వారసుడు | |
---|---|
దర్శకత్వం | వంశీ పైడిపల్లి |
రచన | వంశీ పైడిపల్లి హరి ఆశిషోర్ సోలమన్ |
మాటలు | వివేక్ |
నిర్మాత | దిల్‌రాజు శిరీష్ పరమ్ వి పొట్లూరి పెరల్ వి పొట్లూరి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | కార్తీక్ పళని |
కూర్పు | కె.ఎల్. ప్రవీణ్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థలు | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ |
విడుదల తేదీ | 14 జనవరి 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వారసుడు 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్‌లపై దిల్‌రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. విజయ్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలైంది.[1]
వ్యాపార శిఖరం మునిగి ఉన్న తండ్రి తో గొడవ పడి విజయ్ ఇంటి వదిలేస్తాడు. కాని విజయ్ కి తల్లి అంటే ఇష్టం ఉండటం వల్ల ఏడు సంవత్సరాల తరువాత తల్లి కోసం షష్ఠి పూర్తి ఉత్సవానికి మళ్లీ ఇంటికి వస్తాడు. ఈలోపు విజయ్ తన ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు వేరే వేరే సమస్యలు తెస్తారు.