లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ (LUPEX) లేదా చంద్రయాన్-4 అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) లు సంయుక్తంగా చేపడుతున్న ప్రణాళికాబద్ధమైన చంద్ర యాత్ర.[7][8][9] 2026 లో గాని, ఆ తరువాత గానీ ప్రయోగించే ఈ యాత్రలో చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి మానవరహిత చంద్ర ల్యాండరు, రోవరులను పంపుతారు.[10][5] జాక్సా, తాను అభివృద్ధి చేస్తున్న హెచ్3 ప్రయోగ వాహనాన్ని, రోవరునూ అందించే అవకాశం ఉంది. ఇస్రో ల్యాండరు తయారు చేస్తుంది.[11][12]
2017 డిసెంబరులో ఇస్రో ప్రీ-ఫేజ్ A, ఫేజ్ A అధ్యయనం కోసం ఒక ఇంప్లిమెంటేషన్ అరేంజ్‌మెంట్ (IA) పై సంతకం చేసింది. నీటి కోసం చంద్రుని ధ్రువ ప్రాంతాలను అన్వేషించడానికి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) [13] తో కలిసి 2018 మార్చిలో సాధ్యాసాధ్యాల నివేదికను పూర్తి చేసింది.[14] 2025 తరువాత ప్రయోగించే ఉమ్మడి చంద్ర ధ్రువ అన్వేషణ మిషన్ (లుపెక్స్)తో దీన్ని చేపడతారు.[10][15][16]
ఇస్రో, జాక్సా లు 2018 డిసెంబరులో జాయింట్ మిషన్ డెఫినిషన్ రివ్యూ (JMDR) నిర్వహించాయి. 2019 చివరి నాటికి, జాక్సా దాని అంతర్గత ప్రాజెక్టు సంసిద్ధత సమీక్షను ముగించింది.[17]
2019 సెప్టెంబరులో ల్యాండింగ్ ప్రయత్నంలో చంద్రయాన్-2 లోని ల్యాండరు చంద్రునిపై కూలిపోయినందున, భారతదేశం లుపెక్స్ కోసం అవసరమైన ల్యాండింగ్ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మరో ప్రయత్నంగా చంద్రయాన్-3 అనే కొత్త చంద్రయాత్ర జరపడంపై అధ్యయనం చేయడం ప్రారంభించింది.[18]
2019 సెప్టెంబరు 24 న జాక్సా, NASA సంయుక్త ప్రకటనలో NASA భాగస్వామ్య అవకాశాల గురించి కూడా చర్చించాయి.[19]
జాక్సా తన దేశీయ సిస్టమ్ రిక్వైర్‌మెంట్ రివ్యూ (SRR) ని 2021 ప్రారంభంలో పూర్తి చేసింది.[20] 2023 ఏప్రిల్‌లో ల్యాండింగ్ స్థల విశ్లేషణ, చంద్రునిపై ల్యాండర్, రోవర్ల స్థానాన్ని అంచనా వేసే పద్ధతులు, కమాండ్, టెలిమెట్రీల కోసం భూస్థిత యాంటెన్నాలపై సమాచారాన్ని పంచుకోవడానికి లుపెక్స్ వర్కింగ్ గ్రూప్ 1, భారతదేశానికి వచ్చింది.[21]
చంద్రుని ధ్రువ ప్రాంతాలలో వాహన రవాణా, అక్కడ సుస్థిరమైన అన్వేషణ కోసం, రాత్రిపూట మనుగడకు అవసరమైన కొత్త అన్వేషణ సాంకేతికతలను ఈ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ప్రదర్శిస్తుంది.[22][12] ఖచ్చితమైన ల్యాండింగ్ కోసం ఇది జాక్సా వారి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (SLIM) మిషన్ నుండి తీసుకున్న ఫీచర్ మ్యాచింగ్ అల్గారిథమ్‌ను, నావిగేషనల్ పరికరాలనూ ఉపయోగించుకుంటుంది. ల్యాండర్ పేలోడ్ సామర్థ్యం కనీస స్థాయిలో 350 కి.గ్రా. (770 పౌ.) ఉంటుంది.[1][23] రోవరులో ఉపరితలం నుండి 1.5 మీటర్ల లోతులో నమూనాలను సేకరించడానికి అవసరమైన డ్రిల్‌తో సహా జాక్సా, ఇస్రో లు అందించే బహుళ పరికరాలను తీసుకువెళుతుంది.[24][1] నీటి కోసం పరిశోధన, విశ్లేషణ ఈ మిషన్ లక్ష్యాలుగా ఉండవచ్చు.[11][25]
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారి PROSPECT మిషన్ లోని ఎక్సోస్పిరిక్ మాస్ స్పెక్ట్రోమీటర్ L-బ్యాండ్ (EMS-L) వాస్తవానికి రష్యా వారి లూనా 27 లో పేలోడ్‌గా పంపించాలని ప్రణాళిక చేసారు.[26][27] అయితే ఆ EMS-L ఇప్పుడు లుపెక్స్ మీద వెళ్తుంది. 2022 లో ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి వలన, రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా అంతర్జాతీయ సహకారం కొనసాగుతుందో లేదో అనే సందేహం కలిగింది. [28] ఇతర స్పేస్ ఏజెన్సీల నుండి పేలోడ్ ప్రతిపాదనలు కోరవచ్చు.[8]
తక్కువ శక్తి గామా రే స్పెక్ట్రోమీటర్ (LEGRS): [29] కాడ్మియం జింక్ టెల్యురైడ్ (CZT) డిటెక్టర్‌లతో చంద్రునిపై అస్థిర రవాణాను అధ్యయనం చేయడానికి తక్కువ శక్తి (46.5 కెవి) గామా కిరణ రేఖను కొలవడానికి.
↑ 8.08.1"India's next Moon shot will be bigger, in pact with Japan". 8 September 2019. Retrieved 10 March 2021. For our next mission — Chandrayaan-3 — which will be accomplished in collaboration with JAXA (Japanese Space Agency), we will invite other countries too to participate with their payloads.
↑ 10.010.1"ISRO to handhold private sector to create innovative space ecosystem in the country: S. Somanath, Chairman". Geospatial World (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-11. Retrieved 2022-05-09. We are working with JAXA on developing a payload, as well as a mission to go to moon. This will be launched using Japan's launch vehicle, but the spacecraft will be jointly developed by ISRO and Japan. A lander which will land on the moon. This will be after Chandrayaan 3 It will take three, four, five years to develop.