వాంటెడ్ | |
---|---|
దర్శకత్వం | పరశురామ్ |
రచన | బి.వి.ఎస్ రవి (కథ/చిత్రానువాదం/మాటలు) |
నిర్మాత | వి. ఆనంద ప్రసాద్ |
తారాగణం | గోపీచంద్, దీక్షా సేథ్ |
ఛాయాగ్రహణం | రసూల్ ఎల్లోర్ |
కూర్పు | శంకర్ |
సంగీతం | చక్రి, మణిశర్మ |
నిర్మాణ సంస్థ | భవ్య క్రియేషన్స్ |
విడుదల తేదీ | 26 జనవరి 2011 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వాంటెడ్ అనేది 2011, జనవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద ప్రసాద్ నిర్మాణంలో బివిఎస్ రవి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గోపీచంద్, దీక్షా సేథ్ జంటగా నటించగా, చక్రి సంగీతాన్ని రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రం తర్వాత హిందీలోకి జాంబాజ్ కి జుంగ్[2], తమిళంలోకి వేంగై పులి[3] అనే పేర్లతో అనువదించబడింది.
రాంబాబు ఏ పనీ చేయకుండా సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి తల్లిదండ్రులు తమ కొడుకు కోసం చాలా సంపాదించారు. దాంతో తన బ్యాచ్‌తో కలిసి రోడ్లపై తిరగడం తప్ప వేరే పనిలేకుండా ఉంటాడు. ఒకరోజు రాంబాబుకు నందిని అనే హౌస్ సర్జన్ కలుస్తుంది. తన తల్లికి గుండెపోటు వచ్చినప్పుడు నందిని చికిత్స చేసి ప్రాణాలను కాపాడుతుంది. దాంతో రాంబాబు తొలిచూపులోనే నందిని ప్రేమలో పడతాడు. నందినిని ఆటపట్టిస్తున్న గూండాలను రాంబాబు కొట్టి, ఆమె ప్రేమను గెలవడానికి ఇంకా ఏమి చేయాలని అడుగుతాడు. లోకల్ డ్రగ్ డాన్ బసవరెడ్డిని కొట్టాలని నందిని కోరుతుంది. నందిని రఘునాథ్ అనే పోలీసు కుమార్తె, ఆమె కుటుంబాన్ని బసవరెడ్డి చంపేస్తాడు. అందుకోసం బసవరెడ్డిని చంపాలని పగ పెంచుకుంటుంది. దానికి రాంబాబును తన ఆయుధంగా ఉపయోగించుకుంటుంది. నందిని టాస్క్‌ని రాంబాబు ఎలా ముగించాడు, నందిని ప్రేమను ఎలా గెలుచుకున్నాడన్నది మిగిలిన కథ.
ఇందులోని అన్ని పాటలను భాస్కరభట్ల రవికుమార్ రాశాడు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. ఆడియో వేడుక రామానాయుడు స్టూడియోలో జరిగింది. సీడీ తొలి కాపీని ప్రభాస్ ఆవిష్కరించి నటి జయసుధకు అందించాడు.[4]
ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "అరకిలో పొగరు" | రంజిత్ | 4.46 |
2. | "ఏవేవో పిచ్చి వేషాలు" | జావేద్ ఆలీ | 5.23 |
3. | "దిల్ మేరా ధక్ ధక్" | ఉదిత్ నారాయణ్, స్మిత | 4:48 |
4. | "చెప్పనా చెప్పనా" | చక్రి, కౌసల్య | 5:36 |
5. | "ఏ ఫర్ ఏంజిల్" | కృష్ణ చైతన్య, ఎం. ఎం. శ్రీలేఖ | 3:48 |
మొత్తం నిడివి: | 24:21 |