లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ (Laurus Labs) హైదరాబాదుకు చెందిన ఒక అంతర్జాతీయ (మందుల తయారీ) ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థ. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులో మూడు తయారీ యూనిట్లు ఉన్నాయి. డాక్టర్ సత్యనారాయణ చావా స్థాపించిన ఈ ఫార్మా కంపెనీ ఏపీఐలు, కస్టమ్ సింథసిస్, జనరిక్ మందులు, బయోటెక్నాలజీ తయారీపై దృష్టి సాధించింది. లారస్ ల్యాబ్స్ ఏఆర్వీ చికిత్సా రంగంలో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ సంస్థలకు ఎపిఐల మందుల పంపిణీ దారుడు.[1]
కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభంలో భారీ డిమాండ్ ఉన్న హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను మార్కెట్ చేయడానికి 2020 మార్చిలో కంపెనీకి యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లభించింది. కోవిడ్ -19 నివారణ చికిత్స క్లినికల్ ట్రయల్స్ కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా చేస్తామని కంపెనీ ప్రకటించింది.''హెల్త్ కేర్ కంపెనీగా మాకు మొదట ఔషధాలను సరఫరా చేయాల్సిన బాధ్యత ఉంది. రెండవది మా సహోద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని చూసుకుంటూ మా కర్మాగారాలను ఎలా నడపాలి. మా సహోద్యోగులందరూ ముందుకు తీసుకెళ్లడానికి చాలా నిజాయితీగా ఉండటం కంపెనీ అదృష్టం గా ఉన్నదని వ్యవస్థాపకుడు పేర్కొన్నాడు.[2]
లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ మొదట లారస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా సెప్టెంబర్ 19, 2005 న హైదరాబాదులో కంపెనీల చట్టం, 1956 ప్రకారం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా స్థాపించబడింది. తరువాత కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మర్చి దాని పేరును లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ గా మార్చారు[3]. డాక్టర్ సత్యనారాయణ చావా 2007లో లారస్ ల్యాబ్స్ ను ప్రారంభించినప్పుడు దాదాపు రూ.60 కోట్లు పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టారు. ఎనిమిదేళ్ల తర్వాత ఈ సంస్థ 2016 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.2,000 కోట్ల ఆదాయాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది.[4]
లారస్ ల్యాబ్స్ భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి ('ఆర్ అండ్ డి') ఆధారిత ఫార్మాస్యూటికల్ కంపెనీ, యాంటీ-రెట్రోవైరల్స్ ('ఎఆర్వి') హెపటైటిస్ సి, ఆంకాలజీ ఎంపిక చేసిన అధిక-వృద్ధి చికిత్సా ప్రాంతాల కోసం జనరిక్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ ('ఎపిఐ') లో పేరుపొందినది. ఈ సంస్థ ఆంకాలజీ, యాంటీ-ఆస్తమా ఆప్తాల్మాలజీ యాంటీడయాబెటిక్స్ కార్డియోవాస్కులర్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పిపిఐలు) వంటి ఇతర చికిత్సా రంగాలలో ఎపిఐలను కూడా తయారు చేస్తుంది.అంతేకాకుండా తన ఇంటిగ్రేటెడ్ జనరిక్స్ ఫినిష్డ్ డోస్ ఫామ్స్ ('ఎఫ్డీఎఫ్') వ్యాపారాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించింది, దీనిలో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. లారస్ ల్యాబ్స్ నాలుగు వ్యాపార మార్గాల్లో పనిచేస్తుంది అవి జనరిక్స్ - ఎపిఐ జనరిక్స్ - ఎఫ్డిఎఫ్ సింథసిస్ అండ్ ఇంగ్రీడియెంట్స్. 2005లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 59 ఉత్పత్తులను విడుదల చేసింది. ఆస్పెన్ ఫార్మాకేర్ లిమిటెడ్ అరబిందో ఫార్మా లిమిటెడ్, సిప్లా లిమిటెడ్, మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్, నాట్కో ఫార్మా లిమిటెడ్ ('నాట్కో'), స్ట్రైడ్స్ షాసన్ లిమిటెడ్ మొదలైనవి ప్రధాన వినియోగదారులు (కస్టమర్లు).[5]
దేశంలో కొత్త ఔషధాల విక్రయాల కోసం మెజారిటీ భారతీయ ఫార్మా కంపెనీలు తమ అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి అనుగుణంగా లారస్ ల్యాబ్స్ సంస్థ అభివృద్ధి లో భాగంగా బెంగళూరుకు చెందిన రిచ్కోర్ లైఫ్సైన్సెస్లో 72.55 శాతం వాటాను రూ.247 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. బయోలాజికల్ డ్రగ్స్ తయారీకి కీలకమైన బయోటెక్ ఉత్పత్తులను రిచ్కోర్ అభివృద్ధి చేసి తయారు చేస్తుంది. ఈ సంస్థ అధునాతన ఆర్ అండ్ డి , తయారీ సౌకర్యాల తో ఉంది ,కాంట్రాక్ట్ పరిశోధన, అభివృద్ధి , తయారీ సేవలను అందించడం ద్వారా కంపెనీలు తమ బయోప్రాసెస్ ను పెంచడానికి సహాయపడుతుంది. ఈ సంస్థ పెద్ద ఎత్తున కిణ్వ ప్రక్రియ సామర్థ్యాలను కలిగి ఉంది, జంతు మూల ఉచిత రీకాంబినెంట్ ఉత్పత్తులను తయారు చేస్తుంది, వ్యాక్సిన్, ఇన్సులిన్, స్టెమ్ సెల్ ఆధారిత పునరుత్పత్తి మందుల కంపెనీలు జంతు, మానవ రక్తం-ఉత్పన్న ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రత్యామ్నాయ ఆహారాలు, గుడ్డు ప్రోటీన్, ప్రత్యామ్నాయ మాంసం, ప్రత్యామ్నాయ పాల ప్రోటీన్లతో సహా జంతు ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి ఖచ్చితమైన కిణ్వ ప్రక్రియ (ఒక రకమైన ఆహార సాంకేతికత) పై దృష్టి పెడుతుంది. సంస్థ ప్రణాళికలో నిర్లక్ష్యం చేయబడిన వ్యాధులకు ఉత్పత్తులను, చికిత్సలను తీసుకురావాలనుకుంటోంది. ఇటువంటి ఉత్పత్తులకు ప్రభుత్వేతర తర సంస్థల (ఎన్ జి ఓ), క్రౌడ్ సోర్సింగ్ వాటి నుండి నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సంస్థ పేర్కొంటుంది. ఆసియా, అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లగలిగితే ఈ ఉద్దేశ్యం లాభదాయకమైన వ్యాపారంగా మారే అవకాశం ఉంది" అనిసంస్థ భావిస్తుంది.[6]
నిర్దిష్ట రకాల రక్త క్యాన్సర్లను నయం చేయడానికి స్వదేశీ సిఎఆర్ టి-సెల్ థెరపీని అభివృద్ధి చేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై (ఐఐటి ముంబై)కి చెందిన స్టార్టప్ ఇమ్యునోఅడాప్టివ్ సెల్ థెరపీ ప్రైవేట్ లిమిటెడ్ (ఇమ్యునోఎసిటి) లో లారస్ పెట్టుబడి పెట్టింది[6].