ర్యాన్ టెన్ డోషేట్

ర్యాన్ టెన్ డోషేట్
2013 లో టెన్ డోషేట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ర్యాన్ నీల్ టెన్ డోషేట్
పుట్టిన తేదీ (1980-06-30) 1980 జూన్ 30 (వయసు 44)
పోర్ట్ ఎలిజబెత్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
మారుపేరుTendo[1]
ఎత్తు5 అ. 11 అం. (1.80 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 30)2006 జూలై 4 - శ్రీలంక తో
చివరి వన్‌డే2011 మార్చి 18 - ఐర్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.27 (previously 22)
తొలి T20I (క్యాప్ 10)2008 ఆగస్టు 2 - Kenya తో
చివరి T20I2021 అక్టోబరు 20 - Namibia తో
T20Iల్లో చొక్కా సంఖ్య.27
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2003–2021[a]ఎసెక్స్
2010/11–2011/12Mashonaland Eagles
2010/11కాంటర్బరీ
2010/11టాస్మానియా
2011–2015కోల్‌కతా నైట్‌రైడర్స్
2012/13–2014/15ఒటాగో
2013Chittagong Kings
2014/15అడిలైడ్ స్ట్రైకర్స్
2015Dhaka Dynamites
2016కరాచీ కింగ్స్
2016Comilla విక్టోరియాns
2018Rajshahi Kings
2019లాహోర్ కలందర్స్
2019/20నెల్సన్ మండేలా బే జయింట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 33 24 203 235
చేసిన పరుగులు 1,541 533 11,298 6,166
బ్యాటింగు సగటు 67.00 41.00 44.30 43.42
100లు/50లు 5/9 0/3 29/53 11/31
అత్యుత్తమ స్కోరు 119 59 259* 180
వేసిన బంతులు 1,580 210 11,042 5,825
వికెట్లు 55 13 214 189
బౌలింగు సగటు 24.12 18.84 33.84 29.37
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 7 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/31 3/23 6/20 5/50
క్యాచ్‌లు/స్టంపింగులు 13/– 4/– 127/– 72/–
మూలం: ESPNcricinfo, 2022 సెప్టెంబరు 21

ర్యాన్ నీల్ టెన్ డోషేట్ (జననం 30 జూన్ 1980) మాజీ డచ్ - దక్షిణాఫ్రికా క్రికెటరు. అతను నెదర్లాండ్స్ జాతీయ క్రికెట్ జట్టు తరపున వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ క్రికెట్ (టి20ఐ) ఆడాడు.[2] టెన్ డోషేట్ 2008 - 2010, 2011లో రికార్డు స్థాయిలో మూడు సార్లు ఐసీసీ అసోసియేట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

దక్షిణాఫ్రికాలో పుట్టి పెరిగిన టెన్ డోషేట్, 2003 ఇంగ్లీష్ సీజన్ కోసం ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తనకు డచ్ పౌరసత్వం ఉండడం చేత దేశీయ ఆటగాడిగా ఈ అర్హత సాధించాడు. కుడిచేతి వాటం ఆల్ రౌండరైన టెన్ డోషేట్, మొదట 2005 ICC ట్రోఫీలో డచ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2009 ప్రపంచ ట్వంటీ20, 2011 ప్రపంచ కప్‌తో సహా అనేక టోర్నమెంట్‌లను ఆడాడు. ఈ రెండో టోర్నమెంటులో, ఇంగ్లండ్‌పై 119 పరుగులు చేశాడు, ICC పూర్తిస్థాయి సభ్యదేశంపై డచ్ ఆటగాడు చేసిన మొదటి వన్‌డే సెంచరీ అది.

దేశీయ స్థాయిలో, 2006 సీజన్‌లో టెన్ డోషేట్ మొదటిసారిగా ఎసెక్స్‌కు రెగ్యులర్‌గా స్థిరపడ్డాడు. 2014 సీజన్‌కు జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతను ఆస్ట్రేలియా బిగ్ బాష్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలలో ఫ్రాంచైజీలతో సహా ఇతర దేశాలలో అనేక ప్రొఫెషనల్ ట్వంటీ20 జట్ల కోసం ఆడాడు.

