లాడ్ బజార్ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 002 |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ = |
లాడ్ బజార్ (చుడి బజార్), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ గాజుల కొరకు ఎన్నో ఏళ్ళుగా ఒక మార్కెటు కూడా ఉంది. చారిత్రాత్మక చార్మినార్ నుండి ఉన్న నాలుగు ప్రధాన రహదారులలో ఇదీ ఒకటి.
లాడ్ అంటే లక్క అని అర్థం. దీనిని గాజులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దానిపై కృత్రిమ వజ్రాలు పొదిగి ఉంటాయి. 1 కిలోమీటరు (0.62 మైళ్ళు) పొడవునా దుకాణాల వరుస ఉంది. వీటిల్లో గాజులు, చీరలు, వివాహ సంబంధిత వస్తువులు, అలంకరణ ఆభరణాలను విక్రయిస్తారు.
కుతుబ్ షాహి వంశం, నిజాంల కాలం నుండి ఉన్న ఈ మార్కెటు చాలా పాతది. చార్మినార్, మక్కా మసీదు, చౌమహల్లా పాలస్ వంటి చారిత్రక కట్టడాలకు సమీపంలో ఉంది.
చౌడి బజార్ అనేది గాజులకు పేరొందిన మార్కెటు. ఇక్కడ గాజులు, విలువైన రాళ్ళు, ముత్యాలు, ఆభరణాలు,[1] వెండి సామాగ్రి, నిర్మల్, కలంకారీ పెయింటింగ్స్, బిద్రీ కళ, రాళ్ళతో నిండిన లక్క గాజులు, చీరలు, చేతితో నేసిన పట్టు, కాటన్ వస్త్రాలు దొరుకుతాయి.[2] బ్రోకేడ్, వెల్వెట్, బంగారు ఎంబ్రాయిడరీ బట్టలు, సాంప్రదాయ ఖారా దుపట్టాలు, లక్క గాజులు మొదలైనవి ఇక్కడ లభిస్తాయి. ఇక్కడికి సమీపంలో షహ్రాన్ మార్కెట్ కూడా ఉంది.