రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ | |
---|---|
![]() | |
భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ | |
![]() | |
Ministry అవలోకనం | |
స్థాపనం | జూలై 1942 |
అధికార పరిధి | భారత ప్రభుత్వం |
ప్రధాన కార్యాలయం | ట్రాన్స్‌పోర్ట్ భవన్, 1, పార్లమెంటు వీధి, న్యూ ఢిల్లీ 28°37′9.58″N 77°12′37.29″E / 28.6193278°N 77.2103583°E |
వార్షిక బడ్జెట్ | ₹2,70,435 crore (US$34 billion) (2023-24 est.)[1] |
Minister responsible | నితిన్ గడ్కరీ, క్యాబినెట్ స్థాయి మంత్రి |
Ministry కార్యనిర్వాహకుడు/ | అనురాగ్ జైన్, కార్యదర్శి |
Child agencies | ఎన్‌హెచ్‌ఏఐ NHIDCL |
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH), భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ. ఇది రహదారి రవాణా, రవాణా పరిశోధనలకు సంబంధించిన నియమాలు, నిబంధనలు, చట్టాల సూత్రీకరణ, నిర్వహణకు, భారతదేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ సామర్థ్యాన్ని, చలనశీలతనూ పెంచడానికి కృషి చేసే మంత్రిత్వ శాఖ. సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (రోడ్లు) కేడర్‌కు చెందిన అధికారుల ద్వారా దేశంలోని జాతీయ రహదారుల అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది.
రోడ్డు రవాణా అనేది దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయం. ఇది అభివృద్ధి వేగాన్ని, ఆకృతినీ, పద్ధతులనూ ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో, మొత్తం వస్తురవాణాలో 60 శాతం, ప్రయాణీకుల ట్రాఫిక్‌లో 85 శాతం రోడ్ల ద్వారా జరుగుతోంది. అందువల్ల, ఈ రంగం అభివృద్ధి భారతదేశానికి అత్యంత ముఖ్యమైనది. బడ్జెట్‌లో గణనీయమైన భాగం దీని కోసం కేటాయిస్తారు.
1942 జూలైలో అప్పటి కమ్యూనికేషన్స్ శాఖను రెండు విభాగాలుగా విభజించి యుద్ధ రవాణా శాఖను ఏర్పాటు చేసారు:[2]
యుద్ధ రవాణా శాఖకు కేటాయించిన విధుల్లో ప్రధానమైనవి ఓడరేవులు, రైల్వే ప్రాధాన్యతలు, రోడ్డు, నీటి రవాణా వినియోగం, పెట్రోల్ రేషన్, ప్రొడ్యూసర్ గ్యాస్ లు. స్థూలంగా చెప్పాలంటే, యుద్ధ రవాణా శాఖ విధులు యుద్ధ సమయంలో రవాణా, కోస్టల్ షిప్పింగ్, ప్రధాన ఓడరేవుల పరిపాలన, అభివృద్ధి కోసం డిమాండ్లను సమన్వయం చేయడం. ఆ తరువాత, రవాణా ప్రాధాన్యతలపై శాఖల నియంత్రణకు అనుబంధంగా ఎగుమతి ప్రణాళిక చేపట్టబడింది.
కిందివి ప్రాంతీయ కార్యాలయాలు, ప్రాంతీయ అధికారి (RO) నేతృత్వంలో పనిచేస్తాయి:
మంత్రిత్వ శాఖ కింద కింది విభాగాలు పనిచేస్తాయి:
మంత్రిత్వ శాఖ లోని రహదారి విభాగం దేశం లోని రోడ్ల నెట్‌వర్కు అభివృద్ధి కార్యక్రమానికి వెన్నెముక. ఇందులో సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (రోడ్లు) అధికారులు ఉంటారు. దీనికి డైరెక్టర్ జనరల్ (రోడ్ల అభివృద్ధి), భారత ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నాయకత్వం వహిస్తారు.[4]
ఈ విభాగాన్ని ఐదు ప్రాజెక్టు జోన్లుగా విభజించారు. జాతీయ రహదార్ల అభివృద్ధి, రోడ్ల నెట్‌వర్కు అభివృద్ధి కోసం ప్రతి ప్రాజెక్టు జోన్ సాధారణంగా నాలుగు నుండి ఐదు రాష్ట్రాలకు బాధ్యత వహిస్తుంది. ఈ ఐదు ప్రాజెక్టు జోన్లకు సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (రోడ్లు) కేడర్‌కు చెందిన ఐదుగురు అదనపు డైరెక్టర్ జనరళ్ళు (ADG) నాయకత్వం వహిస్తారు. వీరికి హెడ్‌క్వార్టర్ లోని జోనల్ చీఫ్ ఇంజనీర్, రీజినల్ ఆఫీసర్లు సహాయం చేస్తారు. రాష్ట్ర పీడబ్ల్యూడీల ద్వారా వారి వారి రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణల కోసం క్షేత్రస్థాయిలో ప్రాంతీయ అధికారులను నియమించారు.
