లక్ష్మీస్ ఎన్టీఆర్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | రామ్ గోపాల్ వర్మ |
నిర్మాత | రాకేష్ రెడ్డి |
సంగీతం | కల్యాణి మాలిక్ |
నిర్మాణ సంస్థ | ఏ కంపెనీ ప్రోడక్షన్స్ |
విడుదల తేదీ | జనవరి 24, 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లక్ష్మీస్ ఎన్‌టిఆర్ 2019 లో విడుదల అయిన తెలుగు సినిమా. ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.[1] [2] ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ , అగస్త్య మంజు దర్శకులు, రాకేష్ రెడ్డి,దీప్తి బాలగిరి నిర్మాత.[3]
1989లో ఎన్టీఆర్ అలియాస్ నందమూరి తారక రామారావు (విజయ్ కుమార్) అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఆయన దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ (యజ్ఞ శెట్టి) వస్తుంది. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతి కి అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి గురించి కొద్ది రోజుల్లొనే దుష్ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రచారం ఎన్టీఆర్ దాకా రావటంతో మేజర్ చంద్రకాంత్ సినిమా 100 రోజుల వేడుకలో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఎన్టీఆర్ ప్రకటిస్తాడు. ఎన్టీఆర్ అల్లుడైన బాబు రావ్ (నారా చంద్రబాబునాయుడు) ఓ పత్రికా అధిపతి(రామోజీరావు) తో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు. 1994లో లక్ష్మీ తో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్ భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు.. కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న బాబు రావు కుట్రలకు తెరతీస్తాడు. కుటుంబ సభ్యులను బెదిరించి తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్య మంత్రి కుర్చీ లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌పై వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయటంతో కుమిలి కుమిలి చనిపోతాడు.