![]() రెబెక్కా జేన్ రోల్స్ (2020) | |||
వ్యక్తిగత సమాచారం | |||
---|---|---|---|
పూర్తిపేరు | రెబెక్కా జేన్ రోల్స్[1] | ||
జనన తేదీ | [1] | 1975 ఆగస్టు 22||
జనన ప్రదేశం | నేపియర్, న్యూజీలాండ్[2] | ||
ఎత్తు | 1.78 మీ. (5 అ. 10 అం.)[1] | ||
ఆడే స్థానం | Goalkeeper | ||
క్లబ్ సమాచారం | |||
ప్రస్తుత క్లబ్ | Three Kings United | ||
సీనియర్ కెరీర్* | |||
సంవత్సరాలు | జట్టు | Apps† | (Gls)† |
Metro F.C. | |||
Three Kings United | |||
జాతీయ జట్టు | |||
1994– | New Zealand | 21[3] | (0) |
|
రెబెక్కా జేన్ రోల్స్ (జననం 1975, ఆగస్టు 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, అసోసియేషన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి. రెండు క్రీడలలో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది.[4] క్రికెట్‌లో, వికెట్ కీపర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 1997 - 2007 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 1 టెస్టు మ్యాచ్, 104 వన్డే ఇంటర్నేషనల్స్, 2 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్, ఆక్లాండ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[5][6] ఫుట్‌బాల్‌లో, న్యూజిలాండ్ తరపున 21 సార్లు ఆడింది.
రోల్స్ సుదీర్ఘ వన్డే అంతర్జాతీయ కెరీర్‌ను కలిగి ఉంది. డెబ్బీ హాక్లీ తర్వాత 100 వన్డే మైలురాయిని చేరుకున్న రెండవ న్యూజిలాండ్ మహిళగా నిలిచింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ గా రాణించింది. 2000లో లింకన్‌లో జరిగిన విజయవంతమైన మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడింది. స్టేట్ లీగ్‌లో ఆక్లాండ్ హార్ట్స్ తరపున కూడా ఆడింది.నేపియర్‌లో జన్మించింది.
రెబెకా రోల్స్ మహిళల వన్డే చరిత్రలో వికెట్ కీపర్‌గా 2000 పరుగులు, 100 అవుట్‌లను అవుట్ చేయడం ద్వారా డబుల్‌ను పూర్తిచేసిన మొదటి మహిళా క్రికెటర్ కూడా నిలిచింది.[7]
రెబెక్కా రోల్స్ వన్డే ఇంటర్నేషనల్ సెంచరీలు | |||||||
---|---|---|---|---|---|---|---|
# | పరుగులు | మ్యాచ్ | ప్రత్యర్థులు | నగర దేశం | వేదిక | సంవత్సరం | |
1 | 114 | 48 | ![]() |
లింకన్, న్యూజిలాండ్ | బెర్ట్ సట్క్లిఫ్ ఓవల్ | 2002[8] | |
2 | 104 * | 99 | ![]() |
చెన్నై, భారతదేశం | చెంప్లాస్ట్ క్రికెట్ గ్రౌండ్[9] | 2007[10] |