లక్ష్మి రతన్ శుక్లా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
శాసనసభ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
In office 19 మే 2016 - 4 మే 2021 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతకు ముందు వారు | అశోక్ ఘోష్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
నియోజకవర్గం | హౌరా ఉత్తర | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
క్రీడలు, యువజన సేవల మంత్రి (పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
In office 27 మే 2016 – 5 జనవరి 2021 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
గవర్నర్ | జగదీప్ ధన్కర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ముఖ్యమంత్రి | మమతా బెనర్జీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత వివరాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (2016-2021) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హౌరా, పశ్చిమ బెంగాల్ | 1981 మే 6|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | బిట్టు[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-పేస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆర్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 119) | 1999 మార్చి 22 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1999 సెప్టెంబరు 5 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2013 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | సన్ రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2016 నవంబరు 17 |
లక్ష్మీ రతన్ శుక్లా, పశ్చిమ బెంగాల్ కు చెందిన మాజీ భారతీయ క్రికెటర్, రాజకీయ నాయకుడు. బెంగాల్ క్రికెట్ జట్టుకు కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-పేస్ బౌలర్‌గా ఆడాడు.[2] ఐపిఎల్ జట్టులైన కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లలో కూడా ఆడాడు.[3] ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ తరపున పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2021 జనవరి 5న మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
లక్ష్మి రతన్ శుక్లా 1981, మే 6న పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జన్మించాడు. శ్రీ హనుమాన్ జూట్ మిల్ హిందీ హైస్కూల్, లిలువాలోని డాన్ బాస్కో హై & టెక్నికల్ స్కూల్‌లో పాఠశాల విద్యను చదివాడు.[4]
1997-98 సీజన్‌లో రంజీ ట్రోఫీలో దృష్టిని ఆకర్షించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఎంటిఎన్ యూత్ వరల్డ్ కప్‌లో భారత అండర్-19 జట్టు తరపున మంచి ఆటతీరు కనబరిచినందుకు ప్రాముఖ్యతను పొందాడు. విల్స్ ట్రోఫీలో బెంగాల్ జట్టులో ఒక భాగంగా ఉన్నాడు, అందులో వారు సెమీ-ఫైనల్‌కు చేరుకున్నారు. 2000లో నేషనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు.[5]
2015, డిసెంబరు 30న అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[6]
దేశీయ స్థాయిలో మంచి ఆటతీరును కనబరచిన కారణంగా శుక్లాకు[7] జాతీయ జట్టు నుండి పిలుపు వచ్చింది. ఆశిష్ నెహ్రాకు అనుకూలంగా తొలగించబడ్డాడు, ఆసియా టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కొలంబోలో శ్రీలంకతో ఆడటానికి ఎంపికైన మొదటి టెస్ట్‌లో, అతని పేరు 11 మంది సభ్యుల జట్టులో కనిపించిన తర్వాత కూడా గ్రౌండ్‌లోని ఎలక్ట్రానిక్ స్కోర్‌బోర్డ్‌లో మెరిసింది. 1999 మార్చి 22న నాగ్‌పూర్‌లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ వన్డేలోకి అరంగేట్రం చేసాడు. 1999లో వెస్టిండీస్‌పై తన చివరి వన్డే ఆడాడు.
నిజానికి జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా వంటి ఇతర యువ పేస్ బౌలర్లు జట్టులోకి ప్రవేశించి, ఆకట్టుకునే ప్రదర్శనలతో భారత సీనియర్ జట్టులో తమ స్థానాలను నెలకొల్పిన కారణంగా ఆ సీజన్ తర్వాత బౌలర్‌గా శుక్లాకు తదుపరి అవకాశాలు రాలేదు.
శుక్లా ఆల్‌రౌండర్‌గా తన నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, సెలెక్టర్లు సంజయ్ బంగర్, కనిత్కర్, చివరికి ఇర్ఫాన్ పఠాన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చారు.
2012లో బెంగాల్ (సౌరవ్ గంగూలీ కెప్టెన్) మొదటి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా శుక్లా ప్రతిభ వెలుగులోకి వచ్చాడు.[8] ఈడెన్ గార్డెన్స్‌లో జార్ఖండ్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో 96 బంతుల్లో (16 ఫోర్లు, 8 సిక్సర్లు) 151* పరుగులు చేసి జార్ఖండ్ స్కోరు 280/6ను కేవలం 38.1 ఓవర్లలోనే ఛేదించాడు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో త్రిపురతో జరిగిన తదుపరి మ్యాచ్‌లో, 49 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత, 4/37 (సంజీబ్ సన్యాల్ తన 8 ఓవర్లలో 4/33 తీసుకున్నాడు) త్రిపురను కేవలం 37.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్ చేశాడు. క్వార్టర్-ఫైనల్‌లో మధ్యప్రదేశ్‌పై 2/37 సాధించాడు. సెమీఫైనల్‌లో పంజాబ్ తరఫున అత్యధిక స్కోరర్ మన్‌దీప్ సింగ్ (66) వికెట్ తీశాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ముంబైతో జరిగిన ఫైనల్‌లో 4/38 (ఓపెనర్లు వసీం జాఫర్, అజింక్యా రహానేలతో సహా) తీసుకొని ముంబైని కేవలం 248 పరుగులకు ఆలౌట్ చేశాడు. ఆపై అనుస్టప్ మజుందార్‌తో కలిసి 83 బంతుల్లో 107* పరుగులతో దానిని ఛేదించాడు. 90 బంతుల్లో 106* పరుగులు చేశాడు, అనుస్తుప్ మజుందార్ 45 బంతుల్లో 50* పరుగులు చేసి 23 బంతులు మిగిలి ఉండగానే విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్నాడు.
2012లో విజయ్ హజారే ట్రోఫీ ఆల్ రౌండర్‌గా విజయం సాధించిన తరువాత, విజయ్ హజారే ట్రోఫీ 2013లో బెంగాల్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ టోర్నమెంట్‌ను అద్భుతంగా ఆటతీరును కనపరబరచి, 5/34 తీసుకున్నాడు. తద్వారా ఒడిషాను 175 పరుగులకే పరిమితం చేశాడు, మ్యాచ్‌ను 11 పరుగులతో గెలుచుకున్నాడు.
2016 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు. హౌరా ఉత్తర నియోజకవర్గం నుండి పోటీచేశాడు. భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన సంతోష్ కుమార్ పాఠక్‌ను ఓడించి విజయం సాధించాడు.[9][10][11] మమతా బెనర్జీ రెండవ ప్రభుత్వంలో రాష్ట్ర క్రీడలు, యువజన సేవల మంత్రిగా సేవలు అందించాడు.[12] 2021, జనవరి 5న తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[13]