వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రోలోఫ్ ఎరాస్మస్ వాన్ డెర్ మెర్వ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | జోహన్నెస్‌బర్గ్, ట్రాన్స్‌వాల్, దక్షిణాఫ్రికా | 1984 డిసెంబరు 31|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | బుల్డాగ్, టర్మినేటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Slow left-arm orthodox | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టులు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 96/67) | 2009 ఏప్రిల్ 5 దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2019 నవంబరు 26 నెదర్లాండ్స్ - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 52 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 41/35) | 2009 మార్చి 29 దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 నవంబరు 6 నెదర్లాండ్స్ - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 52 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006/07–2013/14 | నార్దర్స్న్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007/08–2014/15 | టైటన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2010 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2013 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | సోమర్సెట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12 | Brisbane Heat | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | St Lucia Zouks | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–present | సోమర్సెట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | Tshwane Spartans | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | London Spirit | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | Northern Superchargers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022/23 | Sunrisers Eastern Cape | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | వెల్ష్ ఫైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | బార్బడాస్ Royals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 6 November 2022 |
రోలోఫ్ ఎరాస్మస్ వాన్ డెర్ మెర్వ్ (జననం 1984 డిసెంబరు 31) డచ్-దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ క్రికెటరు. అతను దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ రెండింటికీ అంతర్జాతీయంగా ఆడాడు. ఒకటి కంటే ఎక్కువ అంతర్జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతికొద్ది మంది ఆటగాళ్లలో అతనొకడు.[1]
జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించిన వాన్ డెర్ మెర్వ్, తర్వాతి సీజన్‌లో టైటాన్స్‌తో ఫ్రాంచైజీ క్రికెట్‌లోకి వెళ్లడానికి ముందు, 2006-07 సీజన్‌లో నార్తర్న్స్‌కు తన ఫస్ట్-క్లాస్, లిస్టు A రంగప్రవేశం చేశాడు. ఆల్ రౌండరైన మెర్వ్, ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్ బౌలరు, కుడిచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాటరు. అతను 2009, 2011 మధ్య దక్షిణాఫ్రికా తరపున వన్‌డే, ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఒక్కో ఫార్మాట్‌లో 13 సార్లు ఆడాడు. వాన్ డెర్ మెర్వ్ 2015 జూన్లో డచ్ పాస్‌పోర్ట్ పొందాడు. 2015 ICC వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్ కోసం నెదర్లాండ్స్ జట్టులో ఎంపికయ్యాడు.
వాన్ డెర్ మెర్వ్ 1984 డిసెంబరు 31న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించాడు. [2] అతనికి తల్లి ద్వారా డచ్ పౌరసత్వం ఉంది.[1]
వాన్ డెర్ మెర్వ్ తన కెరీర్‌ను వికెట్ కీపర్ -బ్యాట్స్‌మన్‌గా ప్రారంభించాడు, బంగ్లాదేశ్‌లో జరిగిన 2004 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. [1]
వాన్ డెర్ మెర్వ్ 2006 అక్టోబరులో నార్త్ వెస్ట్‌కి వ్యతిరేకంగా నార్తర్న్స్ తరపున తన లిస్టు A రంగప్రవేశం చేశాడు. బ్యాటింగులో డకౌటయ్యాడు. 29 పరుగులిచ్చి తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేశాడు. [3] 2006 డిసెంబరులో అతను లింపోపోకు వ్యతిరేకంగా నార్తర్న్స్ తరపున తన ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసాడు. 12 ఓవర్లు బౌలింగ్ చేసాడు గానీ, వికెట్లేమీ పడలేదు. కానీ 36 పరుగులు చేసి మూడు క్యాచ్‌లు తీసుకున్నాడు. [4]
2007-08 సీజనులో వాన్ డెర్ మెర్వ్ జయప్రదమైంది. టైటాన్స్‌తో ఫ్రాంచైజీ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. [5] 2007 నవంబరులో ఈగల్స్‌తో జరిగిన సూపర్‌స్పోర్ట్ సిరీస్‌లో టైటాన్స్ తరపున రంగప్రవేశం చేసాడు. 2008 ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో - అతని మొదటి వన్డే మ్యాచ్‌లో - అతను 24 పరుగులిచ్చి (4/24) నాలుగు వికెట్లు పడగొట్టాడు. [6] అతను MTN డొమెస్టిక్ ఛాంపియన్‌షిప్‌ను 14.25 సగటుతో 27 వికెట్లతో టైటాన్స్ ప్రధాన వికెట్ టేకర్‌గా ముగించాడు. [7] 29.88 సగటుతో 269 పరుగులు కూడా చేశాడు. [8] స్టాండర్డ్ బ్యాంక్ ప్రో20 సిరీస్‌లో వాన్ డెర్ మెర్వ్ 13.92 సగటుతో 13 వికెట్లు తీసుకుని మూడో ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచాడు.[9] అతను 27.42 సగటుతో 192 పరుగులు చేశాడు. [10] టైటాన్స్ 50 ఓవర్లు, 20 ఓవర్ల పోటీలను గెలుచుకుంది. అందులో వాన్ డెర్ మెర్వ్ ప్రదర్శనలకు గాను అతను ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, MTN డొమెస్టిక్ ఛాంపియన్‌షిప్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, స్టాండర్డ్ బ్యాంక్ ప్రో20 సిరీస్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ వంటి పురస్కారాఉ పొందాడు.[11] జాతీయ స్థాయిలో అతను SA క్రికెట్ అవార్డ్స్‌లో డొమెస్టిక్ న్యూకమర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. [12]
