అందాల పోటీల విజేత | |
![]() 2017లో రోష్మిత హరిమూర్తి | |
జననము | బెంగళూరు, కర్ణాటక, భారతదేశం | 13 ఆగస్టు 1994
---|---|
విద్య | మాస్టర్స్ డిగ్రీ (అంతర్జాతీయ వ్యాపారం) |
పూర్వవిద్యార్థి | మౌంట్ కార్మెల్ కాలేజ్, బెంగళూరు |
బిరుదు (లు) | మిస్ యూనివర్స్ ఇండియా 2016 |
ప్రధానమైన పోటీ (లు) |
|
రోష్మిత హరిమూర్తి (జననం 1994 ఆగస్టు 13) ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో మిస్ యూనివర్స్ ఇండియా 2016 కిరీటాన్ని గెలుచుకున్న భారతీయ మోడల్.[1] మిస్ దివా - 2016 విజేతగా, ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన మిస్ యూనివర్స్ 2016లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[2]
ఆమె బెంగళూరులో పుట్టి పెరిగింది. ఆమె సోదరి, రక్షిత హరిమూర్తి కూడా అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె బెంగుళూరులోని సోఫియా హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. అలాగే, మౌంట్ కార్మెల్ కాలేజ్ నుండి అంతర్జాతీయ వ్యాపారంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది.
రోష్మిత హరిమూర్తి ఫెమినా మిస్ ఇండియా బెంగుళూరు టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో, ఆమె ఫెమినా మిస్ ఇండియా 2016కి ఫైనలిస్ట్‌గా నేరుగా ప్రవేశించింది. అక్కడ, ఆమె టాప్ 5 ఫైనలిస్ట్‌కి చేరుకుంది.[3] ఈవెంట్‌లో "మిస్ స్పెక్టాక్యులర్ ఐస్", "మిస్ రాంప్‌వాక్" ప్రత్యేక అవార్డులను గెలుచుకుంది.
మిస్ దివా - 2016
ఆమె మిస్ దివా - 2016 పోటీలో పాల్గొంది. మిస్ దివా యూనివర్స్ 2016 టైటిల్‌ను గెలుచుకుంది, అక్కడ ఆమె అవుట్‌గోయింగ్ టైటిల్ హోల్డర్ ఊర్వశి రౌటేలా చేత కిరీటం పొందింది.
మిస్ యూనివర్స్ - 2016
ఆమె 2017 జనవరి 29న ఫిలిప్పీన్స్‌లోని మెట్రో మనీలాలోని పాసేలోని మాల్ ఆఫ్ ఆసియా అరేనా(SM Mall of Asia Arena)లో జరిగిన మిస్ యూనివర్స్ 2016లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[4] అయితే విజయం సాధించలేకపోయింది.[5]