లోక్‌తాంత్రిక్ జనతా దళ్ | |
---|---|
నాయకుడు | శరద్ యాదవ్ |
సెక్రటరీ జనరల్ | రాజీవ్[1] |
స్థాపకులు | శరద్ యాదవ్ |
స్థాపన తేదీ | 18 మే 2018 |
రద్దైన తేదీ | 20 మార్చి 2022 |
ప్రధాన కార్యాలయం | శరద్ యాదవ్ భవన్, ఇం.నెం.బిపి 8, డిడిఎ ఫ్లాట్స్, బిందాపూర్, ద్వారక, న్యూఢిల్లీ, న్యూ ఢిల్లీ జిల్లా, న్యూఢిల్లీ - 110059 |
యువత విభాగం | లోకతాంత్రిక్ యువ జనతా దళ్ |
రాజకీయ విధానం | సోషలిజం[2] మల్నివాసిజం[3] బహుజనిజంism[4] |
రాజకీయ వర్ణపటం | కేంద్ర-వామపక్ష రాజకీయాలు |
ECI Status | రిజిస్టర్ చేయబడిన గుర్తింపు లేని పార్టీ |
లోక్‌తాంత్రిక్ జనతా దళ్ అనేది భారతదేశంలో గుర్తింపు పొందని నమోదిత రాజకీయ పార్టీ. దీనిని 2018 మే నెలలో శరద్ యాదవ్, అలీ అన్వర్[5] ప్రారంభించారు.[6][7][8] బీహార్‌లో భారతీయ జనతా పార్టీతో పొత్తు కారణంగా యాదవ్ జనతాదళ్ (యునైటెడ్) నుండి విడిపోయిన తర్వాత పార్టీ స్థాపించబడింది.[9][10][11] ఇది 2022 మార్చి 20న రాష్ట్రీయ జనతాదళ్ లో విలీనమైంది.
బహుజన్ ముక్తి పార్టీ లోక్తాంత్రిక్ జనతాదళ్‌లో విలీనం చేయబడింది.[12][13] బహుజన్ ముక్తి పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు ప్రవేంద్ర ప్రతాప్ సింగ్.[14]
ఎం.పీ. వీరేంద్ర కుమార్ నాయకత్వంలోని కేరళలోని జనతాదళ్ (యునైటెడ్) యూనిట్‌లోని వీరేంద్ర కుమార్ వర్గం పార్టీలో విలీనమైంది.[15]
ఈ పార్టీ 2022 మార్చి 20న రాష్ట్రీయ జనతాదళ్ (RJD) లో విలీనం చేయబడింది, శరద్ యాదవ్ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఐక్య ప్రతిపక్షాన్ని ముందుకు తీసుకురావడానికి మాజీ జనతాదళ్ వర్గాలు, ఇలాంటి సిద్ధాంతాలు కలిగిన ఇతర పార్టీలన్నింటినీ తిరిగి ఏకం చేసే పనిని చేపట్టారు.[16][17][18] ఆ పార్టీకి చెందిన ఎంవీ శ్రేయామ్స్ కుమార్ నేతృత్వంలోని కేరళ యూనిట్ ఆర్జేడీలో చేరలేదు.[19] కేరళ వర్గం 2023 అక్టోబరు 12న రాష్ట్రీయ జనతా దళ్లో విలీనమైంది.[20]