లార్జ్ ఫార్మాట్ (ఆంగ్లం: Large Format) 4 X 5 ఇంచిల (102 X 127 mm) గానీ అంత కన్నా పెద్ద ఫిలింని ఉపయోగించే ఛాయాచిత్రకళ [1]. లార్జ్ ఫార్మాట్ ఫిలిం, మీడియం ఫార్మాట్ ఫిలిం కన్నా కొద్దిగా పెద్దగా, 135 ఫిల్మ్ కంటే బాగా పెద్దదిగా ఉంటుంది. 135 ఫిలింతో పోలిస్తే పదహారింతలు పెద్దది కావటం మూలాన లార్జ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీలో స్పష్టత కూడా పదహారింతలు ఎక్కువగనే ఉంటుంది.
మీడియం ఫార్మాట్, 135 ఫిల్మ్ ల వలె చుట్టలుగా కాకుండా, లార్జ్ ఫార్మాట్ ఫిలిం షీట్ ఫిలిం గా లభ్యం అవుతుంది. మొదట గాజుతో తయారు చేయబడే ఫోటోగ్రఫిక్ ప్లేట్ లను లార్జ్ ఫార్మాట్ కెమెరాలలో వినియోగించేవారు.
1816 లో కళాకారులైన ఫ్రెంచి సోదరులు జోసెఫ్ నీప్సె, క్లైడ్ నీప్సె లు మొదట్ నెగిటివ్ ను, దాని పాజిటివ్ ను సాధించారు. 1826-27 లో వీటిని శాశ్వత పరచే ప్రక్రియలను కనుగొన్నారు. ఇదే పద్ధతిని అనుసరించి కొద్దిగా మెరుగులు దిద్ది వారి భాగస్వామి లూయిస్ డాగురే, డాగురోటైప్ ను కనుగొన్నాడు. 19 ఆగష్టు 1839 న ఫ్రాన్సు, ఫోటోగ్రఫీని ప్రపంచానికి తాము ఇచ్చే కానుకగా పరిచయం చేసింది. 50వ దశకానికి లార్జ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీ జన బాహుళ్యం లోకి వచ్చింది [2] కొద్ది పాటి మార్పులతో ఇంగ్లాండుకు చెందిన హెన్రీ ఫాక్స్ టాల్బాట్ క్యాలోటైప్ ను,
1851 లో బ్రిటన్ కు చెందిన ఫ్రెడెరిక్ స్కాట్ ఆర్చర్, ఫ్రాన్సుకు చెందిన గుస్తావ్ లే గ్రే దాదాపు ఒకేసారిగా కొలాయిడన్ అనే వెట్ ప్లేట్ ప్రక్రియను కనుగొన్నారు. 1860 నాటికి కొలాయిడన్ ప్రక్రియ డాగురోటైప్ ల కు స్వస్తి పలికించింది.
1880 నాటికి డ్రై ప్లేట్ సాంకేతికత కూడా అభివృద్ధి చేయబడింది.
లార్జ్ ఫార్మాట్లు అయిన డాగురోటైప్, కొలాయిడన్ ప్రక్రియలలో వాడబడే ప్లేట్లలో పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటం, కాపీ చేయటం కష్టతరంగా ఉండటంతో క్రొత్త దారులు వెదకవలసి వచ్చింది. ఫోటోగ్రఫీ నైపుణ్యం అవసరమయ్యే ఒక కళ/వైజ్ఙానిక శాస్త్రం గా మాత్రమే కాక, ఔత్సాహికులకు అభిరుచిగా మారటం, ఫోటోగ్రఫీ లో వచ్చిన ఈ పెనుమార్పును ఈస్ట్‌మన్ కొడాక్ అందిపుచ్చుకొంటూ మీడియం ఫార్మాట్ కెమెరాలు, వాటికి తగిన ఫిలిం ను తయారీ ప్రారంభం చేయటం తో లార్జ్ ఫార్మాట్ ఫిలిం మరుగున పడింది. [3]
లార్జ్ ఫార్మాట్ ఫిలిం లో వివిధ పరిమాణాలు (ఇంచిలలో)