లోక్‌సభ సెక్రటేరియట్ | |
---|---|
భారత జాతీయ చిహ్నం | |
సెక్రటేరియట్ అవలోకనం | |
అధికార పరిధి | భారతదేశం |
ప్రధాన కార్యాలయం | లోక్‌సభ సెక్రటేరియట్ సంసద్ భవన్, సంసద్ మార్గ్, న్యూ ఢిల్లీ, భారతదేశం |
Minister responsible | ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్ |
సెక్రటేరియట్ కార్యనిర్వాహకుడు/ | ఉత్పల్ కుమార్ సింగ్, IAS, లోక్‌సభ సెక్రటరీ జనరల్ |
లోక్‌సభ సెక్రటేరియట్ అనేది లోక్‌సభ స్వతంత్ర కార్యాలయం.ఇది లోక్‌సభ స్పీకర్ సలహా మేరకు పనిచేస్తుంది.
లోక్‌సభ స్పీకర్ తన రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడంలో, లోక్‌సభ స్పీకర్‌కు సెక్రటరీ జనరల్ (లోక్‌సభ) సహాయం అందజేస్తారు.ఇతని పే స్కేల్, పదవి, హోదా మొదలైనవి ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి అధికారితో సమానంగా ఉంటాయి. (అంటే భారతదేశ క్యాబినెట్ సెక్రటరీ)
ఇతనికి అదనపు సెక్రటరీ స్థాయి కార్యనిర్వాహకులు,జాయింట్ సెక్రటరీ,వివిధ స్థాయిలలో సెక్రటేరియట్ ఇతర అధికారులు, ఇతర సిబ్బంది సెక్రటరీ జనరల్ (లోక్‌సభ)కు సహాయ సహకారాలు అందిస్తారు.[1]
సెక్రటరీ జనరల్ 60 సంవత్సరాల వయస్సులో అతని/ఆమె పదవీ విరమణ వరకు పదవిలో ఉంటారు.అతను/ఆమె స్పీకర్‌కు మాత్రమే జవాబుదారీగా ఉంటారు.అతని చర్య లోక్‌సభలో లేదా వెలుపల చర్చించబడదు లేదా విమర్శించబడదు.
లోక్‌సభ స్పీకర్ తరపున, అతను పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని సభ్యులను పిలుస్తాడు. స్పీకర్ లేనప్పుడు బిల్లులను ప్రామాణీకరిస్తాడు. [2]