సహాయం చేయాలని నందిని అనుకుంటుంది.

నానును రక్షించడాన్ని ఆపడానికి రిషి నాను అనుచరులకు లంచం ఇస్తాడు. స్టీఫెన్, రాబర్ట్‌లను ఉచ్చులోకి లాగడానికి ఒప్పుకునేవరకు రిషి నానును హింసిస్తాడు. స్టీఫెన్, రాబర్ట్ లు తమ అనుచరులిద్దరిని తమ పేర్లతో పంపినట్లు తెలుస్తుంది. స్టీఫెన్, రాబర్ట్ లు రిషీని మోసం చేసినందుకు నాను సంతోషిస్తాడు. తన బాడీగార్డులు, రాజు, నందినిలను విలన్లు కిడ్నాప్ చేసారని రిషికి తెలుస్తుంది. రిషి విలన్లను ఎదుర్కోవడం, తన వారిని రక్షించుకోవడం మిగతా కథ.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."కేక"రామజోగయ్య శాస్త్రిబెన్నీ దయాళ్, లాయిడ్ పాల్, సత్యన్, నరేష్ అయ్యర్4:09
2."దీపాళి"రామజోగయ్య శాస్త్రికార్తిక్, ప్రియా హేమేష్, దియా4:35
3."గూగుల్"భాస్కరభట్ల రవికుమార్ఆండ్రియా జెరెమియా, శ్రావణ భార్గవి,4:40
4."ఓరి నాయనో"రామజోగయ్య శాస్త్రిమాలతి, విజయ్ ప్రకాష్5:09
5."ఎక్సలెంటు నీ ఫిగరు"రామజోగయ్య శాస్త్రిబెన్నీ దయాళ్, లాయిడ్ పాల్, సత్యన్, నరేష్ అయ్యర్3:20
మొత్తం నిడివి:21:53

మూలాలు

[మార్చు]
  1. "Prabhas with Tamannaah, Deeksha". sify.com. Archived from the original on 15 సెప్టెంబరు 2011. Retrieved 13 September 2011.