రొటీన్ లవ్ స్టొరీ | |
---|---|
దర్శకత్వం | ప్రవీణ్ సత్తారు |
రచన | ప్రవీణ్ సత్తారు |
నిర్మాత | చాణక్య బూనేటి |
తారాగణం | సందీప్ కిషన్ రెజీనా |
ఛాయాగ్రహణం | సురేష్ భార్గవ్ |
కూర్పు | ధర్మేంద్ర |
సంగీతం | మిక్కీ జే మేయర్ |
విడుదల తేదీ | 23 నవంబరు 2012 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹2.5 crore (US$3,10,000) |
బాక్సాఫీసు | ₹12.5 crore (US$1.6 million) |
రొటీన్ లవ్ స్టోరీ 2012లో విడుదలైన తెలుగు చలనచిత్రం. చాణక్య బూనేటి నిర్మించగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు.[1] సందీప్ కిషన్, రెజీనా ప్రధాన పాత్రలలో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.[2] 2012 నవంబరు 23న విడుదలయ్యి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
సంజు (సందీప్ కిషన్) ఇంజనీరింగ్ స్టూడెంట్. తొలిచూపులోనే అతను తన్వి (రెజీనా)తో ప్రేమలో పడతాడు. అయితే ఆ విషయాన్ని ఆమెకు చెప్పకుండా, ఆ ప్రేమను ఒంటరిగా ఆస్వాదిస్తూ ఉంటాడు. ప్రేమను వ్యక్తం చేసిన దగ్గర నుండి లేనిపోని చిక్కులు వస్తాయన్నది అతని భయం. కానీ తప్పని పరిస్థితుల్లో, స్నేహితుల ఒత్తిడిమేరకు తన్వికి తన మనసులో మాట చెప్పేస్తాడు. 'నీ గురించి ఏమీ తెలియకుండా ఎలా ప్రేమిస్తాను' అంటుంది తన్వీ. ఆమె వాదనలోనూ పాయింట్ ఉందంటారు స్నేహితులు. కాలేజీ ట్రిప్‌లో ఊహించని ప్రమాదంలో పడిన ఈ యువ జంటకు ఒకరి పట్ల ఒకరికి అభిమానం పెరుగుతుంది. కానీ తన ప్రేమను వ్యక్తం చేయడానికి మరికాస్త సమయం కోరుతుంది తన్వీ. దాంతో సంజు ఆమెతో తెగతెంపులు చేసుకుంటాడు. తిరిగి స్నేహితుల సహకారంతో వీరిద్దరూ ఎలా ఒకటి అయ్యారన్నది మిగతా కథ.[3]
క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "నా మనసుపై" | శ్రీరామచంద్ర | 4:16 | ||||||
2. | "నీతోనే ఉన్నా" | మిక్కీ జె మేయర్ | 4:41 | ||||||
3. | "వేల తళుకుతారలే" | కార్తిక్ | 4:43 | ||||||
4. | "ఎప్పతికైనా" | నరేష్ అయ్యర్ | 4:42 | ||||||
5. | "నీ వరస నీదే" | కార్తిక్ | 4:38 | ||||||
6. | "Routine Love Story Theme" | దీపు | 1:28 | ||||||
24:28 |