రోహింటన్ బారియా గోల్డ్ ట్రోఫీ (రోహింటన్ బరియా ట్రోఫీ) భారతదేశంలో యూనివర్శిటీ క్రికెట్ జట్లకు జరిగే ఛాంపియన్‌షిప్ పోటీ. ఇది 1935/36 సీజన్ నుండి ప్రతి సంవత్సరం జరుగుతోంది.
ట్రోఫీని 1935లో బొంబాయికి చెందిన అర్దేషిర్ దాదాభోయ్ బారియా తన కుమారుడు రోహింటన్ జ్ఞాపకార్థం భారత విశ్వవిద్యాలయాల మధ్య జరిగే టోర్నమెంట్ కోసం విరాళంగా అందించాడు. ప్రారంభంలో, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) టోర్నమెంట్‌ను నిర్వహించింది, అయితే 1940/41లో ఇంటర్-యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (IUSB) దీని బాధ్యతలు చేపట్టింది. [1]
విశ్వవిద్యాలయ జట్లు జోన్‌లలో ఆడాక, ప్రతి జోన్ నుండి వచ్చిన విజేతలు, రన్నరప్‌లు సెమీ-ఫైనల్, ఫైనల్స్‌లో ఆడతాయి. 1989/90 లో దీని ఫార్మాట్‌ను వన్‌డే 50-ఓవర్ల పోటీగా మార్చే వరకు, ఫైనల్ మ్యాచ్‌ను మూడు, నాలుగు రోజుల పాటు నిర్వహించేవారు. కొన్నిసార్లు మ్యాచ్‌లు సమయంతో సంబంధం లేకుండా ముగిసే వరకూ ఆడేవారు. 1956-57 లో మ్యాచ్ ఎనిమిది రోజుల పాటు కొనసాగింది. బాంబే యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్శిటీకి 728 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తరువాత 304.1 ఓవర్లలో 611 పరుగులకు ఢిల్లీని ఆలౌట్ చేసి విజయం సాధించింది. [2] [3]
భారతీయ విశ్వవిద్యాలయాలతో పాటు, సిలోన్ విశ్వవిద్యాలయం కూడా 1947/48 నుండి 1969/70 వరకు పాల్గొంది. [4] విభజనకు ముందు భవిష్యత్తులో పాకిస్తాన్ ఏర్పడబోయే ప్రాంతం నుండి పోటీ పడిన ఏకైక విశ్వవిద్యాలయం లాహోర్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం. ఇది నాలుగు సార్లు టైటిల్‌ను గెలుచుకుంది.
ప్రారంభ దశాబ్దాలలో ఈ టోర్నమెంటు నుండి, ముఖ్యంగా పెద్ద విశ్వవిద్యాలయాలకు చెందిన చాలా మంది టెస్టు, ఫస్ట్-క్లాస్ ఆటగాళ్ళు వచ్చారు.[5] 1940/41 ఫైనల్‌ను గెలిచిన బాంబే విశ్వవిద్యాలయం జట్టులో నలుగురు భావి భారత టెస్టు ఆటగాళ్ళు ఉన్నారు (రంగా సోహోని, హేమూ అధికారి, చంద్ర సర్వతే, సాదు షిండే).[6] 1958/59 లో కూడా ఛాంపియన్ అయిన అదే జట్టులో ఐదుగురు భవిష్యత్ టెస్టు ఆటగాళ్లు ఉన్నారు. (అరవింద్ ఆప్టే, దిలీప్ సర్దేశాయ్, అజిత్ వాడేకర్ - ఫైనల్లో 324 స్కోరు చేసాడు - ఫరూఖ్ ఇంజనీర్, రమాకాంత్ దేశాయ్ ). [7] 1945-46 నాటి పంజాబ్ యూనివర్శిటీ జట్టులో ఏడుగురు ఆటగాళ్లు - నాజర్ మహ్మద్, ఇంతియాజ్ అహ్మద్, మక్సూద్ అహ్మద్, అబ్దుల్ హఫీజ్ కర్దార్, ఫజల్ మహమూద్, ఖాన్ మొహమ్మద్, షుజావుద్దీన్ బట్ లు- 1950లలో పాకిస్తాన్ టెస్టు విజయాలలో ప్రముఖ పాత్ర పోషించారు. [8] 1966-67 ఫైనల్‌లో సునీల్ గవాస్కర్ బాంబే యూనివర్శిటీ తరపున ఆడాడు. 1972-73లో మొహిందర్ అమర్‌నాథ్ ఢిల్లీ యూనివర్శిటీని విజయతీరాలకు చేర్చాడు. బాంబే యూనివర్శిటీ తరపున సంజయ్ మంజ్రేకర్ వరుసగా ఆరు సెంచరీలు కొట్టి, బాంబే రంజీ ట్రోఫీ జట్టులోకి ప్రవేశించాడు. [9]
