వల్లూరు (టంగుటూరు) | |
---|---|
![]() | |
అక్షాంశ రేఖాంశాలు: 15°25′16.284″N 80°2′32.712″E / 15.42119000°N 80.04242000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | టంగుటూరు |
విస్తీర్ణం | 24.14 కి.మీ2 (9.32 చ. మై) |
జనాభా (2011)[1] | 3,476 |
• జనసాంద్రత | 140/కి.మీ2 (370/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 1,683 |
• స్త్రీలు | 1,793 |
• లింగ నిష్పత్తి | 1,065 |
• నివాసాలు | 931 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08592 ![]() |
పిన్‌కోడ్ | 523272 |
2011 జనగణన కోడ్ | 591361 |
వల్లూరు, టంగుటూరు, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలానికి చెందిన గ్రామం.ఈ గ్రామం, ఒంగోలు పట్టణానికి దక్షిణంగా 8 కి.మీ.దూరంలో జాతీయ రహదారి ప్రక్కన ఉంది.బంగాళాఖాతానికి సుమారు 8 కి.మీ దూరములో ఉంది.
మల్లవరపాడు 2.6 కి.మీ, పాలేటిపాడు 3.1 కి.మీ, తుమ్మడు 3.6 కి.మీ, మర్లపాడు 4.2 కి.మీ, వావిలేటిపాడు 4.8 కి.మీ.
వల్లూరు గ్రామానికి రోడ్డు,రైలు రవాణా మార్గాలు అతి సమీపంలో ఉన్నాయి.వల్లూరు గ్రామాన్ని ఆనుకుని జాతీయ రహదారి నెం.5 పోవుచున్నది.ఒంగోలు పట్టణం నుండి కందుకూరు,కావలి,కొండేపి,మడనూరు,చాకిచర్ల, కారుమంచి వంటి తెలుగు వెలుగు బస్సుల ద్వరా అరగంటలో విజయవాడ,గూడురు రైలు సూరారెడ్డిపాలెం రైల్వే స్టేషన్ వల్లూరుకు సుమారుగా కిలోమీటరు దూరంలో ఉంది.
వల్లూరు గ్రామంలో 1 నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల, 6 నుండి 10వ తరగతి వరకు ఉన్నత పాఠశాలలు (హై స్కూల్) ఉన్నాయి.ఉన్నత పాఠశాల పేరును టంగుటూరి ప్రకాశం పంతులు గారి గుర్తుగా ఆంధ్రకేసరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా పేరు పెట్టారు.ఒకప్పుడు బడులు పిల్లలతో కలకలలాడేవి.కాని తల్లిదండ్రుల ప్రైవేటు పాఠశాలల వ్యామోహం వలన వీటి భవితవ్యం ప్రమాదంలో పడింది.
గ్రామంలో దాదాపుగా ప్రతి బజారుకి సిమెంటు రోడ్లు,కరూర్ వైశ్యా బ్యాంక్,ఓవర్ హెడ్ టాంక్, R.O వాటర్ ప్లాంట్ ఉన్నాయి.గ్రామ పరిధిలో వంటి కళాశాలలు ఉన్నాయి.
వల్లూరు గ్రామానికి పెద్ద చెరువు ఉంది.చెరువుకి తూర్పుగా గ్రామం, పంట పొలాలు విస్తరించి ఉన్నాయి.చెరువుకి పడమరగా మెట్ట భూములు ఉన్నాయి.ఇందులో ఎక్కువగా జామాయిల్,మినప,మిరప వంటివి సాగులో ఉన్నాయి.ఇక్కడే మామిడి తోట కూడా ఉంది.చెరువుకి తూర్పుగా ఉన్న మాగాణిలో ఎక్కువగా వరి సాగు చేస్తారు.ఈ సాగు పూర్తిగా చెరువు నీటిపై ఆధారపడి ఉంది.కానీ చెరువు వర్షం వచ్చినపుడు మాత్రమే నిండుతుంది.కావున ప్రతి సంవత్సరం వరి పండదు.ఇక్కడి నేలలు తక్కువ సారవంతమైనవి.
2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో చుండి సుబ్బమ్మ సర్పంచిగా ఎన్నికైనారు.
వల్లూరమ్మ దేవాలయం ప్రకాశం జిల్లా లోనే కాక నెల్లూరు,గుంటూరు జిల్లాలలో మంచి పేరు కలిగి ఉంది.దసరా,సంక్రాంతి వంటి పండుగలు బాగా జరుపుతారు.
వల్లూరు గ్రామంలో అనేక కులవృత్తులు కలవారు నివసిస్తున్నారు.ఒకప్పుడు బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవారు.కాని వారి పట్టణ వలసల వలన వారి సంఖ్య నేడు తగ్గినది.ఇక వృత్తి కులాలలో చాకలి,మంగలి,కంసాలి,కుమ్మరి వంటి కులాల వారు ఉన్నారు.ఇంకా రెడ్డి,యాదవ,బలిజ,వడ్డెర,మరాఠి,కోమటి శెట్టి,మాల,మాదిగ,సాయిబులు,ఎరుకలు మొదలయిన కులస్తులు గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం, కూలి పనుల మీద ఆధారపడి జీవిస్తున్నారు.కూలి పనులకు సమీప పట్టణమైన ఒంగోలుకు వెళతారు.చాలా మంది పశుపోషణ కూడా జీవనాధారంగా కలిగి ఉన్నారు.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,391. ఇందులో పురుషుల సంఖ్య 1,687, మహిళల సంఖ్య 1,704, గ్రామంలో నివాస గృహాలు 870 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,414 హెక్టారులు.