ఆర్కే రోజా | |||
రోజా సెల్వమణి | |||
ఆంధ్రప్రదేశ్ టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2022 ఏప్రిల్ 11 – 2024 జూన్ 04 | |||
శాసనసభ్యురాలు
| |||
పదవీ కాలం 2014 జూన్ 19 – 2024 జూన్ 04 | |||
ముందు | గాలి ముద్దుకృష్ణమ నాయుడు | ||
---|---|---|---|
నియోజకవర్గం | నగరి | ||
వైస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు
| |||
పదవీ కాలం 2015 – 2021 | |||
తెలుగు మహిళా అధ్యక్షురాలు
| |||
పదవీ కాలం 1999 – 2009 | |||
పదవీ కాలం 2019 జులై 09 – 2021 జులై 17 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1972 నవంబరు 17||
తల్లిదండ్రులు | నాగరాజా రెడ్డి, లలిత | ||
జీవిత భాగస్వామి | [1] | ||
సంతానం | అన్షు మాలిక, కృష్ణ కౌశిక్ | ||
వృత్తి |
|
రోజా సెల్వమణిగా పేరు గాంచిన శ్రీలతా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది. రోజా నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది.[2] ఆమె 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.[3][4][5] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్యాటక, క్రీడలు, యువజన మంత్రిగా నియమితులయ్యారు. మంత్రి అయినందుకు ఇక మీదట టీవీ, సినిమా షూటింగ్‌లలో చెయ్యనని ప్రకటించారు.[6][7] ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి.[8]
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా ఆర్కే రోజాకు 2023 జనవరి 30న చోటు లభించింది. దీంతో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సాయ్ కి ఆమె దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.[9]
రోజా 1972 నవంబరు 17లో చిత్తూరు జిల్లా, తిరుపతిలో నాగరాజురెడ్డి, లలిత దంపతులకు జన్మించింది. ఈమెకు కుమారస్వామిరెడ్డి, రాంప్రసాదరెడ్డి అని ఇరువురు సోదరులు ఉన్నారు. చిత్తూరు జిల్లాలోనే పుట్టినా హైదరాబాదులో కుటుంబం స్థిరపడింది. ప్రస్తుతం హైదరాబాదులో కుటుంబంతో సహా నివాసం ఏర్పరచుకుంది. రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివింది. తర్వాత నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రురాలైంది. కొన్ని సంవత్సరాలు, రోజా కూచిపూడి నృత్యాన్ని అభ్యసించింది.
2002 ఆగస్టు 21న రోజా ఆర్‌కే సెల్వమణిని పెళ్ళిచేసుకుంది. వీరికి ఇరువురు సంతానం, ఒక కొడుకు, ఒక కూతురు.
2004, 2009 శాసనసభ ఎన్నికలలోనగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలోనగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందింది.
2014 నవంబరులో నగరి నియోజకవర్గం వైయస్సార్ పార్టీ తరపు నుండి పోటి చేసి శాసనసభ్యురాలిగా గెలుపొందారు, ఆమె 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి [10], 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి[3], ఏప్రిల్ 13న పదవీ బాధ్యతలు చేపట్టింది.[11]
రోజా తెలుగు చిత్రాలతో చిత్రరంగ ప్రవేశం ఉంది. శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించింది. తరువాత, సినీ నిర్మాతగా వ్యవహరించింది.
తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకుడు ఆర్. కె. సెల్వమణి చెంబరుతి చిత్రం ద్వారా రోజాను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్రపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో రోజా మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగించింది. వెండితెరపైనే కాక బుల్లితెరపై జబర్దస్త్ (ఈ టివి), బతుకు జట్కాబండి (జీ తెలుగు), రంగస్థలం (జెమినీ టి.వి) వంటి కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించింది.
ఏడాది | కార్యక్రమం | ఛానల్ |
---|---|---|
2010–2013 | మోడ్రన్ మహాలక్ష్ములు | మా టీవీ |
2014-2015 | రేస్ | జీ తెలుగు |
2013 | జబర్దస్త్ | ఈ టీవి |
2014 | ఎక్షట్రా జబర్దస్త్ | ఈ టీవి |
2016 | రచ్చబండ | జెమినీ టీవీ |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)