లీషంగ్దం తాంతొయింగంబీ దేవి | |
---|---|
![]() 59వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకుంటు | |
జననం | అక్టోబరు 17 చింగ్ఖు , ఖుండ్రక్పం, మణిపూర్ |
వృత్తి | నాటకరంగ, టీవి, సినిమా నటి |
జీవిత భాగస్వామి | తోక్చొం దీపక్ |
తల్లిదండ్రులు | లీషాంగ్థెమ్ ఇబుంగోమాచా సింగ్ లీషాంగ్థెమ్ ఒంగ్బీ లీబక్లీ దేవి |
పురస్కారాలు | ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు (2011) |
లీషంగ్దం తాంతొయింగంబీ దేవి మణిపూర్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి.[1] నటించి ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు అనేక అవార్డులను అందుకుంది.[2]
లీషంగ్దం తాంతొయింగంబీ దేవి అక్టోబరు 17న లీషాంగ్థెమ్ ఇబుంగోమాచా సింగ్ - లీషాంగ్థెమ్ ఒంగ్బీ లీబక్లీ దేవి దంపతులకు మణిపూర్ రాష్ట్రంలోని చింగ్ఖు ప్రాంతంలో జన్మించింది. బి. కామ్ గ్రాడ్యుయేట్ చదివింది.[3] మణిపూర్ విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ పూర్తిచేసింది. విశ్వవిద్యాలయ మహిళా ఫుట్‌బాల్ జట్టు నుండి అఖిల భారత మహిళా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొన్నది. సాంప్రదాయ సంగీత వాయిద్యమైన పెనాను వాయించడంలో కూడా శిక్షణ పొందింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడానికి ముందు, 2007 తొలి నెలలో ఓజా నిలదజ ఖుమాన్ ఆధ్వర్యంలో మూడు నెలల నటనలో శిక్షణ పొందింది. తరువాత త్రిపురలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్‌లో తన ఒక సంవత్సరం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోర్సును కూడా పూర్తిచేసింది.
సినిమాలు, దూరదర్శన్ సీరియల్స్, ఐఎస్టీవి సీరియల్స్‌లో నటించింది.[4] 2019లో తను సహాయక పాత్రలో నటించిన ఈగి కోన సినిమా నటనకు 67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మణిపురిలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
59వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2011లో ఫిజిగీ మణి సినిమాలోని నటనకుగానూ నటించి ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాలో యైఫాబీ పాత్రను పోషించింది.[5] నంగ్నా కప్పా పచ్చడే అనే సినిమాలో నుంగ్షిటోంబి పాత్ర పోషించినందుకు 9వ మణిపూర్ రాష్ట్ర అవార్డులలో 2014లో ప్రధాన పాత్రలో ఉత్తమ నటి - మహిళా అవార్డు లభించింది.[6]
2016లో, పట్కీ థారో అనే మణిపూర్ సినిమాలో నటించి ప్రాగ్ సినీ అవార్డ్స్ నార్త్-ఈస్ట్ 2016 లో ఉత్తమ నటిగా నార్త్-ఈస్ట్ ఫిమేల్ అవార్డును పొందింది.[7] ఇచే తంఫా సినిమాలో నటనకు ప్రాగ్ సినీ అవార్డ్స్ - నార్త్ ఈస్ట్ 2018లో ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది.[8][9] 11వ మణిపురి రాష్ట్ర సినిమా అవార్డు 2018లో ఇచే తంఫా సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది.[10]
2021లో, చలనచిత్రం నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021లో నాన్-ఫీచర్ పంథౌగి లిక్లామ్ సినిమాలో నటించి ఉత్తమ నటిగా గ్రాండ్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది.
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | దర్శకుడు |
---|---|---|---|
2007 | నంగ్నా తవైని | థాజా | చాన్ హీస్నామ్ |
2009 | షాక్ హెన్బా భూత్ | నూర్ జహాన్ | బిశ్వామిత్ర |
పాచా | పాంతోయ్ | బిశ్వామిత్ర | |
పాఖుమ్ | కింబోయి | బిశ్వామిత్ర | |
2010 | తోయిచ | తోయిచ | నింగ్‌థౌజం ప్రేమ్ |
థాసి థానౌ | మేమ్తోయ్ | ఈపు | |
2011 | ఫిజిగీ మణి | యైఫబీ | ఓ. గౌతమ్ |
నంగ్‌షిబీ కబావ్ లోయ | అలాంటిది | జీతేంద్ర నింగోంబ | |
మోంగ్ఫామ్ | లింతోయ్ | లై జితేన్ | |
ఈపక్తుడా ది లేక్ | థోయ్ | జాన్సన్ మయంగ్లంబం | |
మిరాంగ్ | బిమోలా | అరిబం శ్యామ్ శర్మ | |
లోయిబతారే తా రాజు | థోయ్ | పిలు హెచ్. | |
2012 | లీపాక్లీ | లీపాక్లీ | అరిబం శ్యామ్ శర్మ |
2013 | బెరజీ బాంబ్ | థోయిబి | ఓ. గౌతమ్ |
నంగ్న కప్ప పచ్చడే | నుంగ్షిటోంబి | మఖోన్మణి మోంగ్సాబా | |
అమాంబ సయోన్ | మేమి | జాన్సన్ మయంగ్లంబం | |
2014 | పల్లెప్ఫాం | లెంబి | వాంగ్లేన్ ఖుండోంగ్బామ్ |
అయేక్ప లై | థాజా | ఓకేన్ అమక్చం | |
ఈడీ కదాయిడా | రోహిణి | ఓ. గౌతమ్ | |
విడిఎఫ్ థాసన | లైష్ణ | హోమెన్ డి'వై | |
2015 | పట్కీ థారో | ఓకేన్ అమక్చం | |
బోర్క్షరణ్య (రెయిన్‌ఫారెస్ట్) | దిగంత మజుందార్ | ||
కైషల్ జైల్దుగీ ఫడోక్సింగ్ | లోయా స్నేహితుడు | సత్యజిత్ బికె | |
2016 | ఆక్టాబీ నట్టే | లీబాక్లీ | పారీ లువాంగ్ |
ఐఖోయ్ పబుంగి | సనాటోంబి | హేమంత ఖుమాన్ | |
థారో తంబల్ | తంబల్ | బిజగుప్త లైశ్రమ్ | |
2017 | ఇచే తంఫా | తంఫా | బిజగుప్త లైశ్రమ్ |
తోయిచా 3 | తోయిచ | జీతేంద్ర నింగోంబ | |
ఇషు | అంబిక | ఉత్పల్ బోర్పూజారి | |
2018 | టామ్థిన్ | సనారెయి | ఓజిత్‌బాబు నింగ్‌థౌజం |
చింగ్డా సత్పి ఎంగెల్లీ | పెరింగ్ | బాబీ హౌబామ్ | |
వాన్ నామ్ | లీహావో | మైపక్షన హారోంగ్‌బామ్ | |
2019 | ఈగి కోన | న్గంతోయ్ | బాబీ వాహెంగ్‌బామ్ & మైపక్షనా హారోంగ్‌బామ్ |
2021 | రోంగ్డైఫ్ | లీను | బాబీ హౌబామ్ |
సంవత్సరం | సినిమా | పాత్ర | దర్శకుడు |
---|---|---|---|
2012 | మీ ఇక్పా | తంబల్సాంగ్ | చావోబా థియం |
2015 | టాంగ్గోయ్ | బాబీనా సలామ్ | |
2017 | టిన్త్రోక్ | యైమా భార్య | ఓకేన్ అమక్చం |
2021 | పాంథౌగి లిక్లం | థోయిబి | రాకేష్ మొయిరంగ్థెమ్ |
2022 | ఈవై | హెన్బా తల్లి | ఖ్వైరక్పం బిశ్వామిత్ర |