లండన్ బాబులు | |
---|---|
దర్శకత్వం | చిన్నికృష్ణ |
రచన | ఎం.మనికందన్ |
నిర్మాత | మారుతి |
తారాగణం | స్వాతి, రక్షిత్, మురళీ శర్మ |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | ఎస్.బి.ఉద్దవ్ |
సంగీతం | కె |
నిర్మాణ సంస్థ | మారుతి టాకీస్ |
విడుదల తేదీ | 17 నవంబర్ 2017 |
సినిమా నిడివి | 125 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లండన్ బాబులు 2017లో విడుదలైన తెలుగు సినిమా. ఏవీఎస్ స్టూడియో సమర్పణలో మారుతి టాకీస్ బ్యానర్ పై మారుతి నిర్మించిన ఈ సినిమాకు చిన్నికృష్ణ దర్శకత్వం వహించాడు. స్వాతి, రక్షిత్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 17 నవంబర్ 2017న విడుదలైంది.
మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గాంధీ (రక్షిత్) కి అన్నీ కష్టాలే. ఊరి నిండా అప్పులున్న గాంధీ లండన్ వెళ్లి, బాగా డబ్బు సంపాదించి తిరిగి రావాలనుకొంటాడు. తన స్నేహితుడు (సత్య)తో కలసి హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ బ్రోకర్ (జీవా)ని కలుస్తాడు. పాస్ పోర్ట్ అప్లికేషన్‌లో పెళ్లయ్యిందని రాస్తే, వీసా త్వరగా వస్తుందన్న మాటలు నమ్మి ‘భార్య’ పేరు దగ్గర అనుకోకుండా ‘సూర్యకాంతం’ అని పేరు రాస్తాడు. అందుకే ఆ చిన్న తప్పు రక్షిత్‌ని ఎలాంటి సమస్యల్లోకి నెట్టింది? అందులోంచి ఎలా బయటపడ్డాడు?? సూర్యకాంతం (స్వాతి) అనే టీవీ రిపోర్టర్‌కీ, గాంధీకి పరిచయం ఎలా అయ్యింది?? అసలు గాంధీ లండన్ వెళ్లాడా? లేదా ?? అనేదే మిగతా సినిమా కథ.[1][2]