ర్యాగింగ్ అనగా కళాశాలల్లో సీనియర్ విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మనస్థాపం కలిగించే రీతిలో ప్రవర్తించడం. ఆస్ట్రేలియా , బ్రిటన్ , శ్రీలంక , భారతదేశం మొదలైన దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది.
డిసెంబరు 17, 1998: అస్సాం ప్రభుత్వం, పాఠశాలలో 'ర్యాగింగ్' ను నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది. న్యాయమూర్తులు మార్కండేయ ఖట్జూ, ఏకే గంగూలీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ చట్టం చేసింది. 'అందరూ ఒకే విధమైన మనస్తత్వంతో ఉండరు. కొందరు అత్యంత సున్నిత మనస్కులై చిన్నపాటి విషయాలకే ఉద్రేకానికి గురవుతుంటారు' అని ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధానికి సీబీఐ మాజీ డైరెక్టర్ రాఘవన్ నేతృత్వంలోని కమిటీ చేసిన సూచనల మేరకు కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలిచ్చినట్లు సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం బెంచ్ దృష్టికి తెచ్చారు. [1]