లక్డికాపూల్ | |
---|---|
సమీప ప్రాంతం | |
![]() లక్డికాపూల్ రైల్వే స్టేషను | |
Coordinates: 17°24′10″N 78°28′1″E / 17.40278°N 78.46694°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రో | హైదరాబాదు |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 004 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మలక్పేట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
లక్డికాపూల్, తెలంగాణ రాష్ట్ర్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదులోని పురాతన శివారు ప్రాంతాలలో ఇది ఒకటి. దీనికి సమీపంలో లక్డికాపూల్ ఎంఎంటిఎస్, రవీంద్ర భారతి, హెచ్‌పి పెట్రోల్ పంప్, టెలిఫోన్ భవన్, కలెక్టర్ కార్యాలయం, సిఐడి కార్యాలయం, గ్లోబల్ హాస్పిటల్స్ ఉన్నాయి.
హిందీ, ఉర్దూ భాషలలో లక్డికా అంటే "చెక్కతో చేసినది" అని, పూల్ అంటే "వంతెన" అని అర్థం. చెక్కతో తయారుచేసిన వంతెన పేరు మీదుగా ఈ ప్రాంతానికి లక్డికాపూల్ అనే పేరు వచ్చింది.
లక్డికాపూల్ ప్రాంతం రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలతో కలుపబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రదేశం నుండి నగరంలోని పలు ప్రాంతాలకు బస్సులు నడుపబడున్నాయి. ఇక్కడ లక్డి కా పూల్ రైల్వే స్టేషను, లక్డికాపూల్ మెట్రో స్టేషను ఉన్నాయి.[1]
ఈ ప్రాంతం చరిత్రను ఆవిష్కరించేలా హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లక్డికాపూల్ కూడలిలో చెక్క వంతెన నమూనాను ఏర్పాటు చేయబడింది.[2]