వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | లీ మేఘన్ కాస్పెరెక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఎడిన్‌బర్గ్, స్కాట్లాండ్ | 1992 ఫిబ్రవరి 15|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగ్ ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టులు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 133) | 2015 జూన్ 28 న్యూజీలాండ్ - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2021 సెప్టెంబరు 23 న్యూజీలాండ్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 46) | 2015 జూలై 11 న్యూజీలాండ్ - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 జూలై 12 న్యూజీలాండ్ - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2011/12 | వెస్టర్న్ ఆస్ట్రేలియా | |||||||||||||||||||||||||||||||||||||||
2012–2013 | ఎసెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
2012/13 | వెల్లింగ్‌టన్ బ్లేజ్ | |||||||||||||||||||||||||||||||||||||||
2013/14–2018/19 | ఒటాగో స్పార్క్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
2018–2019 | యార్క్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||
2019 | యార్క్‌షైర్ Diamonds | |||||||||||||||||||||||||||||||||||||||
2019/20–present | వెల్లింగ్‌టన్ బ్లేజ్ | |||||||||||||||||||||||||||||||||||||||
2020 | వెలాసిటీ | |||||||||||||||||||||||||||||||||||||||
2022 | Northern Diamonds | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 3 October 2022 |
లీ మేఘన్ కాస్పెరెక్ (జననం 1992, ఫిబ్రవరి 15) న్యూజీలాండ్ జాతీయ జట్టు తరపున ఆడుతున్న స్కాటిష్ క్రికెటర్. గతంలో స్కాటిష్ జాతీయ జట్టు తరపున ఆడిన లీ కాస్పెరెక్, ఉన్నతస్థాయి క్రికెట్ లో ఆడేందుకు న్యూజిలాండ్‌కు మారింది.[1]
కాస్పెరెక్ 15 సంవత్సరాల వయస్సులో 2007 కౌంటీ ఛాలెంజ్ కప్‌లో ఇంగ్లీష్ కౌంటీ పక్షాలకు వ్యతిరేకంగా స్కాట్‌లాండ్ తరపున ఆడింది.[2] 2008లో యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో ఐర్లాండ్, నెదర్లాండ్స్లతో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.[3] 2008 ప్రారంభంలో, దక్షిణాఫ్రికాలో జరిగిన 2008 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ కోసం కాస్పెరెక్ స్కాట్లాండ్ జట్టులో ఎంపికయింది. ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో ఆడింది.[4]
కాస్పెరెక్ న్యూజిలాండ్‌లో మొదటి సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం 86 పరుగులు చేసింది, ఒక వికెట్ తీసింది. 2013-14 సీజన్ కోసం, ఒటాగో స్పార్క్స్ ( డునెడిన్‌లో ఉంది) కి మారింది, రెండు అర్ధ సెంచరీలు సాధించింది. కాంటర్‌బరీతో జరిగిన ఒక మ్యాచ్‌లో 6 వికెట్లతోపాటు, [5] పోటీలో ప్రధాన వికెట్-టేకర్‌గా 18 వికెట్లు పడగొట్టింది.[6] తరువాతి సీజన్‌లో, 15 వికెట్లు తీసి ఒటాగో ప్రధాన వికెట్ టేకర్‌గా, పోటీలో నాల్గవ స్థానంలో నిలిచింది.[7]
2015 మేలో, 2015 భారత పర్యటన కోసం జట్టులో స్థానం పొందింది.[8] ఐదు వన్డే ఇంటర్నేషనల్, మూడు ట్వంటీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడింది.[9][10] తొలి వన్డేలో అరంగేట్రం చేసి 10 ఓవర్లు బౌలింగ్ చేసి 3/39 సాధించింది.[11] తర్వాత 2015లో, టూరింగు శ్రీలంకకు వ్యతిరేకంగా, కాస్పెరెక్ 4/27తో తన తొలి వన్డే నాలుగు వికెట్లు తీసింది.[12]
2016 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో, కాస్పెరెక్ మూడు ఓవర్లలో 4/7 తీసుకున్నది.[13]
2020 జనవరిలో, ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో పేరు పొందింది.[14]
2020-21లో న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో 2వ మహిళ వన్డే సమయంలో, కాస్పెరెక్ 10 ఓవర్లలో 6/46తో ముగించింది.[15] మూడు మ్యాచ్‌లలో రెండు మాత్రమే ఆడినప్పటికీ, 9 వికెట్లతో వన్డే లెగ్ ఆఫ్ ది సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచింది.[16]