శ్రీ వరుణదేవ్ మందిర్ పాకిస్తాన్ దేశం లోని, సింధ్ రాష్ట్రంలో, కరాచీ పట్టణంలో మనోరా ద్వీపంలో ఉన్న దేవాలయం.ఈ దేవాలయం హిందూ పురాణాలలోని వరుణుడు ప్రధాన దైవంగా కలది[1]. ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించనది ఇతమిత్థంగా తెలియనప్పటికీ [2], ప్రస్తుతం ఉన్న నిర్మాణం 1917-18 సంవత్సరంలో నిర్మించినట్టుగా తెలుస్తున్నది [3]. తేమతో కూడిన సముద్రపు గాలుల వల్ల గుడి, గుడిపైన చిత్రించబడిన చిత్రాలు క్రమక్షయానికి గురవుతున్నాయి. ఈ భవనం 1950 నుండి దైవారాధనకు ఉపయోగించుటలేదు[4].
16వ శతాబ్దానికి చెందిన సంపన్న నౌకావ్యాపారి భోజోమల్ నాన్సీ భట్టియా మనోరా ద్వీపాన్ని కొనుగోలు చేసాడు. అతని కుటుంబీకులు, ఈ ద్వీపంలోని దేవాలయాన్ని బాగోగులు చూస్తూ ఉండేవారు. ప్రస్తుతం, ఈ ఆలయం పాకిస్తాన్ హిందూ పరిషత్ (హిందూ కౌన్సిల్ ఆఫ్ పాకిస్తాన్) ఆధ్వర్యంలో ఉన్నది[5] .