వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | లుంగిసానీ ట్రూ-మ్యాన్ ఎంగిడి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డర్బన్, క్వాజులు-నేటల్, దక్షిణాఫ్రికా | 1996 మార్చి 29|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 4 అం. (193 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 334) | 2018 జనవరి 13 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 డిసెంబరు 26 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 126) | 2018 ఫిబ్రవరి 7 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 ఏప్రిల్ 2 - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 22 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 67) | 2017 జనవరి 20 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 22 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–ప్రస్తుత< | నార్దర్స్న్ క్రికెట్ జట్టు| | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2021 | టైటన్స్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2021 | చెన్నై సూపర్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022–ప్రస్తుతం | ఢిల్లీ క్యాపిటల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | పార్ల్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023-present | శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 1 May 2023 |
లుంగిసానీ ట్రూ-మ్యాన్ ఎన్‌గిడి (జననం 1996 మార్చి 29) దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న ప్రొఫెషనల్ క్రికెటరు. [2] 2018 దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షిక అవార్డులలో, అతను ఐదుగురు క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [3] [4] 2020 జూలైలో, క్రికెట్ దక్షిణాఫ్రికా వార్షిక అవార్డుల వేడుకలో ఎన్‌గిడి వన్‌డేలకు, T20I లకూ కూడా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. [5]
ఎన్‌గిడి డర్బన్‌లోని క్లోఫ్‌లో పెరిగాడు. హైబరీ ప్రిపరేటరీ స్కూల్‌లో చేరేందుకు స్కాలర్‌షిప్ పొందారు. ఎన్‌గిడి తల్లి ఇంట్లో పనిమనిషిగా, తండ్రి స్థానిక పాఠశాలలో మెయింటెనెన్స్ వర్కరుగా పనిచేసేవారు. హిల్టన్ కాలేజీ స్కూల్‌లో చేరేందుకు ఎన్‌గిడి స్కాలర్‌షిప్ పొందాడు. హిల్టన్‌లో అతని మొదటి మూడు సంవత్సరాలలో, ఎన్‌గిడి క్రికెట్‌పై దృష్టి పెట్టడానికి ముందు హిల్టన్ రగ్బీ జట్టులో ఆడాడు. హిల్టన్‌లో ఉన్నప్పుడు, జింబాబ్వే మాజీ ఆల్-రౌండర్ నీల్ జాన్సన్ వద్ద ఎన్‌గిడి శిక్షణ పొందాడు. [6] [7]
హిల్టన్ నుండి పట్టభద్రుడయ్యాక ఎన్‌గిడి, ప్రిటోరియా విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ సోషియాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డిగ్రీలో చేరాడు. [8]
ఎన్‌గిడి 2015 ఆఫ్రికా T20 కప్ కోసం నార్తర్న్స్ క్రికెట్ జట్టులో చేరాడు.[9] 2016 జూలైలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా అతన్ని ఆఫ్రికా T20 కప్ ప్లేయర్ ఆఫ్ ఇయర్‌గా పేర్కొంది. [10] 2017 ఆగస్టులో, అతను T20 గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం బెనోని జల్మీ జట్టులో ఎంపికయ్యాడు. [11] అయితే, 2017 అక్టోబరులో క్రికెట్ దక్షిణాఫ్రికా, మొదట్లో టోర్నమెంట్‌ను 2018 నవంబరుకు వాయిదా వేసి, ఆ తర్వాత వెంటనే రద్దు చేసింది. [12]
2018 జనవరిలో, 2018 IPL వేలంలో ఎన్‌గిడిని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. [13] 2018 అక్టోబరులో, అతను ఎంజాన్సీ సూపర్ లీగ్ T20 టోర్నమెంటు మొదటి ఎడిషన్ కోసం ష్వానే స్పార్టాన్స్ జట్టులో ఎంపికయ్యాడు. [14] [15] 2019 మార్చిలో, 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వారి గమనించాల్సిన ఎనిమిది మంది ఆటగాళ్ళలో ఒకరిగా అతన్ని పేర్కొంది.[16]
2019 సెప్టెంబరులో, 2019 మజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంటు కోసం ష్వానే స్పార్టాన్స్ జట్టులో ఎన్‌గిడి ఎంపికయ్యాడు. [17] 2021 ఏప్రిల్లో, అతను దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు నార్తర్న్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు.[18]
2022 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు వేలంలో ఎన్‌గిడిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. [19]
2023 మేలో, మేజర్ లీగ్ క్రికెట్ (MLC) టీమ్ శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ప్రారంభ సీజన్ కోసం ఎన్‌గిడి సంతకం చేస్తున్నట్లు ప్రకటించింది. [20]
2017 జనవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎన్‌గిడిని తీసుకున్నారు. [21] అతను 2017 జనవరి 20 [22] న శ్రీలంకపై దక్షిణాఫ్రికా తరపున తన తొలి T20I ఆడి, అందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. [23] T20I సిరీస్ సమయంలో, శ్రీలంకతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌ల కోసం దక్షిణాఫ్రికా జట్టుకు ఎన్‌గిడి ఎంపికయ్యాడు. [24] అయితే, పొత్తికడుపు గాయం కారణంగా అతను వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. [25]
2018 జనవరిలో, భారత్‌తో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఎన్‌గిడిని చేర్చారు. [26] అతను 2018 జనవరి 13న భారత్‌పై దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో అడుగుపెట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6/39తో సహా మ్యాచ్‌లో 7/87 సాధించాడు. దక్షిణాఫ్రికా 135 పరుగుల తేడాతో గెలిచింది. [27] అదే నెలలో, అతను భారత్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులో ఎంపికయ్యాడు.[28] అతను 2018 ఫిబ్రవరి 7న భారతదేశంపై తన వన్‌డే రంగ ప్రవేశం చేసాడు.[29]
2018 మార్చిలో, క్రికెట్ దక్షిణాఫ్రికా 2018–19 సీజన్‌కు ముందు ఎన్‌గిడికి జాతీయ కాంట్రాక్టు ఇచ్చింది.[30] 2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికయ్యాడు. [31] [32] 2020 మార్చి 4న, ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ వన్‌డేలో, ఎన్‌గిడి వన్‌డే క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. [33] అదే మ్యాచ్‌లో, తన 26వ గేమ్‌లో వన్డేల్లో 50 వికెట్లు తీసి మ్యాచ్‌ల పరంగా దక్షిణాఫ్రికా తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలరయ్యాడు. [34]
2021 సెప్టెంబరులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులోకి ఎన్‌గిడి ఎంపికయ్యాడు. [35] 2022 జూలైలో, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో, ఎన్‌గిడి T20I క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. [36]
2020 జూలైలో ఎన్‌గిడి, దక్షిణాఫ్రికా క్రికెట్‌లో బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమం గురించి చర్చించాలని, ఈ ఉద్యమానికి జట్టు మద్దతు ఇవ్వాలనీ జాతీయ జట్టుకు పిలుపునిచ్చాడు. క్రికెట్‌లో సంస్థాగతమైన జాత్యహంకారాన్ని కూడా అతను ప్రస్తావించాడు. ఈ విషయమై జట్టు చేసే ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి తనకు అభ్యంతరమేమీ లేదని చెబుతూ, ఎన్‌గిడి ఇలా అన్నాడు: "మనమంతా మళ్లీ వ్యక్తిగతంగా కలిసాం. మనం దాని గురించి మాట్లాడాం, ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. కానీ మనం ఐకమత్యంగా లేనందున ఇది ప్రస్తుతం చాలా కష్టం (సమస్య) కూడా. అందరం కలిసి రానప్పుడు చర్చించడం చాలా కష్టమైన విషయమని నేను భావిస్తున్నాను. కానీ మనం మళ్లీ ఆడటానికి కలిసిన తర్వాత, మనం దానిని పరిశీలిద్దాం" [37]
ఎన్‌గిడి వ్యాఖ్యలపై మాజీ ప్రొటీస్ రూడి స్టెయిన్, పాట్ సింకాక్స్, బోయెటా డిప్పెనార్‌ల నుండి వ్యతిరేక అభిప్రాయాలు విమర్శలూ వచ్చాయి. కనీసం 30 మంది మాజీ ప్రోటీస్, - అందరూ నల్లజాతి ఆటగాళ్ళే - ఐదుగురు కోచ్‌లు ఎన్‌గిడికీ, BLM ఉద్యమానికీ మద్దతునిస్తూ ఒక సామూహిక ప్రకటనను విడుదల చేశారు. అదే సమయంలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా "తన అభిప్రాయాల పట్ల నిస్సందేహంగా ఉండాలనీ, సమస్యను ఎదుర్కొనేలా చూడాలని" కూడా వారు కోరారు.[38]
The feel-good story about the 6'4" young black pacer, son of domestic helps from Durban, who first went to school because of an anonymous benefactor, has got South Africa smiling.