రచయిత, మాజీ రోహింటన్ బారియా ట్రోఫీ, రంజీ ట్రోఫీ ఆటగాడు వెంకట్రామన్ రాంనారాయణ్ ప్రకారం, రోహింటన్ బారియా భవిష్యత్ నాయకుల కోసం విలువైన "ఫినిషింగ్ స్కూల్" గా పనికొచ్చింది. క్రీడా మైదానంలో గౌరవప్రదమైన ప్రవర్తనకు నమూనాగా నిలిచింది.[10] విస్తృతమైన జూనియర్ పోటీలు, యువ ఆటగాళ్లకు కోచింగు పెరగడంతో, ఇటీవలి దశాబ్దాలలో ఇంటర్-యూనివర్శిటీ క్రికెట్‌పై ఆసక్తి తగ్గిపోయింది. [11] ఉస్మానియా యూనివర్సిటీకి ఆడిన హర్షా భోగ్లే ప్రకారం, అండర్-19 క్రికెట్ వృద్ధి వలన యూనివర్సిటీ క్రికెట్ దెబ్బ తింది. [9]
సీజను | విజేత | రన్నరప్ | 3 వ స్థానం | 4 వ స్థానం |
---|---|---|---|---|
1935/36 | పంజాబ్ యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ | N/A | N/A |
1936/37 | పంజాబ్ యూనివర్సిటీ | నాగపూర్ యూనివర్సిటీ | N/A | N/A |
1937/38 | పంజాబ్ యూనివర్సిటీ | అలీగఢ్ ముస్లిమ్ యూనివర్సిటీ | N/A | N/A |
1938/39 | బాంబే యూనివర్సిటీ | పంజాబ్ యూనివర్సిటీ | N/A | N/A |
1939/40 | బాంబే యూనివర్సిటీ | మైసూరు యూనివర్సిటీ | N/A | N/A |
1940/41 | బాంబే యూనివర్సిటీ | బెనారస్ హిందూ యూనివర్సిటీ | N/A | N/A |
1941/42 | బాంబే యూనివర్సిటీ | పంజాబ్ యూనివర్సిటీ | N/A | N/A |
1942/43 | బాంబే యూనివర్సిటీ | అలీగఢ్ ముస్లిమ్ యూనివర్సిటీ | N/A | N/A |
1943/44 | పంజాబ్ యూనివర్సిటీ | మద్రాస్ యూనివర్సిటీ | N/A | N/A |
1944/45 | బాంబే యూనివర్సిటీ | పంజాబ్ యూనివర్సిటీ | N/A | N/A |
1945/46 | బాంబే యూనివర్సిటీ | పంజాబ్ యూనివర్సిటీ | N/A | N/A |
1946/47 | బాంబే యూనివర్సిటీ | అలీగఢ్ ముస్లిమ్ యూనివర్సిటీ | N/A | N/A |
1947/48 | బాంబే యూనివర్సిటీ | ఆగ్రా యూనివర్సిటీ | N/A | N/A |
1948/49 | బాంబే యూనివర్సిటీ | కలకత్తా యూనివర్సిటీ | N/A | N/A |
1949/50 | బాంబే యూనివర్సిటీ | కలకత్తా యూనివర్సిటీ | N/A | N/A |
1950/51 | మైసూరు యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | N/A | N/A |
1951/52 | మైసూరు యూనివర్సిటీ | అలహాబాద్ యూనివర్సిటీ | N/A | N/A |
1952/53 | బాంబే యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | N/A | N/A |
1953/54 | ఢిల్లీ యూనివర్సిటీ | మైసూరు యూనివర్సిటీ | N/A | N/A |
1954/55 | బాంబే యూనివర్సిటీ | పంజాబ్ యూనివర్సిటీ | N/A | N/A |
1955/56 | బాంబే యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | N/A | N/A |
1956/57 | బాంబే యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | N/A | N/A |
1957/58 | బాంబే యూనివర్సిటీ | పంజాబ్ యూనివర్సిటీ | N/A | N/A |
1958/59 | బాంబే యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | N/A | N/A |
1959/60 | ఢిల్లీ యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ | N/A | N/A |
1960/61 | బాంబే యూనివర్సిటీ | అలహాబాద్ యూనివర్సిటీ | N/A | N/A |
1961/62 | మైసూరు యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ | N/A | N/A |
1962/63 | పూనా యూనివర్సిటీ | మద్రాస్ యూనివర్సిటీ | N/A | N/A |
1963/64 | బాంబే యూనివర్సిటీ | మద్రాస్ యూనివర్సిటీ | N/A | N/A |
1964/65 | బాంబే యూనివర్సిటీ | కలకత్తా యూనివర్సిటీ | N/A | N/A |
1965/66 | బాంబే యూనివర్సిటీ | బెంగళూరు యూనివర్సిటీ | N/A | N/A |
1966/67 | ఉస్మానియా యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ | N/A | N/A |