2021 సెప్టెంబరులో టెన్ డోషేట్, 2021 చివరిలో ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్ అవుతానని ప్రకటించాడు. [3] అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో గ్రూప్ మ్యాచ్ సందర్భంగా 2021 అక్టోబరు 20 న నమీబియాతో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2021 డిసెంబరులో అతను కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. 2022 నవంబరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. [4]

తొలి ఎదుగుదల

[మార్చు]

అతను 1998లో కేప్ టౌన్ సమీపంలోని గుడ్‌వుడ్‌లోని ఫెయిర్‌బైర్న్ కాలేజీలో మెట్రిక్యులేషను చేశాడు. పాఠశాలలో ఉన్నప్పుడు, అతను రగ్బీ, క్రికెట్ రెండింటిలోనూ రాణించాడు.

దేశీయ, ఫ్రాంచైజీ కెరీర్

[మార్చు]
2018లో ఎసెక్స్ తరఫున టెన్ డోషేట్ బ్యాటింగ్.

2003లో, గ్రాహం గూచ్ దక్షిణాఫ్రికాలో ఎసెక్స్‌ జట్టుతో పర్యటనలో ఉండగా, వెస్ట్రన్ ప్రావిన్స్ సెకండ్ XI తో జరిగిన మ్యాచ్‌లో టెన్ డోషేట్ ఆడటం చూశాడు. ఎసెక్స్‌కు వ్యతిరేకంగా, అతను ఒక-రోజు మ్యాచ్‌లో బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. అంతకు ముందు ఒక నాలుగు-రోజుల గేమ్‌లో బంతితో రాణించాడు. వెస్ట్రన్ ప్రావిన్స్ కోచ్‌లలో ఒకరైన పీటర్ కిర్‌స్టెన్, గూచ్‌కు స్నేహితుడు. టెన్ డోషేట్ EU పౌరసత్వం గురించి చెబుతూ, దాని వలన అతను ఇంగ్లాండ్‌లో ఆడేందుకు అర్హుడేనని చెప్పాడు.

2008లో టెన్ డోషేట్, బలమైన ఎసెక్స్ జట్టుకు మూలస్తంభాలలో ఒకటిగా మారాడు. అతనై జట్టు ఫ్రెండ్స్ ప్రావిడెంట్ ట్రోఫీ, ప్రో40 డివిజన్ 2ను గెలుచుకుంది. డెర్బీషైర్ ఫాల్కన్స్‌తో జరిగిన క్లైడెస్‌డేల్ బ్యాంక్ 40 మ్యాచ్‌లో, 2010లో టెన్ డోషేట్ 109 నాటౌట్ స్కోరు చేశాడు. ఫ్రెండ్స్ ప్రావిడెంట్ t20లో ఎస్సెక్స్ తరఫున టెన్ డోషేట్ జట్టులో అత్యుత్తమ బ్యాటింగ్ సగటు సాధించాడు. ఆరు మ్యాచ్‌లలో 59 సగటుతో 296 పరుగులు చేశాడు.

2010లో, అతను ట్వంటీ20 బిగ్ బాష్ లీగ్ కోసం టాస్మానియా [5] తో ఒప్పందం చేసుకున్నాడు. 2011 జనవరిలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2011 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్^కు టెన్ డోషేట్ సంతకం చేసాడు. IPL కాంట్రాక్ట్‌ను గెలుచుకున్న మొదటి అసోసియేట్ ఆటగాడతడు.

2016లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఎసెక్స్‌కు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కెప్టెన్‌గా అతని మొదటి సీజన్‌లో, అతను జట్టును మొదటి డివిజన్‌కు ప్రమోషన్‌కు నడిపించాడు. తరువాతి సీజన్‌లో ఎసెక్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. 2020 జనవరిలో అతను, నాలుగు వరుస సీజన్లలో తన క్లబ్‌ను నడిపించిన తర్వాత ఎసెక్స్ కెప్టెన్‌గా వైదొలిగాడు. [6]

