రోనా-లీ షిమోన్ | |
---|---|
![]() 2017లో లాస్ ఏంజిల్స్ ఫౌడా ప్యానెల్‌లో రోనా-లీ షిమోన్ | |
జననం | రోనా-లీ షిమోన్ 1983 జనవరి 9 రామత్ గన్, ఇజ్రాయెల్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2006-ప్రస్తుతం |
వీటికి ప్రసిద్ధి | ఫౌడా |
ఎత్తు | 5 ft 9 in (1.75 m) |
రోనా-లీ షిమోన్ (ఆంగ్లం: Rona-Lee Shimon; జననం 1983 జనవరి 9) ఇజ్రాయెలీ నటి, నర్తకి, మోడల్. ఆమె ప్రధానంగా ఇజ్రాయెలీ టెలివిజన్ సిరీస్ ఫౌడాలోని తన పాత్రతో ప్రసిద్ధి చెందింది.
రోనా-లీ షిమోన్ ఇజ్రాయెల్‌లోని రామత్ గన్‌లో ఒక యూదు కుటుంబంలో జన్మించింది. ఆమె మూడు సంవత్సరాల వయస్సులోనే బ్యాలెట్ పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించింది. 12 సంవత్సరాల వయస్సులో, ఆమె ఇజ్రాయెలీ నృత్య బృందం బ్యాట్ డోర్ లో చేరింది. ఉన్నత పాఠశాలలో చదువు పూర్తి కాగానే, ఆమె స్కాలర్‌షిప్‌తో ఆమ్‌స్టర్‌డామ్‌లోని రాయల్ బ్యాలెట్ అకాడమీకి హాజరయింది. ఆమె వృత్తిపరంగా నృత్యం చేయడానికి ఇజ్రాయెల్‌కు తిరిగి వచ్చింది.[1] ఆమె సోదరి, శివన్ నోమ్ షిమోన్ కూడా నటి, ఆమె 2015 ఇజ్రాయెలీ డ్రామా ఫిల్మ్ బ్లష్‌లో నటించింది. ఆమె సోదరుడు అల్మోగ్ షిమోన్ ఆమెకు ఫౌడా కోసం తుపాకీని ఎలా వాడాలో నేర్పించాడు.
సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
2010 | ఇన్‌ఫిల్ట్రేషన్ | ||
2011 | పోలీస్ మ్యాన్ | హిలా | |
2012 | లీక్ | ||
2016 | ఎ క్వైట్ హార్ట్ | ||
2021 | వై ఐ డోన్ట్ రిపోర్ట్ | డానా | షార్ట్ ఫిల్మ్ |
2023 | బ్లాక్ లోటస్ | శిరా | [2] |
TBA | డర్టీ ఏంజిల్స్ | TBA |
సంవత్సరం | ధారావాహిక | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
2006 | అవర్ సాంగ్ | షిరి గోల్డ్ | సీజన్ 3 ఎపిసోడ్ 1 |
2006 | ది పైజామాస్ | యంగ్ వుమన్ | సీజన్ 4 ఎపిసోడ్ 2 |
2007 | హా'నెఫిలిమ్ | వర్చువల్ వెయిట్రెస్ | సీజన్ 1 ఎపిసోడ్ 5 |
2012 | సమ్మర్ బ్రేక్ డైరీస్ | మికా | సీజన్ 1 ఎపిసోడ్ 1, 50 |
2015–ప్రస్తుతం | ఫౌడా | నూరిట్ | సీజన్ 1, 2, 3, 4 |
2020 | మిసయ్యా | మికా దహన్ | సీజన్ 1 [3] |