వస్త్రాపూర్ సరస్సు భారతదేశం లోని గుజరాత్ రాష్ట్రంలో గల అహ్మదాబాద్ కు పశ్చిమాన ఉంది. దీనికి అధికారికంగా గుజరాత్ కవి నర్సింగ్ మెహతా జ్ఞాపకార్థం భక్త కవి నర్సింగ్ మెహతా సరోవర్ అని పేరు పెట్టారు.
ప్రతి వారాంతంలో చాలా మంది ఈ సరస్సును సందర్శిస్తారు. ఇది ప్రస్తుతం ఒక ప్రదర్శనశాలను, పిల్లల ఉద్యానవనాన్ని కలిగి ఉంది. సరస్సు చుట్టూ ఉన్న మార్గం గుండా ఉదయం, సాయంత్రం సమయాల్లో చాలా మంది జాగింగ్ చేస్తూ ఉంటారు.
ఈ సరస్సు చుట్టూ ఉన్న పచ్చని పచ్చిక బయళ్ళలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. నర్మదా నది నుండి వచ్చే నీరు ఈ సరస్సులోకి అప్పుడప్పుడు వస్తుంది.[1]
2013 లో, నర్సింగ్ మెహతా జ్ఞాపకార్థం వస్త్రాపూర్ సరస్సును భక్త కవి నర్సింగ్ మెహతా సరోవర్ గా మార్చారు. సరస్సు తోటలో నర్సింగ్ మెహతా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.[2]
2016 లో, సరస్సు దాదాపు ఎండిపోయింది. ప్రజలు చనిపోయిన చేపలను తొలగించి, మిగిలి ఉన్న చేపలను వేరే చోటికి తరలించారు.[3]
సెప్టెంబర్ 2019 లో, అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఈ సరస్సును నర్మదా నది నీటితో నింపాలని ప్రణాళికలు వేశారు.