2015లో, అతను 2015–16 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కోసం ఢాకా డైనమైట్స్‌తో సంతకం చేశాడు. [7]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2005, 2006లో జరిగిన ICC ఇంటర్‌కాంటినెంటల్ కప్ పోటీలలో నెదర్లాండ్స్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లలో వరుస ఇన్నింగ్స్‌లలో అతను 84, 158, 138, 100, చివరకు 259 నాటౌట్‌ను సాధించాడు. చివరి ఇన్నింగ్స్‌తో, పోటీలో కొత్త రికార్డును నెలకొల్పాడు. [8]

2007 క్రికెట్ ప్రపంచ కప్ కోసం నెదర్లాండ్స్ జట్టులో టెన్ డోషేట్ ఎంపికయ్యాడు. వార్మప్ మ్యాచ్‌లో బలమైన భారత జట్టుపై ఐదు వికెట్లు తీసాడు. [9] 74 బంతుల్లో 57 పరుగులు చేశాడు. 2009 ICC వరల్డ్ ట్వంటీ 20 ప్రారంభ మ్యాచ్‌లో, రెండు వికెట్లు పడగొట్టి 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆతిథ్య దేశం ఇంగ్లండ్‌ని షాక్‌తో ఓడించడంలో,పాత్ర పోషించాడు. [10]


2010 అక్టోబరులో, బెంగుళూరులో జరిగిన ICC అవార్డ్స్‌లో టెన్ డోషేట్ అసోసియేట్, అఫిలియేట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అతను గతంలో 2008లో ఈ అవార్డును గెలుచుకున్నాడు.[11] 2011 లో మళ్లీ ఈ అవార్డును గెలుచుకున్నాడు.

2017 నవంబరు 14 న, డచ్‌లు 2019 క్రికెట్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించడంలో తోడ్పడ్డాడు. [12] 2018 ఫిబ్రవరిలో, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌కు ముందు గమనించవలసిన పది మంది ఆటగాళ్లలో ఒకడిగా డోస్‌చేట్‌ను పేర్కొంది. [13] 2019 సెప్టెంబరులో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే 2019 ICC T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో డచ్ జట్టులో అతను ఎంపికయ్యాడు. [14] టోర్నమెంట్‌కు ముందు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అతన్ని డచ్ జట్టులో కీలక ఆటగాడిగా పేర్కొంది. [15] 2021 సెప్టెంబరులో అతను, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం డచ్ జట్టులో ఎంపికయ్యాడు. [16]

గమనికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Ryan ten Doeschate". Cricinfo. 18 May 2011. Retrieved 18 May 2011.
  2. "Ten players we wish we had seen more of in internationals". ESPN Cricinfo. Retrieved 2 July 2020.
  3. "Ryan ten Doeschate to retire from professional cricket at end of 2021". ESPN Cricinfo. Retrieved 12 September 2021.
  4. Tagore, Vijay (8 November 2022). "Ryan ten Doeschate to join KKR as fielding coach". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2022-11-08.
  5. "Tasmania sign ten Doeschate for Big Bash". Cricinfo. 6 September 2010. Retrieved 21 November 2010.
  6. "Ten Doeschate steps down as Essex captain". Ilford Recorder. Archived from the original on 23 జనవరి 2020. Retrieved 23 January 2020.
  7. "Dhaka Dynamites Squad - Dynamites Squad - Bangladesh Premier League, 2015 Squad". ESPNcricinfo. Retrieved 2022-06-17.
  8. "ten Doeschate sets new record". Cricinfo. 6 December 2006. Retrieved 13 December 2006.
  9. "India canter to huge win". Cricinfo. 6 March 2007. Retrieved 7 March 2007.
  10. ESPN Cricinfo
  11. "Ryan ten Doeschate is Associate Player of the Year". Cricinfo. 6 October 2010. Retrieved 21 November 2010.
  12. "Ryan ten Doeschate set for Netherlands return". ESPNCricinfo. 14 November 2017. Retrieved 15 November 2017.
  13. "10 stars to look out for at CWCQ". International Cricket Council. 27 February 2018. Retrieved 27 February 2018.
  14. "Ryan Campbell announces squad for T20 World Cup Qualifier". Royal Dutch Cricket Association. Retrieved 8 September 2019.
  15. "Team preview: Netherlands". International Cricket Council. Retrieved 16 October 2019.
  16. "Dutch ICC Men's T20 World Cup squad announced". Royal Dutch Cricket Association. Retrieved 10 September 2021.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు