వంశీ (2000 సినిమా)

వంశీ
దర్శకత్వంబి. గోపాల్
తారాగణంమహేష్ బాబు ,
నమ్రతా శిరోద్కర్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
పద్మాలయా స్టూడియోస్ ప్రై. లిమిటెడ్
విడుదల తేదీ
అక్టోబరు 4, 2000 (2000-10-04)
భాషతెలుగు

వంశీ 2000 అక్టోబరు 4 న విడుదలైన తెలుగు చిత్రం. బి. గోపాల్ దర్శకత్వంలో పద్మాలయ స్టూడియోస్ పతాకంపై జి. ఆదిశేషగిరిరావు నిర్మించాడు. ఇందులో మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు, కృష్ణ కీలక పాత్ర పోషించాడు. మణి శర్మ సంగీతం అందించాడు.[1] కథ సత్యానంద్ రాశాడు. ఈ చిత్రాన్ని 2012 లో హిందీలోకి వంశీ: ది వారియర్ గా వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనువదించింది.

వంశీ ( మహేష్ బాబు ) ప్రతిభావంతుడు, విజయవంతమైన ఫ్యాషన్ డిజైనరు. అతనికి ఆస్ట్రేలియాలో జరిగే డిజైనర్ పోటీలో పాల్గొనే అవకాశం వస్తుంది. వంశీకి స్నేహ ( మయూరి కంగో ) అనే సహోద్యోగి ఉంది. ఫ్యాషన్ పోటీల కోసం అతను చేసే డిజైన్లకు మోడలింగు చేయడానికి ఆమె ఎంపికౌతుంది. ఉత్తమమైన దుస్తులను రూపొందించడానికి వంశీ ఆస్ట్రేలియా సంస్కృతిని అధ్యయనం చేయవలసి ఉన్నందున, అతన్ని ఒక నెల పాటు విస్తృతంగా ఆస్ట్రేలియాలో పర్యటించమని కోరతారు. శిల్ప ( నమ్రతా శిరోద్కర్ ) ఆస్ట్రేలియాలో చదువుతోంది. పారిశ్రామికవేత్త అంకినీడు ప్రసాద్ ( నాసర్ ) కుమార్తె ఆమె. పరీక్షల తర్వాత సెలవుల్లో ఆస్ట్రేలియా అంతా తిరగాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఈ పర్యటనలో శిల్ప వంశీని కలుస్తుంది. ఆమె నెమ్మదిగా అతనితో ప్రేమలో పడుతుంది.

వంశీని ప్రేమిస్తున్న స్నేహ, యాత్ర ముగిసిన తరువాత శిల్ప వంశీలు దగ్గరైనట్లు తెలుసుకుంటుంది. ఆమె మెట్లపై నుండి పడి గాయాలపాలవుతుంది. తన మోడల్ గాయపడినందున వండీ నిరాశ చెందినప్పుడు, శిల్ప వంశీ డిజైన్లతో పోటీలోకి దిగి మొదటి బహుమతిని గెలుచుకుని అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. వంశీ, శిల్ప భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు, స్నేహ అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఒక భారతీయ మోడల్ భారతదేశం కంటే ఆస్ట్రేలియాలోనే మంచి పేరు తెచ్చుకోగలదని ఆనె భావిస్తుంది. వంశీ పట్ల తనకున్న ప్రేమ గురించి శిల్ప తన తండ్రికి చెబుతుంది. తన కుమార్తె వెంట పడవద్దని అతడు వంశీని హెచ్చరిస్తాడు. రెండు పోరాటాల తరువాత, శిల్ప వంశీని ఒక ఆలయంలో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆలయంలో వంశీని కలవడానికి శిల్ప ఇంటి నుండి పారిపోతుండగా, అర్జున్ ( కృష్ణ ) ఆమెను కిడ్నాప్ చేస్తాడు.

శిల్ప కోసం ఎదురుచూసి ఆమె రాకపోవడంతో వంశీ, ఆమె గురించి ఆరా తీయడానికి శిల్పా ఇంటికి వెళ్తాడు. తన కుమార్తెను కిడ్నాప్ చేశాడనే ఆరోపణతో అంకినీడు అతన్ని అరెస్టు చేయిస్తాడు. అర్జున్ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని తెలుసుకున్న తరువాత, అంకినీడు వంశీకి బెయిలిచ్చి, తన కుమార్తెను రక్షించమని వేడుకుంటాడు. అతను తన కుమార్తెను వంశీకిచ్చి పెళ్ళి చేసేందుకు కూడా అంగీకరిస్తాడు. మిగతా కథలో అర్జున్ అంకినీడు, అతని ఇతర ముఠా సభ్యులు జయ ప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాసరావు లపై ప్రతీకారం తీర్చుకుంటాడు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."వేయించుకుంటే బాగుంటుంది"భువనచంద్రసుఖ్వీందర్ సింగ్, కె.ఎస్ చిత్ర5:28
2."వెచ్చ వెచ్చగా"దేవిశ్రీ ప్రసాద్దేవిశ్రీ ప్రసాద్, ప్రసన్న4:54
3."ఏబీసీ దాటిందో"సిరివెన్నెల సీతారామశాస్త్రిశంకర్ మహదేవన్5:18
4."ఓహో సోనియా"చంద్రబోస్ (రచయిత)శంకర్ మహదేవన్4:28
5."కోయిలమ్మ"సిరివెన్నెల సీతారామశాస్త్రిఉదిత్ నారాయణ్, సుజాత4:37
6."సరిగమ పదనిసరీ"భువనచంద్రఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కల్పన5:08
మొత్తం నిడివి:29:53

విశేషాలు

[మార్చు]

ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే నాయకా నాయికలు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్ళిచేసుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Vamsi (2000) | Vamsi Movie | Vamsi Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-11.