1967/68 | కలకత్తా యూనివర్సిటీ | Indore University | N/A | N/A |
1968/69 | ఢిల్లీ యూనివర్సిటీ | ఉస్మానియా యూనివర్సిటీ | N/A | N/A |
1969/70 | బాంబే యూనివర్సిటీ | బెంగళూరు యూనివర్సిటీ | N/A | N/A |
1970/71 | మద్రాస్ యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ | N/A | N/A |
1971/72 | పంజాబీ యూనివర్సిటీ | Udaipur University | N/A | N/A |
1972/73 | మద్రాస్ యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | N/A | N/A |
1973/74 | ఢిల్లీ యూనివర్సిటీ | బెంగళూరు యూనివర్సిటీ | N/A | N/A |
1974/75 | బాంబే యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | N/A | N/A |
1975/76 | మద్రాస్ యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ | N/A | N/A |
1976/77 | ఉస్మానియా యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ | N/A | N/A |
1977/78 | ఢిల్లీ యూనివర్సిటీ | ఉస్మానియా యూనివర్సిటీ | కలకత్తా యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ |
1978/79 | ఢిల్లీ యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ | మద్రాస్ యూనివర్సిటీ | అలహాబాద్ యూనివర్సిటీ |
1979/80 | ఢిల్లీ యూనివర్సిటీ | ఉస్మానియా యూనివర్సిటీ | బెంగళూరు యూనివర్సిటీ | గురునానక్ దేవ్ యూనివర్సిటీ |
1980/81 | ఢిల్లీ యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ | మద్రాస్ యూనివర్సిటీ | కలకత్తా యూనివర్సిటీ |
1981/82 | ఢిల్లీ యూనివర్సిటీ | గురునానక్ దేవ్ యూనివర్సిటీ | మద్రాస్ యూనివర్సిటీ | కలకత్తా యూనివర్సిటీ |
1982/83 | ఢిల్లీ యూనివర్సిటీ | పూనా యూనివర్సిటీ | పాట్నా యూనివర్సిటీ | పంజాబ్ యూనివర్సిటీ |
1983/84 | ఢిల్లీ యూనివర్సిటీ | పంజాబ్ యూనివర్సిటీ | పూనా యూనివర్సిటీ | బెంగళూరు యూనివర్సిటీ |
1984/85 | బాంబే యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | పంజాబ్ యూనివర్సిటీ | కలకత్తా యూనివర్సిటీ |
1985/86 | మద్రాస్ యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | అలీగఢ్ ముస్లిమ్ యూనివర్సిటీ |
1986/87 | బెంగళూరు యూనివర్సిటీ | మద్రాస్ యూనివర్సిటీ | పంజాబ్ యూనివర్సిటీ | కలకత్తా యూనివర్సిటీ |
1987/88 | ఢిల్లీ యూనివర్సిటీ | బెంగళూరు యూనివర్సిటీ | మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీ | పూనా యూనివర్సిటీ |
1988/89 | గురునానక్ దేవ్ యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ | రాజస్థాన్ యూనివర్సిటీ |
1989/90 | ఢిల్లీ యూనివర్సిటీ | గురునానక్ దేవ్ యూనివర్సిటీ | జామియా మిల్లియా ఇస్లామియా | పంజాబ్ యూనివర్సిటీ |
1990/91 | జామియా మిల్లియా ఇస్లామియా | పూనా యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | గురునానక్ దేవ్ యూనివర్సిటీ |
1991/92 | South గుజరాత్ యూనివర్సిటీ | గురునానక్ దేవ్ యూనివర్సిటీ | గుజరాత్ యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ |
1992/93 | ఢిల్లీ యూనివర్సిటీ | భావనగర్ యూనివర్సిటీ | బెంగళూరు యూనివర్సిటీ | కురుక్షేత్ర యూనివర్సిటీ |
1993/94 | గురునానక్ దేవ్ యూనివర్సిటీ | బాంబే యూనివర్సిటీ | లలిత్ నారాయణ్ మిథిల యూనివర్సిటీ | కర్ణాటక యూనివర్సిటీ |
