Lalgudi Vijayalakshmi | |
---|---|
జన్మనామం | Lalgudi Vijayalakshmi |
జననం | Chennai |
సంగీత రీతి | Classical, fusion |
వృత్తి | Violinist, composer |
వాయిద్యం | Violin |
క్రియాశీలక సంవత్సరాలు | 1979 – present |
లాల్గుడి విజయలక్ష్మి లాల్గుడి బాణి కి చెందిన ఐదవ తరం కర్నాటక వయోలిన్ విద్వాంసురాలు, స్వరకర్త, సంగీతకర్త.
ఆమెను 2022 లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి అవార్డుకు ఎంపిక చేసింది.
లాల్గుడి విజయలక్ష్మి వయోలిన్ మాస్ట్రో లాల్గుడి జయరామన్‌కు చెన్నైలో జన్మించారు. ఆమె సోదరుడు కూడా ప్రముఖ వయోలిన్ వాద్యకారుడు, GJR కృష్ణన్ (లాల్గుడి కృష్ణన్ గా ఆయన పేరొందారు) . [1]
త్యాగరాజ శిష్యపరంపరకు చెందిన తాతగారయినటువంటి లాల్గుడి గోపాల అయ్యర్ మార్గదర్శకత్వంలో ఆమె తన శిక్షణను ప్రారంభించారు, తరువాత తన తండ్రి వద్ద శిక్షణ పొందారు.
లాల్గుడి విజయలక్ష్మి 1979లో తొలి కచేరీ చేశారు. ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు, ఎన్నో దేశాలలో టూర్లు చేశారు. ఆమె శైలి ఆమె తండ్రి గాయక శైలి వంటిది, స్వర అనుకరణకు దగ్గరగా ఉంటుంది.
ఆమె తన సోదరుడు, వయోలిన్ ప్లేయర్ లాల్గుడి కృష్ణన్ తో కలిసి చాలా యుగళగీతాలను ప్రదర్శించారు. [2]