ఈ విభాగపు ప్రధాన బాధ్యతలు:[5]
రవాణా విభాగపు ప్రధాన బాధ్యతలు:
ఈ జోన్‌లకు సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (రోడ్లు) కు చెందినఇద్దరు వేర్వేరు చీఫ్ ఇంజనీర్లు నాయకత్వం వహిస్తారు. ఈ జోన్ ప్రధాన బాధ్యతలు:
ఈ జోన్‌లకు సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (రోడ్లు) చీఫ్ ఇంజనీర్లు నాయకత్వం వహిస్తారు. ఈ జోన్ ప్రధాన బాధ్యతలు NH అభివృద్ధి కార్యక్రమం, సంబంధిత కార్యకలాపాల కోసం ప్రమాణాలు/నియమాలు / మార్గదర్శకాల తయారీ.
ఈ మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న స్వయంప్రతిపత్త ఏజెన్సీలు.[3]
దేశంలోని రోడ్డు రవాణాలో శాంతిభద్రతలను నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ అనేక సంవత్సరాలుగా అనేక చట్టాలను ఆమోదించింది
భారతదేశం 48.85 లక్షల కి.మీ.లతో కూడిన అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌లలో ఒకటి:[7]
రోడ్లు | పొడవు |
---|---|
జాతీయ రహదారులు/ఎక్స్‌ప్రెస్‌వేలు | 1,32,500 కి.మీ |
రాష్ట్ర రహదారులు | 1,56,694 కి.మీ |
ఇతర రోడ్లు | 56,08,477 కి.మీ |
మొత్తం | 58,97,671 కి.మీ |
భారతదేశంలోని రహదారుల మొత్తం పొడవు 1951 నుండి 2011 వరకు 60 సంవత్సరాలలో 11 రెట్లు పెరిగింది; పక్కా రోడ్ల పొడవు అదే కాలంలో 16 రెట్లు పెరిగింది. కొత్త పక్కా రహదారుల ఏర్పాటు కారణంగా భారతదేశంలో కనెక్టివిటీ చాలా మెరుగుపడింది.[8]
దేశంలోని రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం 2013–2014 కోసం సెంట్రల్ రోడ్ ఫండ్ కింద ₹19,423.88 కోట్లను ఈ క్రింది విధంగా కేటాయించింది:[9]
రకం | గ్రాంట్లు |
---|---|
రాష్ట్ర రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేం.పా.ప్రాలకు గ్రాంట్లు | ₹2,659.91 కోట్లు |
అంతర్-రాష్ట్ర కనెక్టివిటీ, జాతీయ ప్రాముఖ్యత కలిగిన రోడ్ల కోసం రాష్ట్రాలు కేం.పా.ప్రా లకు గ్రాంట్లు | ₹262.22 కోట్లు |
జాతీయ రహదారులు | ₹9,881.95 కోట్లు |
గ్రామీణ రోడ్లు | ₹5,827.20 కోట్లు |
రైల్వేలు | ₹1092.60 కోట్లు |
మొత్తం | ₹19,423.88 కోట్లు |
రోడ్ల రంగంలో ప్రైవేటు, విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందించింది. రహదారి వంతెనలు, టోల్ రోడ్లు, వాహన సొరంగాల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి, కార్గో నిర్వహణ వంటి రవాణాకు సంబంధించిన సేవలు భూ రవాణాకు సంబంధించిన వాటికి, రోడ్లు, వంతెనల నిర్మాణం, నిర్వహణ; బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT) ప్రాతిపదికన నిర్మించిన రోడ్లు, రహదారుల నిర్మాణం, నిర్వహణ, టోల్ వసూలు రంగాల్లో 100% విదేశీ పెట్టుబడికి అనుమతించింది.
ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి హైవే నిర్మాణ ప్రాజెక్టులకు సెక్షన్ 80 IA కింద 10 సంవత్సరాల పన్ను మినహాయింపు మంజూరు చేసింది. ఈశాన్య భారతంలో మారుమూల ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం మంత్రిత్వ శాఖ 'ఈశాన్య ప్రాంతంలో ప్రత్యేక యాక్సిలరేటెడ్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్'ను రూపొందించింది. ప్రతిపాదన అంచనా వ్యయం US$2.53 బిలియన్లు. కేంద్ర బడ్జెట్ 2012–13 రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేటాయింపులను 14% పెంచి ₹25,360 crore (US$3.2 billion) ప్రతిపాదించింది.
భారతదేశంలో US$17.21 బిలియన్ల డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టు లోని తూర్పు భాగపు మొదటి దశను అభివృద్ధి చేయడానికి ప్రపంచ బ్యాంక్ US$975 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొదటి దశ కోసం US$14.56 బిలియన్ల నిధుల కోసం జపనీస్ బ్యాంక్ ఆఫ్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్‌తో ఒప్పందం చేసుకుంది. ఇది 2016లో ప్రారంభించబడే అవకాశం ఉంది [10]
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY) భారతదేశంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించిన పథకం. గ్రామీణ రహదారుల నిర్మాణం (CRRP) గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించిన మరొక కార్యక్రమం.
రవాణా మంత్రిత్వ శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ 2016లో గ్రీన్ హైవేస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.[11][12][13]
15. https://sarathi.parivahan.gov.in/SarathiReport/sarathiHomePublic.do