లేతమనసులు (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణన్ - పంజు |
---|---|
తారాగణం | హరనాధ్, జమున |
సంగీతం | ఎం. ఎస్. విశ్వనాథన్ |
నిర్మాణ సంస్థ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
లేత మనసులు తమిళంలో విజయం సాధించిన కుళందయుం దైవముం చిత్రానికి రీమేక్. తమిళ సినిమాకు పనిచేసిన జంట దర్శకులు కృష్ణన్ - పంజు ఈ సినిమాకు కూడ దర్శకులుగా పనిచేశారు. తమిళ సినిమాలో నటించిన జమున, కుట్టి పద్మినిలు ఈ సినిమాలో కూడా నటించారు. ఈ చిత్రం 1966,సెప్టెంబర్ 16న విడుదలైయింది.[1]
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
పిల్లలు దేవుడు చల్లనివారే, కల్ల కపటమెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం | ఆరుద్ర | ఎం. ఎస్. విశ్వనాథన్ | పి.సుశీల |
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో, పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కోనలో | ఆరుద్ర | ఎం. ఎస్. విశ్వనాథన్ | పి.సుశీల |
అందాల ఓ చిలక | దాశరథి | ఎం. ఎస్. విశ్వనాథన్ | పి.బి. శ్రీనివాస్ పి. సుశీల |
అందాల ఈ రేయి నీదేనోయీ, రచన: దాశరథి, గానం. ఎస్. జానకి
ఈ పువ్వులలో ఒక చల్లదనం నీ , రచన: దాశరథి, గానం.పి.బి శ్రీనివాస్ , పి సుశీల
ఏడుకొండల ఫై నుండి ఎల్ల జనుల , రచన: దాశరథి, గానం.పి.సుశీల
హాల్లోమేడమ్ సత్యభామ , రచన: దాశరథి, గానం.పి బి శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు బృందం
మక్కువదీర్చర మువ్వగోపాలా , రచన: క్షేత్రయ్య పదం, గానం.పి సుశీల.