లంగా భారతీయ స్త్రీలు ధరించే ఒక రకమైన దుస్తుల లో ఒకటి. దీనిని గాగ్రా లేదా చనియా, పావడై అని కూడా ప్రాంతాలను బట్టి పిలుస్తారు. ఇది నడుం నుండి పాదాల వరకు మహిళలు ధరించే స్కట్ వంటింది.[1] [2] ఇది భారత ఉపఖండంలో అనేక ప్రాంతాలలో ధరిస్తారు.[3]
లంగాకు నాడాలు ఉంటాయి. ముడి నడుముకి కుడివైపు వచ్చేలా కడతారు. ఈ ముడిని నడుము కుడి భాగం నుండి ఎడమ భుజం వైపుకి వెళ్ళే పైట కప్పివేస్తుంది. లంగాలు రెండు రకాలు. లోపలి లంగా, పై లంగా (పావడ/పరికిణీ) . హిందూ మతంలో బాలికలు ధరించే సంప్రదాయక దుస్తులలో కూడా లంగా ఒకటి.
పెళ్ళైనవారు చీర లోపల కనిపించకుండా ధరిస్తారు. ఇది సామాన్యంగా నూలుతో చేసినదై ఉంటుంది.
అయితే పెళ్ళికి ముందు లంగా ఓణిలు కలిపి ధరించడం ఆంధ్రదేశంలో సాంప్రదాయంగా ఉండేది. ఇవి పండుగలలో పట్టుతో చేసి వివిధ రంగులలో అంచులతో అందంగా కనిపిస్తాయి. పైలంగాలను పైట లోపల, బయటికి కనిపించేలా (లోపలి లంగా పైన) ధరిస్తారు.
ముఖ్యంగా బాలీవుడ్ గా ప్రసిద్ది చెందిన భారతీయ హిందీ చిత్ర పరిశ్రమ ప్రభావం కారణంగా మహిళలు ధరిస్తుంటారు. [4]