లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య | |
---|---|
28వ అసోం గవర్నర్ | |
Assumed office 2024 జులై 30 | |
ముఖ్యమంత్రి | హిమంత బిశ్వ శర్మ |
అంతకు ముందు వారు | గులాబ్ చంద్ కటారియా |
మణిపూర్ గవర్నర్ (అదనపు బాధ్యత) | |
Assumed office 2024 జులై 30 | |
ముఖ్యమంత్రి | ఎన్ బీరెన్ సింగ్ |
అంతకు ముందు వారు | అనసూయ ఉయికీ |
17వ సిక్కిం గవర్నర్ | |
In office 2023 ఫిబ్రవరి 16 – 2024 జులై 26 | |
ముఖ్యమంత్రి | ప్రేమ్‌సింగ్ తమాంగ్ |
అంతకు ముందు వారు | గంగా ప్రసాద్ |
తరువాత వారు | ఓమ్ ప్రకాష్ మాథూర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | వారణాసి, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1954 అక్టోబరు 3
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | కుముద్ దేవి (m. 1987) |
సంతానం | 1 |
నివాసం | రాజ్ భవన్, గౌహతి, అస్సాం, భారతదేశం |
వృత్తి | రాజకీయనాయకుడు |
లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (జననం:1954 అక్టోబరు 03) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. 2015 నుండి 2023 వరకు శాసన సభ సభ్యులచే ఎన్నుకోబడిన ఉత్తర ప్రదేశ్ నుండి శాసన మండలి సభ్యుడు. సిక్కిం 17వ గవర్నర్‌గా 2023 ఫిబ్రవరి 12 నుండి 2024 జులై 29 వరకు పనిచేసాడు.[1][2][3]
ప్రస్తుతం అసోం గవర్నరుగా 2024 జూలై 30 నుండి అధికారంలో ఉన్నారు. మణిపూర్ గవర్నరుగా (అదనపు బాధ్యత) 2024 జులై 31 నుండి అధికారంలో ఉన్నారు.[4][5] అతను భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నారు.
అతను బిజెపి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర విభాగానికి ఉపాధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ కాశీ క్షేత్ర బిజెపి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి పార్లమెంటరీ స్థానానికి అతను బిజెపి ఎన్నికల కన్వీనర్‌గా నియమించారు.