వన్ | |
---|---|
దర్శకత్వం | సంతోష్ విశ్వనాథ్ |
రచన | బాబీ – సంజయ్ |
నిర్మాత | శ్రీలక్ష్మి .ఆర్ |
తారాగణం | మమ్ముట్టి మురళీగోపి జోజు జార్జ్ మాథ్యూ థామస్ ఇషాని కృష్ణ గాయత్రీ అరుణ్ నిమిషా సజయన్ |
ఛాయాగ్రహణం | వైద్య సోమసుందరమ్ |
కూర్పు | నిషాద్ యూసుఫ్ |
సంగీతం | గోపి సుందర్ |
నిర్మాణ సంస్థ | ఇచైస్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | అంటో జోసెఫ్ ఫిలిం కంపెనీ |
విడుదల తేదీ | జూలై 30, 2021 |
సినిమా నిడివి | 152 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 15 కోట్లు |
వన్ మలయాళం లో మార్చి 2021లో విడుదలై.. అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి 30 జులై 2021న విడుదలైన పొలిటికల్ డ్రామా సినిమా. మమ్ముట్టి, మురళీగోపి, జోజు జార్జ్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు.
కల్లూరి చంద్రం (మమ్ముట్టి) సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు. రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు సంజయ్ (మాథ్యూ థామస్) సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి పై ఓ పోస్ట్ పెడతాడు. ముఖ్యమంత్రికి ఉండే ప్రోటోకాల్ వల్ల సంజయ్ ఇబ్బందులు ఎదుర్కొంటాడు.ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులకు జవాబుదారి తనం ఉండాలంటే ‘రైట్ టు రీకాల్’ సిస్టమ్ కరెక్ట్ అని సీఎం భావిస్తుంటాడు. దాన్ని అమలులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తుంటాడు. సీఎం చంద్రం స్నేహితుడు, పార్టీ అధ్యక్షుడు బాబీ (జోజు జార్జ్) సైతం అందుకు అంగీకరించడు. ఈ క్రమంలో కల్లూరి చంద్రంకు ఎదురైన పరిస్థితులు ఏంటి? ప్రజల మేలు కోరి ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన ‘రైట్ టు రీకాల్’ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందా ?? లేదా అనేదే మిగతా సినిమా కథ.[1]