వడివేలు | |
---|---|
జననం | వడివేలు మధురై, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | సినిమానటుడు, నేపధ్యగాయకుడు, హాస్యనటుడు. |
క్రియాశీల సంవత్సరాలు | 1991 – ప్రస్తుతం |
వడివేలు భారతీయ సినిమానటుడు, హాస్యనటుడు, సినీ నేపధ్యగాయకుడు. 1990ల నుండి ఆయన తమిళ చిత్రసీమలో హాస్యనటునిగా ఉన్నాడు. ఆయన సుమారు 200 చిత్రాలలో పనిచేసాడు. ఆయన నటించిన చిత్రాలైన కాలం మారి పోచు (1996), వెట్రి కోడి కట్టు (2000), తావసి (2001), చంద్రముఖి (2005), ఇంసాయి అరసాన్ 23 పులికేసి (2006), మర్ధామలై (2007), కథావరయన్ (2008), ఆధవన్ (2009) లలో హాస్యనటనకు ఉత్తమ హాస్యనటుల విభాగంలో అనేక పురస్కారాలను పొందాడు. ఆయన ప్రజాదరణకు మీడియా ఆయనకు "వైగై పుయాల్" మారుపేరు పెట్టింది. దీనిఅర్థం మధురై వైపు ప్రవహిస్తున్న వైగై నది నుండి వచ్చిన తుఫాను.[1]
ఆయన మధురై దగ్గర ఒక గ్రామంలో అక్టోబరు 10, 1960న జన్మించాడు. చిత్ర పరిశ్రమలోనికి రాకముందు పోటోలు, పెయింటింగ్స్ షాపులో పనిచేసేవాడు. కొన్ని వందల రూపాయల సంపాదనతో బాధలు పడ్డాడు. ఆయనకు రాజ్‌కిరణ్ చిత్రసీమలోనికి ప్రవేశించేందుకు అవకాశమిచ్చాడు.
ఆయన సరోజినిని వివాహమాడాడు. ఆయన భార్య సరోజిని ప్రాథమిక పాఠశాల, కిండర్ గార్డెన్ కిడ్స్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసేవారు. వారికి సుబ్రహ్మణ్యం, మనోజ్ అనే ఇద్దరు కుమారులు, కావ్య అనే కుమార్తె ఉన్నారు. ఆయనకు భార్యపైగల ప్రత్యేకమైన అనుబంధంతో ప్రతీ సినిమా యొక్క మొదటి షూటింగ్ కు ఆమెను తీసుకొని వెళతాడు.[2]