వసంత్ కుమార్ రవి, భారతీయ వైద్యుడు, తమిళ సినిమా నటుడు.[1] ఆయన 10వ విజయ్ అవార్డ్స్, 2018లో జియో 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ తొలి నటుడు పురస్కారం అందుకున్న తన తొలి చిత్రం తారామణి (2017). ఈ చిత్రంలో ఆయన నటనతో తమిళం, తెలుగు చిత్రసీమల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు.
2023లో విడుదలైన అశ్విన్స్, జైలర్ చిత్రాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యాడు.[2][3]
ఆయన రవి ముత్తుకృష్ణన్ కుమారుడు. వీరిది నమ్మ వీడు వసంత భవన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ వ్యాపారం.
ఆయన ముందుగా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్‌లో హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసాడు.[4] ఆ తరువాత 2013లో, ఆయన దర్శకుడు రామ్ రూపొందించిన తారామణి సినిమాలో నటించాడు.[5] అయితే ఈ సినిమా ఆగస్టు 2017లో విడుదలయింది. అయినా ఈ చిత్రం ఆయనకు సానుకూల సమీక్షలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో అతని నటనతో పాటు ఆండ్రియా జర్మియా ప్రధాన పాత్రలో ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది.[6] ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్‌లో ఆయనకు ఉత్తమ పురుష నటుడిగా అరంగేట్రం చేసినందుకు పురస్కారం అందుకున్నాడు. 2018 విజయ్ అవార్డ్స్‌లో ఆయనకి ఉత్తమ తొలి నటుడు అవార్డు కూడా లభించింది.[7][8][9][10]
2018 జూన్ 16న జరిగిన 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో, ఆయన ఉత్తమ తొలి నటుడిగా అవార్డు పొందాడు. ఆయన రెండవ చిత్రం 2021లో వచ్చిన రాకీ. ఇది అపారమైన విమర్శకుల ప్రశంసలను అందుకుంది, అయితే ఇది ఒక మోస్తరు బాక్స్-ఆఫీస్ విజయం మాత్రమే.