లక్ష్మణ్ సంగప్ప సవాడి | |||
![]()
| |||
కర్ణాటక 8వ ఉప ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 2019 ఆగస్టు 20 – 2021 జూలై 28 | |||
ముందు | జీ. పరమేశ్వర | ||
---|---|---|---|
తరువాత | డీ.కే. శివ కుమార్ | ||
రవాణా మంత్రి
| |||
పదవీ కాలం 20 ఆగస్టు 2019 – 28 జూలై 2021 | |||
ముందు | డిసి తమ్మన్న | ||
తరువాత | బి. శ్రీరాములు | ||
వ్యవసాయ మంత్రి
| |||
పదవీ కాలం 27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020 | |||
ముందు | శివశంకర రెడ్డి | ||
తరువాత | బీసీ పాటిల్ | ||
సహకార మంత్రి
| |||
పదవీ కాలం 7 జూన్ 2008 – 9 ఫిబ్రవరి 2012 | |||
ముందు | జి.టి. దేవెగౌడ | ||
తరువాత | బీజే పుట్టస్వామి | ||
కర్ణాటక శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 17 ఫిబ్రవరి 2020 – 2023 | |||
ముందు | రిజ్వాన్ అర్షద్ | ||
తరువాత | జగదీష్ షెట్టర్ | ||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 | |||
ముందు | మహేష్ కుమతల్లి | ||
నియోజకవర్గం | అథని | ||
పదవీ కాలం 2004- 2018 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాగనూరు, మైసూర్ రాష్ట్రం , భారతదేశం | 1960 ఫిబ్రవరి 16||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (2023–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ (2023 వరకు) | ||
నివాసం | నాగనూర్ , మైసూర్ రాష్ట్రం , భారతదేశం[1] |
లక్ష్మణ్ సంగప్ప సవాడి (జననం 16 ఫిబ్రవరి 1960) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 ఆగస్టు 20 నుండి 2021 జూలై 28 వరకు బి.ఎస్. యడియూరప్ప మంత్రివర్గంలో కర్ణాటక 8వ ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు.
లక్ష్మణ్ సవాడి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 శాసనసభ ఎన్నికలలో అథని శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దొంగగావ్ షాహజన్ ఇస్మాయిల్‌పై 31253 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను 2008 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ కుమార్ తాత్యాగౌడ పాటిల్‌పై 21668 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2008 జూన్ 7 నుండి 2012 ఫిబ్రవరి 9 వరకు సహకార శాఖ మంత్రిగా పని చేశాడు.
లక్ష్మణ్ సవాడి 2004 శాసనసభ ఎన్నికలలో అథని శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ ఇరానగౌడ కుమతల్లిపై 23771 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ ఇరనగౌడ కుమతల్లి చేతిలో 2331 ఓట్ల తేడాతో ఓడిపోయి, 2019 ఆగస్టు 20న బి.ఎస్. యడ్యూరప్ప మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టి 2020 ఫిబ్రవరి 17న కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై,[2] 2019 సెప్టెంబర్ 27 నుండి 2020 ఫిబ్రవరి 10వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా, 2019 ఆగస్టు 19 నుండి 2021 జూలై 28 వరకు రవాణా శాఖ మంత్రిగా పని చేశాడు.
లక్ష్మణ్ సవాడికి భారతీయ జనతా పార్టీ 2023 శాసనసభ ఎన్నికలలో అథని శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్ నిరాకరించడంతో అతను బీజేపీ పార్టీని వీడి,[3] కాంగ్రెస్ పార్టీలో చేరి[4] కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మహేష్ కుమతల్లిపై 76,122 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]