టైటాన్స్ 2008/09లో MTN డొమెస్టిక్ ఛాంపియన్‌షిప్‌ను నిలుపుకుంది, వాన్ డెర్ మెర్వ్ మళ్లీ విజయానికి కీలక పాత్ర పోషించాడు. అతను 13.96 తో 30 వికెట్లు పడగొట్టాడు. [13]
నెదర్లాండ్స్‌కు మారాక వాన్ డెర్ మెర్వ్, 2016 సీజన్‌కు ముందు కౌంటీ క్రికెట్ ఆడేందుకు రెండు సంవత్సరాల ఒప్పందంపై సోమర్‌సెట్‌కు సంతకం చేశాడు. [14] 2017 ఏప్రిల్లో, అతను తన తొలి లిస్టు A సెంచరీ సాధించాడు. 2017 రాయల్ లండన్ వన్-డే కప్‌లో సర్రేపై 165 నాటౌట్ చేశాడు. [15]
జూలై 2022లో, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లాంకషైర్‌తో జరిగిన ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల పంట సాధించాడు. [16]
2019 జూలైలో, అతను యూరో T20 స్లామ్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభ ఎడిషన్‌లో ఆమ్‌స్టర్‌డామ్ నైట్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు. [17] [18] అయితే, మరుసటి నెలలో ఆ టోర్నీని రద్దు చేసారు. [19] 2019 సెప్టెంబరులో, అతను 2019 ఎంజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంటు కోసం ష్వానే స్పార్టాన్స్ జట్టు కోసం జట్టులో ఎంపికయ్యాడు. [20]
2022 ఏప్రిల్లో, ఇంగ్లాండ్‌లోని ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ అతన్ని కొనుగోలు చేసింది. [21]
వాన్ డెర్ మెర్వ్ 2004 U-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికై, ఐదు మ్యాచ్‌లు ఆడాడు. 129 పరుగులు చేసి, 3 వికెట్లు తీసుకున్నాడు. [22] [23] ఆ టోర్నమెంటు తర్వాత, అతను ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేయడానికి రెండు సంవత్సరాల పైనే పట్టింది. వాన్ డెర్ మెర్వ్ తాను "విషయాలను చాలా సీరియస్‌గా తీసుకోలేద"నీ, "ఎప్పుడూ పార్టీల్లో మునిగితేలుతూ ఉన్నాన" నీ ఒప్పుకున్నాడు. [24]
2008 ఆగష్టులో వాన్ డెర్ మెర్వ్, బంగ్లాదేశ్ అకాడమీ జట్టుతో ఆడే దక్షిణాఫ్రికా అకాడమీ జట్టుకు ఎంపికయ్యాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండవ మ్యాచ్‌లో అతను 70 బంతుల్లో 79 పరుగులు చేసి, 6/52 తీసుకున్నాడు. [25]
వాన్ డెర్ మెర్వ్ 2008 హాంకాంగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ సిక్స్‌లలో ఆడాడు, అతను దక్షిణాఫ్రికా ప్రధాన రన్ స్కోరరు, వికెట్-టేకరు. [26]
వాన్ డెర్ మెర్వ్ 2009 మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ట్వంటీ20 ఇంటర్నేషనల్‌ల కోసం, దక్షిణాఫ్రికా ట్వంటీ20 జట్టులో ఎంపికయ్యాడు. వీటిలో రెండవదానిలో అతను తన రంగప్రవేశం చేసాడు. ఒక ఇన్నింగ్స్‌లో 30 బంతుల్లో 48 పరుగులు చేశాడు, ఇందులో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. డేవిడ్ హస్సీని ఔట్ చేసి, తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను అందుకున్నాడు. అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. [27] ఈ ప్రదర్శన తర్వాత అతన్ని జాక్వెస్ కలిస్‌కు కవర్‌గా వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌కు జట్టులోకి తీసుకున్నారు. [28] సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో వాన్ డెర్ మెర్వ్ తన వన్‌డే రంగప్రవేశం చేసి, ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి, వికెట్లేమీ తీసుకోలేదు. బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. [29] తన రెండవ వన్‌డేలో మరింత ప్రముఖ పాత్రను పోషించాడు. నిర్ణీత పది ఓవర్లలో 3/37 తీసుకున్నాడు. [30] చివరి రెండు మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసుకుని సీరీస్‌లో 18.62 సగటుతో ఎనిమిది వికెట్లు సాధించాడు.[31]
2015లో, వాన్ డెర్ మెర్వ్ డచ్ పాస్‌పోర్టు పొందాక, నేపాల్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడేందుకు ఎంపికయ్యాడు. [32] వివియన్ కింగ్మా వైదొలిగిన తర్వాత అతను 2015 ప్రపంచ T20 క్వాలిఫైయర్‌కు కూడా ఎంపికయ్యాడు. [33] 2015 జూలై 3న నేపాల్‌పై నెదర్లాండ్స్ తరపున తన తొలి T20I ఆడాడు. T20Iలలో రెండు అంతర్జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన 5వ క్రికెటర్ అయ్యాడు. [34] అతన్ని 2016 ICC వరల్డ్ ట్వంటీ 20 కొరకు నెదర్లాండ్స్ జట్టులోకి తీసుకున్నారు.
2019 జూన్‌లో అతను, జింబాబ్వేతో జరిగిన సిరీస్ కోసం నెదర్లాండ్స్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు. [35] 2019 జూన్ 19న జింబాబ్వేపై నెదర్లాండ్స్ తరపున తన తొలి వన్‌డే ఆడాడు. [36] వన్డేల్లో రెండు అంతర్జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన 12వ క్రికెటర్‌గా నిలిచాడు. [37]
2019 సెప్టెంబరులో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే 2019 ICC T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో డచ్ జట్టులో అతను ఎంపికయ్యాడు. [38] 2021 సెప్టెంబరులో, అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం డచ్ జట్టులో ఎంపికయ్యాడు. [39]