రౌడీ అన్నయ్య (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.భరద్వాజ్ |
---|---|
నిర్మాణం | విజయ్ |
తారాగణం | కృష్ణ రంభ చంద్రమోహన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం బాలయ్య నిర్మలమ్మ |
సంగీతం | విద్యాసాగర్ |
ఛాయాగ్రహణం | బి.ఎన్.రావు |
నిర్మాణ సంస్థ | షిరిడి సాయి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
రౌడీ అన్నయ్య 1993 లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. కృష్ణ, రంభ ప్రధాన పాత్రల్లో నటించాగా తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించాడు. ష్ర్డీ సాయి ఫిల్స్మ్ పతాకంపై వొజయ్ నిర్మించాడు. విద్యాసాగర్ ఈ చిత్రానికి స్వరరచన చేసాడు. వారసుడొచ్చాడు, సమరసింహా రెడ్డి, అతడు సినిమాల కథలకు ఈ సినిమా కథతో కొంత పోలిక ఉంటుంది.[1][2][3]
గ్రామ నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రం ఒక రహస్యమైన అపరిచితుడి చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో ధర్మారావు, దుర్మార్గుడైన అతడి సోదరుడు రంగారావు చేతిలో ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఈ అపరిచితుడు ధర్మరావు కుటుంబానికి మద్దతుగా నిలుస్తాడుఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.
భువనచంద్ర రాసిన పాటలకు విద్యాసాగర్ సంగీతం అందించాడు.[4]