లేపా రాడా జిల్లా | |
---|---|
![]() అరుణాచల్ ప్రదేశ్‌లోని లేప రాడా జిల్లా స్థానం | |
దేశం | ![]() |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
స్థాపన | 2018 |
ప్రధాన కార్యాలయం | బసర్ |
కాల మండలం | UTC+05:30 (IST) |
లేపా రాడా జిల్లా, ఈశాన్య భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా, దీని ప్రధాన కార్యాలయం బేసర్. లేపా రాడా 29-బసర్ శాసనసభ నియోజకవర్గం, 1- పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ జిల్లాలో బసర్, తిర్బిన్, డారి, సాగో అనే 4 పరిపాలనా విభాగాలు ఉన్నాయి.[1][2] వెస్ట్ సియాంగ్ జిల్లా నుండి అస్సాం సరిహద్దు వెంబడి ఉన్న దక్షిణ ప్రాంతాలను విభజించడం ద్వారా ఇది కొత్త జిల్లాగా ఏర్పడింది.
లోయర్ సియాంగ్ జిల్లాను విభజించడం ద్వారా ఈ జిల్లాను 2018 లో సృష్టించారు.[3]
ప్రజలు
లేపా రాడాలో గాలో తెగకు చెందిన ప్రజలు ఎక్కువుగా నివసిస్తారు. మోపిన్ ఇక్కడ ప్రధాన సాంప్రదాయ పండుగ.