వర్తికా బ్రిజ్ నాథ్ సింగ్ (1993-08-26) 26 ఆగస్టు 1993 (age 31) లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
పూర్వవిద్యార్థి
ఇసాబెల్లా థోబర్న్ కళాశాల, లక్నో విశ్వవిద్యాలయం లక్నో, భారతదేశం
వృత్తి
మోడల్
బిరుదు (లు)
ఫెమీనా మిస్ గ్రాండ్ ఇండియా 2015 మిస్ యూనివర్స్ ఇండియా 2019
ప్రధానమైన పోటీ (లు)
మిస్ దివా 2014 (టాప్ 7) ఫెమినా మిస్ ఇండియా 2015 (ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2015) మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2015 (2వ రన్నర్-అప్) మిస్ దివా 2019 (విజేత - మిస్ యూనివర్స్ ఇండియా 2019) మిస్ యూనివర్స్ 2019 (టాప్ 20)
వర్తికా బ్రిజ్ నాథ్ సింగ్ (జననం 1993 ఆగస్టు 26) భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్, ఆమె మిస్ యూనివర్స్ ఇండియా 2019గా నిలిచింది. మిస్ యూనివర్స్ పోటీ 68వ ఎడిషన్‌లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1] దీనికి ముందు, ఆమె 2015లో ఫెమినా మిస్ ఇండియా ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్‌గా కిరీటాన్ని పొందింది.[2]జిక్యూ మ్యాగజైన్ (GQ) ఆమెను 2017లో భారతదేశంలోని హాటెస్ట్ మహిళల్లో ఒకరుగా నిలిపింది.[3][4]
ఆమె 1991 ఆగస్టు 27న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించింది. అక్కడ, ఆమె కనోస్సా కాన్వెంట్ స్కూల్‌లో చదువుకుంది.[5] ఆమె ఇసాబెల్లా థోబర్న్ కళాశాల నుండి క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.[6] ఆమె లక్నో విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసింది.[7]
ఆమె మిస్ దివా 2014 పోటీలో పాల్గొన్నది, అక్కడ ఆమె టాప్ 7లో నిలిచింది. పోటీలో ఆమె 'మిస్ ఫోటోజెనిక్' అవార్డును కూడా గెలుచుకుంది.[8] 2015లో, ఆమె ఫెమినా మిస్ ఇండియా పోటీల 52వ ఎడిషన్‌లో పోటీ పడింది. ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2015 కిరీటాన్ని పొందింది.[9]