లాంగ్‌లెంగ్ | |
---|---|
Coordinates: 26°28′07″N 94°48′33″E / 26.4685°N 94.8092°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
జిల్లా | లాంగ్‌లెంగ్ |
Elevation | 1,066 మీ (3,497 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 7,613 |
భాషలు | |
• అధికారిక | ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 798625 |
Vehicle registration | ఎన్ఎల్ |
లాంగ్‌లెంగ్, ఇది నాగాలాండ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన లాంగ్‌లెంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.
లాంగ్‌లెంగ్ పట్టణం 26°28′07″N 94°48′33″E / 26.4685°N 94.8092°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. ఇది సముద్రమట్టానికి 1,066 మీటర్ల (3,497 అడుగుల) ఎత్తులో ఉంది.[2]
ఇక్కడ ఫోమ్ నాగా ప్రజలు నివసిస్తున్నారు, ఇక్కడి ప్రజలు ఫోమ్ భాషను మాట్లాడుతారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, లాంగ్‌లెంగ్ పట్టణంలో 7,613 జనాభా ఉంది.[1] ఇందులో 3,991 మంది పురుషులు, 3,622 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 1,226 (16.10%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 91.45% కాగా, ఇది రాష్ట్ర సగటు 79.55% కన్నా ఎక్కువ ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 92.48% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 90.30% గా ఉంది.
ఈ పట్టణంలో 93.12% మంది క్రైస్తవులు, 3.52% మంది హిందువులు, 3.24% మంది ముస్లింలు, 0.11% మంది బౌద్ధులు, 0.01% మంది ఇతరులు ఉన్నారు.
ఈ పట్టణంలో 1,690 గృహాలు ఉన్నాయి, దీనిని 11 వార్డులుగా విభజించారు. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను సరఫరా చేస్తోంది. పట్టణ కమిటీ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి ఈ పట్టణ కమిటీకి అధికారం ఉంది.[1]