లవ్ రాజ్ సింగ్ ధర్మ్‌షక్తు భారతీయ పర్వతారోహకుడు. ఈయన ఎవరెస్టు శిఖరాన్ని ఐదు సార్లు అధిరోహించారు.
ఈయనకు భాతర దేశ అత్యున్నత పురస్కారం అయిన పద్మశ్రీ 2014 లో లభించింది.
లవ్ రాజ్ సింగ్ ధర్మ్‌షక్తు కుమాన్ హిమాలయా లోని బోనా గ్రామానికి చెందినవారు. ఆయన ఉత్తర ప్రదేశ్ లోని పర్యాటక కార్యాలయంలో ప్రత్యేక విధిపై పనిచేశారు. అచట సాహస కోర్సులో శిక్షణ పొందారు. తర్వాత ఆయన 1990 లో నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్(NIM) నందు పర్వతారోహణ పై శిక్షణను పూర్తి చేశారు. ఆయన పర్వతారోహకునిగా శోధన, రక్షించుటలో ప్రత్యేకీకరణ సంపాదించారు.[1]
ఆయన భార్య రీనా కౌశల్ ధర్మ్‌శక్తు కూడా ఢిల్లీ కి చెందిన పర్వతారోహకురాలు. ఈమె 2009 లో దక్షిణ ధృవం నకు వెళ్ళిన మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు[2]
1989 లో ధర్మషక్తు నంద కోట్ (1861 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించారు. ఈ అధిరోహణ లక్నో లోని పర్వతారోహక బృందంతో కలసి చెశాడు. ఆయన శిఖరాన్ని అధిరోహించాడు. ఈయన 1989లో గల పర్వతారోహక బృందాలలో ఒక భాగమై నిలిచి లడక్ లోణి మామోస్టంగ్ కాంగ్రి (7516 మీటర్లు) పర్వతమును,1992 లో నందా భానెర్ (6236 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించాడు. ఈయన 1997 లో బ్రిటిష్ పర్వతారోహక బృందంలో అనుసంధాన అధికారిగా పనిచేసి నందా ఘుంతి (6309 మీటర్లు) ను అధిరోహించాడు. 2008 లో భారత సరిహద్దు రక్షణ దళం (బి.ఎస్.ఎఫ్) తో కలసి కాంచనగంగ (8586 మీటర్లు) ను అధిరోహించారు.[1] As of June 2012, he has climbed about 38 peaks.[3]