1994/95 | పంజాబ్ యూనివర్సిటీ | రాంచీ యూనివర్సిటీ | ? | ? |
1995/96 | ? | ? | ? | ? |
1996/97 | గురునానక్ దేవ్ యూనివర్సిటీ | ? | ? | ? |
1997/98 | గురునానక్ దేవ్ యూనివర్సిటీ | ? | ? | ? |
1998/99 | ఢిల్లీ యూనివర్సిటీ | ఉస్మానియా యూనివర్సిటీ | ? | ? |
1999/00 | మద్రాస్ యూనివర్సిటీ | బర్కతుల్లా యూనివర్సిటీ | ? | ? |
2000/01 | ? | ఢిల్లీ యూనివర్సిటీ | మద్రాస్ యూనివర్సిటీ | ఉస్మానియా యూనివర్సిటీ |
2001/02 | మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీ | ముంబై యూనివర్సిటీ | ? | ? |
2002/03 | చౌధురి చరణ్ సింగ్ యూనివర్సిటీ | గుజరాత్ యూనివర్సిటీ | బెంగళూరు యూనివర్సిటీ | రాంచీ యూనివర్సిటీ |
2003/04 | ? | ? | ? | ? |
2004/05 | కలకత్తా యూనివర్సిటీ | జామియా మిల్లియా ఇస్లామియా | ఉస్మానియా యూనివర్సిటీ | మైసూరు యూనివర్సిటీ |
2005/06 | ముంబై యూనివర్సిటీ | ? | ? | ? |
2006/07 | మద్రాస్ యూనివర్సిటీ | మైసూరు యూనివర్సిటీ | కలకత్తా యూనివర్సిటీ | సౌరాష్ట్ర యూనివర్సిటీ |
2007/08 | ముంబై యూనివర్సిటీ | మద్రాస్ యూనివర్సిటీ | ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ | గురునానక్ దేవ్ యూనివర్సిటీ |
2008/09 | ముంబై యూనివర్సిటీ | ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ | ఢిల్లీ యూనివర్సిటీ | రాష్ట్రసంత్ తుకడోజీ మహరాజ్ నాగపూర్ యూనివర్సిటీ |
2009/10 | ముంబై యూనివర్సిటీ | పంజాబీ యూనివర్సిటీ | మద్రాస్ యూనివర్సిటీ | ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ |
2010/11 | గురునానక్ దేవ్ యూనివర్సిటీ | ముంబై యూనివర్సిటీ | ఉస్మానియా యూనివర్సిటీ | మద్రాస్ యూనివర్సిటీ |
2011/12 | గురునానక్ దేవ్ యూనివర్సిటీ | బెనారస్ హిందూ యూనివర్సిటీ | ముంబై యూనివర్సిటీ | జైన్ యూనివర్సిటీ |
2012/13 | జైన్ యూనివర్సిటీ | ముంబై యూనివర్సిటీ | జామియా మిల్లియా ఇస్లామియా | జివాజీ యూనివర్సిటీ |
2013/14 | గురునానక్ దేవ్ యూనివర్సిటీ | మహర్షి సయానంద్ యూనివర్సిటీ | ముంబై యూనివర్సిటీ | జైన్ యూనివర్సిటీ |
2014/15 | వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | ముంబై యూనివర్సిటీ | ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ |
2015/16 | ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ | ముంబై యూనివర్సిటీ | జైన్ యూనివర్సిటీ | అలీగఢ్ ముస్లిమ్ యూనివర్సిటీ |
2016/17 | వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | సంత్ గాడ్గే బాబా అమరావతి యూనివర్సిటీ | చౌధురి చరణ్ సింగ్ యూనివర్సిటీ |
2017/18 | మహర్షి దయానంద్ యూనివర్సిటీ | సౌరాష్ట్ర యూనివర్సిటీ | గురునానక్ దేవ్ యూనివర్సిటీ | ముంబై యూనివర్సిటీ |
2018/19 | గురునానక్ దేవ్ యూనివర్సిటీ | మైసూరు యూనివర్సిటీ | ముంబై యూనివర్సిటీ | వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీ |
2019/20 | వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీ | రాష్ట్రసంత్ తుకడోజీ మహరాజ్ నాగపూర్ యూనివర్సిటీ | ఢిల్లీ యూనివర్సిటీ | మైసూరు యూనివర్సిటీ |
గమనికలు:-