లా గణేశన్ | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 ఆగస్టు | |||
రాష్ట్రపతి | రాంనాథ్ కోవింద్ | ||
---|---|---|---|
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2016 – 2018 | |||
పదవీ కాలం 2022 జులై 18 – 2022 నవంబరు 17 | |||
అధ్యక్షుడు | రామ్‌నాథ్ కోవింద్ | ||
ముందు | జగదీప్ ధన్కర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తంజావూర్ | 16 ఫిబ్రవరి 1945||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
లా గణేశన్ అయ్యర్. (జననం: 16 ఫిబ్రవరి 1945) 2023 ఫిబ్రవరి 20 నుండి నాగాలాండ్‌కు 19వ గవర్నర్‌గా [1] పనిచేస్తున్న ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతని మునుపటి పదవీకాలాల్లో 2021 ఆగస్టు 27 నుండి 2023 ఫిబ్రవరి 19 వరకు మణిపూర్ 17వ గవర్నర్‌గా పనిచేసారు, పశ్చిమ బెంగాల్ గవర్నర్. (అదనపు బాధ్యత) 2022 జూలై 18 నుండి 2022 నవంబరు 17 వరకు పనిచేసారు. అంతకు ముందు, అతను మధ్యప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు. గణేశన్ భారతీయ జనతా పార్టీ [2] సీనియర్ నాయకుడు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుభవజ్ఞుడు.ఇంతకూ పూర్వం ఇతను తమిళనాడు రాష్ట్ర భాజాపాలో సినీయర్ నాయకుడిగా ఉండేవాడు.[3][4]
గణేశన్ 1945 ఫిబ్రవరి 16న ఇలకుమీరకవన్ అలమేలు దంపతులకు ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తన చిన్నతనంలోనే తండ్రి మరణం వల్ల అన్నయ్య పాలనలో పెరిగాడు . ఉద్యోగం వదిలేసి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తగా చేరాడు.[5][6]
ఇతను తమిళనాడు బీజేపీ లో జనరల్ సెక్రెటరీగా నియమించడానికి ముందు ఇతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారాక్గా పనిచేసేవాడ. ఆ తర్వాత బిజెపి జాతీయ స్థాయి వైస్ ప్రెసిడెంట్ పదవి చేపట్టాడు.[7]
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నజ్మా హెప్తుల్లా స్థానంలో ఇతను భారత చట్టసభలో చేరాడు.[8]