వనమాలి

వనమాలి
జననంమణిగోపాల్
19 May, 1968
చిత్తూరు
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లువనమాలి
వృత్తిసినీ గీత రచయిత
పాత్రికేయుడు (పూర్వం)
భార్య / భర్తవిష్ణుప్రియ
పిల్లలువనమాలి (కుమారుడు) వనప్రియ (కుమార్తె)
తండ్రిగోపాలకృష్ణయ్య
తల్లిశాంతకుమారి

వనమాలి వర్థమాన సినీ గీత రచయిత. ఈయన హ్యాపీ డేస్ చిత్రానికి ఉత్తమ గేయరచయితగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. పూర్వాశ్రమంలో ఈయన ఈనాడు సితార పత్రికలలో పాత్రికేయులుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగులో పిహెచ్.డి. చేశారు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

వనమాలి అసలు పేరు మణిగోపాల్. వీరు జన్మతః తమిళులు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కడప, కదిరి లో సాగింది. పిమ్మట హిందీ భాషా ప్రవీణ కూడా పూర్తి చేశారు. చిత్తూరులో డిగ్రీ పూర్తి చేశాక, బి.ఇడి.తో పాటు లైబ్రరీ సైన్స్ లో డిప్లొమా పొందారు. ఆ తర్వాత తెలుగు భాష మీద ప్రత్యేక అభిమానంతో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగులో గోల్డ్ మెడల్ సాధించారు. ఇదే విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో పిహెచ్.డి. కూడా పూర్తి చేశారు.

ఉద్యోగ ప్రస్థానం

[మార్చు]

మద్రాసు శాఖ ఈనాడు/సితారల్లో ప్రకటించిన రిపోర్టర్/సబ్-ఎడిటర్ ఉద్యోగ ప్రకటన చూసి దానికి దరఖాస్తు చేయగా 176 మంది అభ్యర్థులలో వీరు ఒక్కరే ఎంపికయ్యారు. తరువాత హ్యాపీ డేస్ చిత్రంలో పాటలు రాశాక ఈనాడులో రిపోర్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తన అభిరుచి మేరకు రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు.

సినీరంగ ప్రవేశం

[మార్చు]

ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీతంలో దర్శకులు గీతాకృష్ణ గారి టైమ్ చిత్రానికి గేయాలను రచించడం ద్వారా చలన చిత్ర రంగ ప్రవేశం చేశారు.

ఇంతవరకు పనిచేసిన చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]